తెలుగు న్యూస్ / ఫోటో /
OTT Releases: ఓటీటీలో బ్లాక్ బస్టర్ చిత్రాలు.. యానిమల్ నుంచి సామ్ బహదూర్ వరకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఇవే!
OTT Release This Week: జనవరి 25 అర్థరాత్రి నుంచి రణ్‌బీర్ కపూర్ యానిమల్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇలా యానిమల్ నుంచి విక్కీ కౌశల్ సామ్ బహదూర్ సినిమాల వరకు ఈవారం ఓటీటీలో వస్తున్న సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.
(1 / 6)
ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసే వారికి ఈ వారం పండుగే అని చెప్పొచ్చు. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టిన చాలా సినిమాలు ఈ వారం OTTలో విడుదలవుతున్నాయి. రణబీర్ కపూర్, రష్మిక మందన్న నటించిన యానిమల్, విక్కీ కౌశల్ నటించిన సామ్ బహదూర్ వంటి సినిమాలు OTTలో విడుదలవుతున్నాయి. (Instagram)
(2 / 6)
యానిమల్ ఓటీటీ రిలీజ్: రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్నా యాక్షన్ మూవీ యానిమల్ మూవీ జనవరి 26న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రిమింగ్ కానుంది. ఇవాళ అర్థరాత్రి నుంచే యానిమల్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నారు. థియేటర్లలో చూడనివారు ఓటీటీలో యానిమల్ ను వీక్షించవచ్చు. (Instagram)
(3 / 6)
కర్మ కాలింగ్ ఓటీటీ: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ లేటెస్ట్ వెబ్ సిరీస్ 'కర్మ కాలింగ్' ఈ శుక్రవారం విడుదలవుతోంది. కర్మ కాలింగ్ వెబ్ సిరీస్ జనవరి 26న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. (Instagram)
(4 / 6)
సామ్ బహుదూర్ ఓటీటీ రిలీజ్ డేట్: సామ్ బహుదూర్ మూవీ జనవరి 26న జీ5లో విడుదల కానుంది. ఈ దేశభక్తి మూవీని రిపబ్లిక్ డే సందర్భంగా చూడొచ్చు. విక్కీ కౌశల్ హీరోగా నటించిన సామ్ బహదూర్ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. (Instagram)
(5 / 6)
ఏజెంట్ ఓటీటీ విడుదల: ఎట్టకేలకు అక్కినేని అఖిల్ ఏజెంట్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఏజెంట్ సినిమా జనవరి 26న సోనీ లైవ్‌లో రిలీజ్ కానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఏజెంట్ మూవీలో మమ్ముట్టి, డినో మోరియా, సాక్షి వైద్య ప్రధాన పాత్రలు పోషించారు.(Instagram)
ఇతర గ్యాలరీలు