OTT Today Telugu: ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా- 9.6 ఐఎమ్‌డీబీ రేటింగ్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?-laggam ott streaming on aha ott sai ronak pragya nagra telugu romantic movie laggam ott release today ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Today Telugu: ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా- 9.6 ఐఎమ్‌డీబీ రేటింగ్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Today Telugu: ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా- 9.6 ఐఎమ్‌డీబీ రేటింగ్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Nov 22, 2024 03:36 PM IST

Laggam OTT Streaming: ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ లగ్గం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. 9.6 ఐఎమ్‌డీబీ రేటింగ్ సాధించుకున్న లగ్గం మూవీ దాదాపుగా 22 రోజుల్లో ఓటీటీ రిలీజ్ అయింది. సాయి రోనక్, రాజేంద్ర ప్రసాద్ నటించిన లగ్గం ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా.. 9.6 ఐఎమ్‌డీబీ రేటింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా.. 9.6 ఐఎమ్‌డీబీ రేటింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Laggam OTT Release: "ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు" అన్నారు పెద్దలు. ఇల్లు ఈఎమ్ఐలో కొనుక్కొవచ్చు ముందు పెళ్లి చేద్దాంరండి" అంటూ డిఫరెంట్‌గా డైరెక్టర్ రమేష్ చెప్పాల ప్రమోషన్స్ చేసిన తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ లగ్గం.

భీమదేవరపల్లి బ్రాంచి మూవీతో

సుభిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో వేణుగోపాల్ రెడ్డి నిర్మించారు. లగ్గం సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు డైరెక్టర్ రమేష్ చెప్పాల. దర్శకుడు రమేష్ చెప్పాల ఇంతకుముందు భీమదేవరపల్లి బ్రాంచి మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లగ్గం సినిమాలో యంగ్ హీరో సాయి రోనక్ కథానాయకుడిగా నటించగా.. నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్ర పోషించారు.

తెలుగు కల్చర్ తెలిసేలా

ప్రెషర్ కుక్కర్, పాప్‌కార్న్, రాజయోగం, ఛలో ప్రేమిద్దాం వంటి సినిమాలతోపాటు ఓదెల రైల్వే స్టేషన్ ఓటీటీ మూవీతో అలరించిన సాయి రోనక్‌కు జంటగా లగ్గం సినిమాలో ప్రగ్యా నగ్రా హీరోయిన్‌గా నటించింది. తెలుగు కల్చర్‌తో జరిగే పెళ్లిల్లలో ఉండే మజా, మర్యాదలు, ఆట, పాటలు, బంధువులు వంటి అన్ని రకాల ఎమోషన్స్‌తో లగ్గం సినిమాను తెరకెక్కించారు.

డీసెంట్ టాక్ తెచ్చుకుని

పలు వాయిదాలు అనంతరం అక్టోబర్ 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది లగ్గం సినిమా. రిలీజైన తొలి రోజు నుంచే డీసెంట్ టాక్ తెచ్చుకున్న లగ్గం సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. డిఫరెంట్‌గా ప్రమోషన్స్ చేపట్టినా, ట్రైలర్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన థియేటర్లలో సినిమాను చూసేందుకు అంతగా ఆసక్తి చూపలేదు తెలుగు ఆడియెన్స్.

22 రోజులకే ఓటీటీ స్ట్రీమింగ్

అందుకే, దాదాపుగా 22 రోజులకు ఓటీటీలోకి వచ్చేసింది లగ్గం సినిమా. సాఫ్ట్‌వేర్ సంబంధాలు, ప్రేమ, పెళ్లి చూపులు, దావత్‌లు వంటి అంశాలతో రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన లగ్గం ఆహా ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్ అయిన లగ్గం సినిమా ఆహా ఓటీటీలో ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయొచ్చు.

9.6 ఐఎమ్‌డీబీ రేటింగ్

ఇదిలా ఉంటే, లగ్గం సినిమా ఐఎమ్‌డీబీ నుంచి ఏకంగా 9.6 రేటింగ్ సాధించిందుకుంది. ఇది మాములు విషయం కాదు. అయితే, ఐఎమ్‌డీబీలో ఓట్స్ వేసిన వారు ఇచ్చిన రేటింగ్‌ను బట్టి ఓవరాల్ రేటింగ్ నిర్ణయిస్తారు. లగ్గం సినిమాకు 3, 565 మంది ఓట్లు వేసి రేటింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వాళ్లు ఇచ్చిన రేటింగ్‌ను బట్టి 9.6 రేటింగ్ నమోదు అయినట్లుగా సమాచారం.

లగ్గం నటీనటులు

ఇదిలా ఉంటే, లగ్గం సినిమాలో సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్ర ప్రసాద్‌తోపాటు రోహిణి, సప్తగిరి, ఎల్బీ శ్రీరామ్, రఘుబాబు, కృష్ణుడు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమాని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చంద్ర, చిత్రం శ్రీను, లక్ష్మణ్ మీసాల, సంధ్య గంధం, టి. సుగుణ, ప్రభావతి, కంచరపాలెం రాజు, వివా రెడ్డి, ప్రభాస్ శ్రీను, సదన్న, రవి వర్మ, కిరీటి, రవి ప్రకాష్, బాషా, విజయ లక్ష్మి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

Whats_app_banner