Osey Arundhati: భర్తను చంపేసిన హీరోయిన్.. వెన్నెల కిశోర్ ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్‌.. ఒసేయ్ అరుంధతి టీజర్ రిలీజ్!-osey arundhati teaser released starrer by vennela kishore kamal kamaraju monika chauhan family comedy thriller ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Osey Arundhati: భర్తను చంపేసిన హీరోయిన్.. వెన్నెల కిశోర్ ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్‌.. ఒసేయ్ అరుంధతి టీజర్ రిలీజ్!

Osey Arundhati: భర్తను చంపేసిన హీరోయిన్.. వెన్నెల కిశోర్ ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్‌.. ఒసేయ్ అరుంధతి టీజర్ రిలీజ్!

Sanjiv Kumar HT Telugu
Nov 28, 2024 11:19 AM IST

Vennela Kishore Osey Arundhati Teaser Release: కమెడియన్ వెన్నెల కిశోర్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్ మూవీ ఒసేయ్ అరుంధతి. భర్తను చంపేసిన హీరోయిన్ కథగా తెరకెక్కిన ఒసేయ్ అరుంధతి టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ఒసేయ్ అరుంధతి టీజర్ విశేషాల్లోకి వెళితే..

భర్తను చంపేసిన హీరోయిన్.. వెన్నెల కిశోర్ ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్‌.. ఒసేయ్ అరుంధతి టీజర్ రిలీజ్!
భర్తను చంపేసిన హీరోయిన్.. వెన్నెల కిశోర్ ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్‌.. ఒసేయ్ అరుంధతి టీజర్ రిలీజ్!

Vennela Kishore Osey Arundhati Teaser: కమెడియన్‌గా, హీరోగా ఆకట్టుకున్నాడు వెన్నెల కిషోర్. తాజాగా వెన్నెల కిశోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఒసేయ్ అరుంధతి’. ఈ సినిమాకు విక్రాంత్ కుమార్ దర్శకత్వం వహించారు.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి

ప‌ద్మ నారాయ‌ణ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రణయ్ రెడ్డి గూడూరు ఈ ఒసేయ్ అరుంధతి సినిమాను నిర్మిస్తున్నారు. షూటింగ్, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఇటీవల ఒసేయ్ అరుంధతి మూవీ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

భర్తను చంపిన హీరోయిన్

ఒసేయ్ అరుంధతి టీజర్ ప్రారంభం ఒక డెడ్ బాడీ కోసం పోలీసులు వెతుకుంటారు. ఆ డెడ్ బాడీ హీరోయిన్ భర్తది అని తెలుస్తోంది. పెళ్లైన హీరోయిన్ అనుకోని ప‌రిస్థితుల్లో భ‌ర్త‌ను హ‌త్య చేస్తుంది. శ‌వాన్ని దాచి పెట్టి పారిపోవ‌టానికి ప్ర‌య‌త్నిస్తుందని టీజర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. శ‌వాన్ని వెతికే క్ర‌మంలో పోలీసులు ఓ తాగుబోతు స‌హా అనుమానం ఉన్న కొంద‌రిని అరెస్ట్ చేస్తారు.

తాగుబోతు చెప్పే నిజాలు

నేనే చంపాను. పాతిపెట్టాను అని తాగుబోతు చెప్పే డైలాగ్ క్యూరియాసిటీగా ఉంది. ఇక టీజర్ ఎండింగ్‌లో ఈ బాడీని ముక్కలు ముక్కలు చేద్దాం అని అమాయకంగా హీరోయిన్ చెప్పడం హైలెట్‌గా నిలిచింది. ఫ్యామిలీ కామెడీ థ్రిల్ల‌ర్‌గా ఒసేయ్ అరుంధథి సినిమాను తెర‌కెక్కించారు. టీజ‌ర్ సినిమాపై మ‌రింత ఆస‌క్తిని పెంచుతుంది.

ఎలాంటి మలుపులు తిరిగింది

క‌థ ఎలాంటి మ‌లుపులు తీసుకుంది.. ఇంత‌కీ హీరోయిన్ త‌న భ‌ర్త‌ను ఎందుకు చంపింది.. అనే విష‌యాలు తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో చిత్ర నిర్మాత ప్రణయ్ రెడ్డి గూడూరు మాట్లాడుతూ.. "కమల్ కామరాజు, వెన్నెల కిశోర్, మోనికలతో ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్‌గా ‘ఒసేయ్ అరుంధతి’ సినిమాను నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలుపూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం" అని అన్నారు.

సత్యనారాయణ స్వామి వ్రతం

చిత్ర దర్శకుడు విక్రాంత్ కుమార్ మాట్లాడుతూ.. "హైదరాబాద్‌లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇల్లాలు అరుంధతి పిల్లాడితో పాటు ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఉంటుంది. ఓసారి సత్యనారాయణ స్వామి వత్రం చేయాలని అనుకుంటుంది. అయితే అనుకోకుండా అరుంధతికి ఓ సమస్య వస్తుంది" అని సినిమా కథపై హింట్ ఇచ్చారు.

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్

"ఆ సమస్య నుంచి ఇల్లాలు తనని తాను కాపాడుకుంటూ ఇంటి పరువును ఎలా కాపాడుకుంటుందనేదే ‘ఒసేయ్ అరుంధతి’ సినిమా. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు కామెడీ ప్రధానంగా సాగే చిత్రమిది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. త్వ‌ర‌లోనే ఆడియెన్స్ ముందుకు సినిమాను తీసుకొస్తాం" అని చెప్పారు డైరెక్టర్ విక్రాంత్ కుమార్.

Whats_app_banner