OTT Thriller Movie: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తమిళ థ్రిల్లర్ మూవీ.. అడవిలో అమ్మాయి చేసే సాహసం
OTT Thriller Movie: ఓటీటీలోకి ఏడాది తర్వాత ఓ తమిళ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చింది. గతేడాది డిసెంబర్ లో థియేటర్లలో రిలీజై ప్రేక్షకుల మంచి థ్రిల్ అందించిన ఈ సినిమా ఇప్పుడు ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
OTT Thriller Movie: తమిళ థ్రిల్లర్ మూవీ ఒకటి 11 నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ అయింది. ఈ సినిమా పేరు వివేసిని (Vivesini). ఓ అడవిలో ఓ అమ్మాయి చేసే సాహసం చుట్టూ తిరిగే కథతో వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. గతేడాది డిసెంబర్ 15న రిలీజైన ఈ సినిమాను ఇప్పుడు ఆహా తమిళ్ ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తోంది.
ఓ అమ్మాయి కొందరు స్నేహితులతో కలిసి చేసే సాహసాన్ని ఇందులో చూడొచ్చు. గతేడాది డిసెంబర్ 15న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా 11 నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది.
వివేసిని మూవీ స్టోరీ ఇదీ..
వివేసిని అంటే ఆలోచనాపరులు అని అర్థం. భవన్ రాజగోపాలన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాజర్, కావ్య, సూరజ్ లాంటి వాళ్ల ముఖ్యమైన పాత్రలు పోషించారు. నిజానికి 2019లోనే ఈ మూవీ ప్రొడక్షన్ మొదలైనా.. నాలుగేళ్ల తర్వాత అంటే గతేడాది డిసెంబర్ లో రిలీజైంది.
కొవిడ్ కారణంగా నిర్మాణం బాగా ఆలస్యమైంది. ఊళ్లోవాళ్లవి ఉత్త మూఢనమ్మకాలే అని, వాటిని తప్పని నిరూపిస్తానంటూ ఓ భయానకమైన అడవిలోకి వెళ్తుంది ఓ అమ్మాయి. ఆమెతోపాటు కొందరు స్నేహితులు కూడా అక్కడి రహస్యాలను ఛేదించడానికి వెళ్తారు. అయితే వాళ్ల ఈ సాహసం తర్వాత ఎలాంటి పరిణామాలకు దారి తీసిందన్నది ఈ సినిమాలో చూడొచ్చు.
వివేసిని మూవీకి ఐఎండీబీలో ప్రేక్షకులు 6.3 రేటింగ్ ఇచ్చారు. థియేటర్లలో పెద్దగా ఆడని ఇలాంటి సినిమాలకు ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ దక్కడం చూస్తూనే ఉన్నాం. మరి ఆహా తమిళం ఓటీటీలోకి వచ్చిన ఈ వివేసిని ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.