Black Carrots: నారింజ క్యారెట్ల కన్నా నల్ల క్యారెట్లే ఆరోగ్యానికి మంచివా? ముఖంపై ముడతలు, మొటిమలు పొగొడతాయా?-are black carrots better for health than orange carrots wrinkles on the face ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Black Carrots: నారింజ క్యారెట్ల కన్నా నల్ల క్యారెట్లే ఆరోగ్యానికి మంచివా? ముఖంపై ముడతలు, మొటిమలు పొగొడతాయా?

Black Carrots: నారింజ క్యారెట్ల కన్నా నల్ల క్యారెట్లే ఆరోగ్యానికి మంచివా? ముఖంపై ముడతలు, మొటిమలు పొగొడతాయా?

Haritha Chappa HT Telugu
Nov 27, 2024 07:00 PM IST

Black Carrots: బ్లాక్ క్యారెట్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. నారింజ క్యారెట్లనే అధికంగా తింటారు. ఇవే అధికంగా మార్కెట్లో దొరుకుతాయి. నిజానికి నల్ల క్యారెట్లు కూడా ఆరోగ్యానికి, అందానికి ఒక వరమనే చెప్పాలి.

నల్ల క్యారెట్లతో అందం
నల్ల క్యారెట్లతో అందం (Unsplash)

చలికాలం ఎక్కువగా కనిపించే దుంపల్లో క్యారెట్లు ఒకటి. ఈ సీజన్‌లో క్యారెట్లు అధికంగా ఉంటాయి కాబట్టి వీటిని తినాల్సిందే. సీజనల్ గా దొరికే ఆహారాలను ఆయా సీజన్లో తినాల్సిందే. క్యారెట్ వినియోగం కూడా ఆరోగ్యానికి అనేక అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. కానీ ఎప్పుడూ ఆరెంజ్ రంగు క్యారెట్లనే తింటూ ఉంటారు. వీటిలో మరో రకం నల్ల క్యారెట్ రకం.  నల్ల క్యారెట్ల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఎరుపు క్యారెట్ల మాదిరిగానే, నల్ల క్యారెట్లు కూడా ఆరోగ్యానికి ఒక వరమనే చెబుతారు. నల్ల క్యారెట్లు తినడం వల్ల అందం కూడా పెరుగుతుంది. వీటిలో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, ఐరన్, ఆంథోసైనిన్స్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం ద్వారా జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.

మొటిమలు రాకుండా

నల్ల క్యారెట్లలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి  నిండుగా ఉంటాయి. వీటిని తినడం వల్ల చర్మం మెరిసి పోతుంది. ఆరెంజ్ క్యారెట్లు తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో  దీన్ని తినడం వల్ల కూడా ముడతలు తగ్గి చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమలు, మచ్చలు వంటి చర్మ సంబంధిత సమస్యలను తొలగించడానికి సహాయపడతాయి.

బ్లడ్ ప్రెజర్

అధిక రక్తపోటు బారిన పడిన వారు బ్లాక్ క్యారెట్ తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ లో ఉంటుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది.  దీనివల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తరచూ నల్ల క్యారెట్లు తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది.

నల్ల క్యారెట్లలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఒబేసిటీ లక్షణాలు ఉన్నాయి.  ఇవి కొవ్వు పేరుకుపోకుండా నియంత్రించడం ద్వారా జీవక్రియను మెరుగుపరుస్తాయి. వీటిని తినేవారు బరువు త్వరగా తగ్గే అవకాశం ఉంది.  నల్ల క్యారెట్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి.  మీరు దీనిని ఉదయం అల్పాహారం కోసం సలాడ్ గా తీసుకోవచ్చు.

నల్ల క్యారెట్లు శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో కూడా సహాయపడతాయి. నల్ల క్యారెట్లలో ఉండే ఆంథోసైనిన్స్ అని పిలిచే సమ్మేళనాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడటం ద్వారా బాధాకరమైన తాపజనక పరిస్థితుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

బ్లాక్ క్యారెట్ తరచూ తినడం వల్ల అమ్మాయిలకు మొటిమలు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. వారి చర్మం మెరుపు సంతరించుకుంటుంది. ఆరంజ్ రంగు క్యారెట్లు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో… నల్ల క్యారెట్లు తినడం వల్ల కూడా అవే ఉపయోగాలు దక్కుతాయి.

నల్ల క్యారెట్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది మలబద్ధకం, ఉబ్బరం,  గ్యాస్టిక్ వంటి జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది. పిల్లలకు కూడా ఈ బ్లాక్ క్యారెట్ కచ్చితంగా తినిపించాలి. ఇవి వారి మెదడుకు ఎంతో సహాయపడుతుంది.

 

 

 

 

Whats_app_banner