Periods: పీరియడ్స్ సమయంలో రొమ్ములు నొప్పిగా అనిపిస్తాయి ఎందుకు?-why do breasts feel sore during periods ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Periods: పీరియడ్స్ సమయంలో రొమ్ములు నొప్పిగా అనిపిస్తాయి ఎందుకు?

Periods: పీరియడ్స్ సమయంలో రొమ్ములు నొప్పిగా అనిపిస్తాయి ఎందుకు?

Haritha Chappa HT Telugu
Nov 27, 2024 02:00 PM IST

పీరియడ్స్ సమయంలో కొన్ని రకాల సమస్యలు వస్తాయి. అందులో పొట్ట నొప్పి, రొమ్ముల నొప్పి ఎక్కువగా కనిపిస్తాయి. ఇలా నెలసరి సమయంలో రొమ్ముల నొప్పి ఎందుకు వస్తుందో ప్రతి మహిళ తెలుసుకోవాలి.

పీరియడ్స్ సమస్యలు
పీరియడ్స్ సమస్యలు (Pixabay)

పీరియడ్స్ లక్షణాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. కొందరికి తీవ్రమైన పొట్టనొప్పి, నడుము నొప్పి వంటివి వస్తాయి. తీవ్రంగా అలసటగా అనిపిస్తుంది. నిజానికి పీరియడ్స్ కు ఒక వారం ముందు నుంచే లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరిలో వక్షోజాలు నొప్పిగా అనిపిస్తాయి. అవి సున్నితంగా మారిపోతాయి. ఇలా పీరియడ్స్ సమయంలో రొమ్ములు నొప్పి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

రొమ్ములు నొప్పి రావడం అనేది ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ లో సాధారణ లక్షణం. ఇది హార్మోన్ల మార్పుల వల్ల కనిపిస్తుంది. మీ పీరియడ్స్ ముగిసినప్పుడు కూడా ఇది ఎక్కువగా వస్తుంది. రొమ్ములు బరువుగా మారడం నొప్పిగా అనిపించడం అనేది ఎక్కువ మందిలో కనిపించే లక్షణమే.

పీరియడ్స్ సమయంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్లు తగ్గుతాయి. దానివల్లే రొమ్ములు నొప్పి పెడతాయి. ఈ హార్మోన్లు మీ పీరియడ్స్ సైకిల్‌ని నియంత్రిస్తాయి. ఈ సమయంలో మీకు రొమ్ము నొప్పి అధికంగా ఉంటే కొన్ని ఆహారాలు తినడం మానేయండి. టిఫిన్ ఉండే ఆహారాలను ఆల్కహాల్‌ను, ఉప్పు అధికంగా వేసిన ఆహారాలను తినడం మానేస్తే రొమ్ము నొప్పి ఎంతో కొంత తగ్గుతుంది. అలాగే కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని కూడా తినడం మానేయాలి.

క్యారెట్లు, అవకాడోలు, అరటి పండ్లు, పాలకూర, బ్రౌన్ రైస్, పల్లీలు వంటివి ఆహారంలో అధికంగా ఉండేలా చూసుకోండి. మెగ్నీషియం, విటమిన్ ఇ ఉన్న ఆహారాలను కూడా తింటే రొమ్ము నొప్పులు రాకుండా ఉంటాయి. ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల రొమ్ము నొప్పి తీవ్రం కాకుండా అడ్డుకోవచ్చు.

కొంతమంది అమ్మాయిలకు రజస్వల అయ్యాక ఛాతీలో నొప్పిని అనుభవిస్తారు. కొన్ని నెలల పాటు లేదా కొన్నేళ్ల పాటు ఈ ఛాతీ నొప్పి పీరియడ్స్ సమయంలో ఎక్కువగా కలుగుతుంది. అయితే వయసు పెరిగే కొద్దీ ఈ నొప్పి తగ్గిపోతుంది. అలా అని ప్రతి ఒక్కరికీ ఈ రొమ్ము నొప్పులు, పీరియడ్స్ సమయంలో రావాలని లేదు, కొందరికి రావు కూడా.

పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ రొమ్ము నొప్పిని మాస్టాల్జియా అని అంటారు. ఇది ఋతుచక్రంలో హార్మోన్లో హెచ్చుతగ్గులకు సంబంధించినది కేవలం పీరియడ్స్ సమయంలో రొమ్ము నొప్పులు వస్తే అవి నెలసరి వల్ల కానీ అనుకోవచ్చు. సాధారణంగా కూడా రొమ్ములు నొప్పి పెడుతూ ఉంటే మాత్రం వైద్యులకు సంప్రదించాల్సిన అవసరం ఉంది. అంతర్లీన గాయాల వల్ల, రొమ్ముల్లో ఏర్పడిన సిస్టుల వల్ల, పక్కటెముకల చుట్టూ ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల కూడా రొమ్ము నొప్పులు వస్తాయి. కాబట్టి పీరియడ్స్ లేకపోయినా కూడా రొమ్ములు బాధ పెడుతూ ఉంటే, నొప్పి పెడుతూ ఉంటే వైద్యులను కలవాల్సిన అవసరం ఉంది.

Whats_app_banner