(1 / 7)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. నిన్న పలువురు కేంద్ర మంత్రులను కలవగా.. ఇవాళ ప్రధానమంత్రి మోదీతో భేటీ అయ్యారు.
(2 / 7)
పార్లమెంట్ భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో మోదీతో పవన్ సమావేశమయ్యారు. జలజీవన్ మిషన్ అమలు, ఏపీకి నిధులపై చర్చించారు.
(3 / 7)
ఇటీవలే వచ్చిన ఎన్నికల ఫలితాలతో పాటు ఏపీ రాజకీయాలపై వీరద్దరి భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు ఏపీకి కేంద్రం చేస్తున్న సాయానికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు.
(4 / 7)
డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. కొన్ని రోజుల క్రితం ఆయన ఢిల్లీకి వెళ్లినప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తొలిసారి ఢిల్లీలో ప్రధానితో పవన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ప్రస్తుత పర్యటనలో వరుసగా పలువురు కేంద్రమంత్రులను కలిశారు.
(5 / 7)
ఇవాళ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో కూడా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను సింగల్ విండో విధానానికి మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
(6 / 7)
ఢిల్లీ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ ను పలువురు ఎంపీలు కలిశారు. ఏపీ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న పురందేశ్వరితో కాసేపు మాట్లాడారు.
ఇతర గ్యాలరీలు