AP TG Winter Updates: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలిగాలులు.. అల్లూరి, ఆదిలాబాద్‌లో 11డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు-cold winds shaking telugu states minimum temperatures of 11 degrees in alluri and adilabad ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Winter Updates: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలిగాలులు.. అల్లూరి, ఆదిలాబాద్‌లో 11డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు

AP TG Winter Updates: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలిగాలులు.. అల్లూరి, ఆదిలాబాద్‌లో 11డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు

Nov 27, 2024, 06:48 AM IST Bolleddu Sarath Chandra
Nov 27, 2024, 06:48 AM , IST

  • AP TG Winter Updates: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఆదిలాబాద్, అల్లూరి జిల్లాల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో 11 డిగ్రీలకు పడిపోయాయి. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రెండు రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలకంటే తక్కువగా నమోదవు తున్నాయి. 

తెలంగాణలో ఆదిలాబాద్‌లో కనిష్టంగా 9.7డిగ్రీలు, మెదక్‌లో 10.6డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్‌లో 12డిగ్రీలు, నిజామాబాద్‌లో  14.2 డిగ్రీలు, హన్మకొండలో 14.5డిగ్రీలు, హైదరాబాద్‌లో 14.8డిగ్రీలు, రామగుండంలో 15.4డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

(1 / 7)

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. తెలంగాణలోని ఆదిలాబాద్‌, ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 11డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.   

(2 / 7)

ఏజెన్సీ ప్రాంతాల్లో పగలంతా మంచు తెరలు వీడటం లేదు.   రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా కనిష్ట ఉష్ణోగ్ర తలు గణనీయంగా పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పొగ మంచు చు కురుస్తుండ కురుస్తుండ డంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవు తున్నాయి. 

(3 / 7)

అల్లూరి సీతారా మరాజు జిల్లా జి. మాడుగులలో అత్యల్పంగా 11 డిగ్రీలు నమోదైంది. దీంతో వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాల దులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంకంటే తక్కువగా నమోదవుతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. డిసెంబరు తొలి వారం నుంచి చలిగాలులు పెరిగే అవకాశముంది. ఉత్తర, ఈశాన్య భారతం మీదుగా వీచే గాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి ప్రభావం పెరు గుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 

(4 / 7)

పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, నంద్యాల, పల్నాడు, శ్రీసత్యసాయి, అనంతపురం, ప్రకాశం, అన్నమయ్య, తిరుపతి, శ్రీపొట్టిశ్రీ రాములు నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12 నుంచి 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు  నమోదవుతున్నాయి.

(5 / 7)

ఏజెన్సీ ప్రాంతాల్లో చలి గజగజలాడిస్తోంది.  అల్లూరి జిల్లాలోని గూడెం కొత్తవీది, చింతపల్లి, జి., మాడుగుల, పాడేరు, హుకుంపేట, డుంబ్రిగుడ, ముంచంగిపుట్టు, పెదబయలు, అరకు, అను తగిరి, పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం. సాలూరు మండలాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. 

(6 / 7)

తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా చలి తీవ్రత పెరుగుతోంది. అల్లూరి సీతారామరాజు కుంతలాం 11డిగ్రీలు,  అల్లూరి సీతారామరాజు జి.మాడుగులలో 11 అల్లూరి సీతారామరాజు డుంబ్రిగుడ 12.3 డిగ్రీలు అల్లూరి సీతారామరాజు చింతపల్లి 12.7 డిగ్రీలు, తిరుపతి పల్లాం 13.1 పార్వతీపురం మన్యం లేవిడి 13.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు తెలంగాణలోని ఆదిలాబాద్‌లో కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు