Fitness: ఉదయం వర్కౌట్స్‌ చేసే సమయంలో నీరసంగా అనిపిస్తోందా?-which foods i can eat before workout for boost stamina and energy ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fitness: ఉదయం వర్కౌట్స్‌ చేసే సమయంలో నీరసంగా అనిపిస్తోందా?

Fitness: ఉదయం వర్కౌట్స్‌ చేసే సమయంలో నీరసంగా అనిపిస్తోందా?

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 27, 2024 07:00 AM IST

Fitness: వ్యాయామం చేస్తున్న సమయంలో కొందరికి చాలా నీరసంగా అనిపిస్తుంది. దీంతో ఎఫెక్టివ్‍గా వర్కౌట్స్ చేయలేకపోతారు. వ్యాయామానికి ముందుకు కొన్ని ఫుడ్స్ తీసుకుంటే నీరసం రాకుండా ఉంటుంది. అవేంటంటే..

Fitness: ఉదయం వర్కౌట్స్‌ చేసే సమయంలో నీరసంగా అనిపిస్తోందా?
Fitness: ఉదయం వర్కౌట్స్‌ చేసే సమయంలో నీరసంగా అనిపిస్తోందా?

ఫిట్‍నెస్ సాధించేందుకు చాలా మంది వర్కౌట్స్ చేస్తుంటారు. వ్యాయామాలు చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరగడంతో పాటు శరీర బరువును కూడా సరిగా మెయింటెన్ చేయొచ్చు. ఫిట్‍నెస్ గోల్స్ సాధించేందుకు చాలా మంది కృషి చేస్తుంటారు. అయితే, కొందరు ఉదయాన్నే వర్కౌట్స్ చేసే సమయంలో నీరసానికి గురవుతారు. దీంతో వ్యాయామాన్ని సరిగా చేయలేకపోతారు. అయితే, వర్కౌట్లు చేసే ముందు కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే శరీరంలో ఎనర్జీ వస్తుంది.

అయితే, ఫుడ్స్ తీసుకునేందుకు, వర్కౌట్స్ చేసేందుకు మధ్య అరగంట నుంచి గంట గ్యాప్ ఉండాలి. ఎనర్జీ కోసం వ్యాయామానికి ముందు తినాల్సిన ఆహారాలు ఏవో ఇక్కడ చూడండి.

కోడిగుడ్లు

కోడిగుడ్లలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. విటమిన్ డీ, ఏ, బీ2, ఐరన్, అయోడిన్, పాస్ఫరస్ లాంటి పోషకాలను గుడ్లు కలిగి ఉంటాయి. అందుకే వర్కౌట్స్ చేసే ముందు కోడిగుడ్లు తీసుకోవడం చాలా మంచిది. ఉడికించిన గుడ్లు తింటే శరీరానికి మంచి ఎనర్జీ వస్తుంది. వ్యాయామం చేసేందుకు బాడీకి మంచి శక్తి వచ్చేందుకు గుడ్లను తీసుకోవచ్చు. ఇవి తింటే వర్కౌట్స్ చేసే సమయంలో నీరసం వచ్చే అవకాశం తగ్గుతుంది. మెరుగ్గా వ్యాయామాలు చేయొచ్చు.

నట్స్, సీడ్స్

వాల్‍నట్స్, బాదం, జీడిపప్పుల్లో మెగ్నిషియం, మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. కీలకమైన విటమిన్లు, మినరళ్లను కూడా ఇవి కలిగి ఉంటాయి. గుమ్మడి, అవిసె, చియా లాంటి సీడ్లలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్ సహా ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అందుకే వర్కౌట్స్ చేసే ముందు నట్స్, సీడ్స్ తింటే శరీరంలో శక్తి బాగా పెరుగుతుంది. సీడ్స్‌ను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటే మరింత మేలు. దీనివల్ల అవి జీర్ణం కూడా సులువుగా అవుతుంది.

అరటి పండు

అరటి పండ్లలో పొటాషియం, సింపుల్ కార్బొహైడ్రేట్స్, ఎలక్ట్రోలైట్ ఉంటాయి. ఇవి శరీరంలో ఎనర్జీని బాగా పెంచుతాయి. అరటిలో మరిన్ని విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. వర్కౌట్‍కను ముందు తినేందుకు అరటి పండు కూడా ఓ బెస్ట్ ఆప్షన్‍గా ఉంది.

ఓట్‍మీల్

వ్యాయామానికి ముందు ఓట్‍మీల్ తినడం కూడా మేలు. ఇవి కూడా బాడీకి శక్తిని ఇస్తాయి. ఓట్‍మీల్‍లో ప్రోటీన్స్, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, ఫైబర్, కాంప్లెక్స్ కార్బ్స్ మెండుగా ఉంటాయి. ఇవి ఎనర్జీ స్థాయిలను మెరుగ్గా ఉంచుతాయి. వర్కౌట్స్ చురుగ్గా చేసేందుకు ఓట్‍‍మీల్ తోడ్పడతాయి.

అవకాడో

శరీరానికి అవకాడో మంచి ఎనర్జీ ఇస్తుంది. ఇందులోని పొటాషియం, అన్‍సాచురెటెడ్ ఫ్యాట్స్, విటమిన్ బీ, విటమిన్ కే, ఫైబర్ శక్తిని మెరుగ్గా అందిస్తాయి. ఇది తింటే చాలాసేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటాయి. వర్కౌట్లను మెరుగ్గా చేసేందుకు అవకాడో తినడం ఉపకరిస్తుంది.

Whats_app_banner