Andhra Pradesh News Live November 27, 2024: CM Chandrababu : ఇసుక రీచ్‌లలో స్వయంగా ఇసుక తవ్వి తీసుకెళ్లేందుకు అనుమతి- సీఎం చంద్రబాబు
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 27 Nov 202405:15 PM IST
CM Chandrababu : రాష్ట్రంలో ఇసుకకు పెరుగుతున్న డిమాండ్, సరఫరా, లభ్యత పెంపుదలపై సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. వ్యక్తిగత అవసరాల కోసం ఇసుక తీసుకెళ్లే వారిని ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు.
Wed, 27 Nov 202404:28 PM IST
Araku Trains : అరకు వెళ్లే పర్యాటకులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అరకు టూరిస్ట్ రైళ్లకు అదనపు విస్టాడోమ్ కోచ్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విశాఖపట్నం-కిరండూల్-విశాఖపట్నం రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్‌ను జోడించనున్నారు.
Wed, 27 Nov 202402:28 PM IST
AP Cyclone Rains : నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ఇవాళ రాత్రికి తుపానుగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. తుపాను ప్రభావంతో రేపటి నుంచి మూడ్రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Wed, 27 Nov 202401:26 PM IST
Priyanka Jain Tirumala Prank Video : బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ జంట వివాదంలో చిక్కుకున్నారు. తిరుమల నడక మార్గంలో చిరుత వచ్చిందంటూ ప్రాంక్ వీడియో చేశారు. ఈ ప్రాంక్ వీడియో వైరల్ అయ్యింది. తిరుమల లాంటి పవిత్ర ప్రదేశంలో ఇలాంటి వీడియోలు ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు.
Wed, 27 Nov 202411:02 AM IST
AP Govt On Ganja Control : ఏపీలో గంజాయి అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని నిర్ణయించింది. అలాగే నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ కు ఈగల్ అని నామకరణం చేశారు.
Wed, 27 Nov 202410:20 AM IST
Visakha Airport Lizards Seize : విశాఖ ఎయిర్ పోర్టులో అరుదైన బ్లూ టంగ్ లిజర్డ్స్ ను పట్టుకున్నారు. థాయిలాండ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద ఆరు లైవ్ లిజర్డ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరినీ అరెస్టు చేసి, విచారణ చేస్తున్నారు.
Wed, 27 Nov 202409:47 AM IST
Ration Dealer Jobs : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజన్ లోని ఐదు మండలాల్లో 22 రేషన్ డీలర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించారు. డిసెంబర్ 5వ తేదీ లోపు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూలు ద్వారా ఎంపిక ఉంటుంది.
Wed, 27 Nov 202408:30 AM IST
- Red Sandal Auction: ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను సింగల్ విండో విధానానికి మార్చాలని ఏపీ డిప్యూటీ సీఎం అటవీ పర్యావరణ మంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సింగిల్ విండోకు కస్టోడియన్ గా ఉంటుందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కోరారు.
Wed, 27 Nov 202407:56 AM IST
- AP DSC 2024 Syllabus: ఏపీ మెగా డిఎస్సీ 2024 సిలబస్ విడుదలైంది. డిఎస్సీ నోటిఫికేషన్ వెలువడటానికి మరికొంత సమయం ఉండటంతో విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు వీలుగా సిలబస్‌ను మంత్రి నారా లోకేష్ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.
Wed, 27 Nov 202407:05 AM IST
- ప్రయాణికులకు వాల్తేర్ రైల్వే డివిజన్ అధికారులు అలర్ట్ ఇచ్చారు. నాలుగు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సహా పది రైళ్లను రీషెడ్యూల్ చేశారు. ఈ మేరకు అధికారులు వివరాలను పేర్కొన్నారు.
Wed, 27 Nov 202404:48 AM IST
- AP LAWCET Counseling 2024 Updates : ఏపీ లాసెట్ రెండో విడత కౌన్సెలింగ్ కు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ లో పలు మార్పులు చేశారు. నవంబర్ 26వ తేదీన సీట్ల కేటాయింపు కాకుండా.. 29వ తేదీన చేయనున్నారు. వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్ కు ఇవాళ(నవంబర్ 27) కూడా అవకాశం ఉంది.
Wed, 27 Nov 202404:40 AM IST
- Youtuber Arrest: వన్యప్రాణిని వేటాడటమే కాకుండా దానిని వండుకుని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ప్రబుద్దుడిపై అటవీ అధికారులు కేసు నమోదు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ఈ ఘటనపై వన్యప్రాణి ప్రేమికుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.
Wed, 27 Nov 202402:53 AM IST
- Rtd ASP Arrest: వైసీపీ మాజీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు కేసులో రిటైర్డ్ ఏఎస్సీ విజయ్‌పాల్‌ను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరించడంతో ప్రకాశం ఎస్సీ ఎదుట విచారణకు హాజరైన రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్‌ను అరెస్ట్ చేసినట్టు విచారణ అధికారి ప్రకటించారు.
Wed, 27 Nov 202402:19 AM IST
- Fengal Cyclone: బంగాళాఖాతంలో వాయుగుండం తుఫానుగా ఫెంగల్ తుఫానుగా మారనుంది. దీని ప్రభావంతో ఇప్పటికే దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలపై ఫెంగల్ ఎఫెక్ట్ పడనుంది. పంటకోతల సమయం కావడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని రెవిన్యూ శాఖ హెచ్చరించింది.