Akhil Akkineni Fiancee: అక్కినేని అఖిల్‌కి కాబోయే భార్య జైనబ్ రవ్జీ గురించి ఆసక్తికర విషయాలు.. సినిమాలో కూడా యాక్టింగ్-meet akhil akkineni fiancee zainab ravdjee and akkineni nagarjuna future daughter in law family background ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Akhil Akkineni Fiancee: అక్కినేని అఖిల్‌కి కాబోయే భార్య జైనబ్ రవ్జీ గురించి ఆసక్తికర విషయాలు.. సినిమాలో కూడా యాక్టింగ్

Akhil Akkineni Fiancee: అక్కినేని అఖిల్‌కి కాబోయే భార్య జైనబ్ రవ్జీ గురించి ఆసక్తికర విషయాలు.. సినిమాలో కూడా యాక్టింగ్

Galeti Rajendra HT Telugu

Akhil Akkineni Engagement: అఖిల్ అక్కినేనికి కాబోయే భార్య, అక్కినేని చిన్న కోడలు గురించి నెటిజన్లు తెగ శోధిస్తున్నారు. రెండేళ్ల నుంచి ప్రేమలో ఉన్నా.. అఖిల్ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.

అఖిల్ అక్కినేని, జైనబ్‌ రవ్జీ

అక్కినేని ఇంట ప్రస్తుతం పెళ్లి సందడి మొదలైంది. అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం డిసెంబరు 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుండగా.. ఎవరూ ఊహించని విధంగా అఖిల్ అక్కినేని నిశ్చితార్థం చేసుకున్నట్లు మంగళవారం అక్కినేని నాగార్జున ప్రకటించారు.

ఎవరు ఈ జైనబ్‌ రవ్జీ

జైనబ్‌ రవ్జీ అనే అమ్మాయితో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. దాంతో .. అక్కినేని చిన్న కోడలు జైనబ్‌ రవ్జీ ఏం చేస్తుంటారు? వాళ్ల ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఇలా నెటిజన్లు తెగ శోధిస్తున్నారు. నిశ్చితార్థం జరిగే వరకూ విషయాన్ని గోప్యంగా ఉంచడం, పెద్దగా అతిథులు లేకుండానే వేడుక ముగిసిపోవడంతో ఎవరికీ ఆమె గురించి తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది.

జైనబ్‌ రవ్జీ ఒక చిత్రకారిణి. వాస్తవానికి ఆమె పుట్టింది హైదరాబాద్‌లోనే అయినా.. పెరిగింది మాత్రం దుబాయ్, లండన్, ముంబయిలో.. దాంతో ఆయా దేశ, సంప్రదాయాలు ఆమె పెయిటింగ్‌లో దర్శనమిస్తుంటాయి.

సినిమాలోనూ యాక్టింగ్

27 ఏళ్ల జైనబ్‌ రవ్జీ ఇప్పటికే ఎన్నో ప్రదర్శనలిచ్చారు. అంతేకాదు..ఎంఎఫ్ హుస్సేన్ దర్శకత్వంలో ‘మీనాక్షి: ఎ టేల్ ఆఫ్ థ్రీ సిటీస్’ సినిమాలో కూడా జైనబ్‌ రవ్జీ యాక్ట్ చేశారు. ఆ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు, కునాల్ కపూర్ నటించారు. పెయింటర్‌గా పేరు ప్రఖ్యాతలు వచ్చినా.. జైనబ్‌ రవ్జీ చాలా లో-ప్రొఫైల్ మెయింటెన్ చేస్తుంటారు.

ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్

జైనబ్‌ రవ్జీ ఫ్యామిలీ సుదీర్ఘకాలంగా వ్యాపారంలో ఉంది. ఆమె తండ్రి జుల్ఫీ రవ్జీ కన్‌స్ట్రక్షన్ రంగంలో ఉండగా.. ఆమె సోదరుడు జైన్ రవ్జీ జేఆర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌కి ఛైర్మన్, ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అక్కినేని నాగార్జున, జుల్ఫీ రవ్జీ సుదీర్ఘకాలంగా ఫ్రెండ్స్.

రెండేళ్ల నుంచి ప్రేమలో

అఖిల్ అక్కినేని, జైనబ్‌ రవ్జీ‌ గత రెండేళ్ల నుంచి ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను ఇప్పటికే అఖిల్ అక్కినేనితో సన్నిహితంగా ఉపాసన కొణెదల, రానా దగ్గుబాటి తదితరులు సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు. అంటే.. చాలా రోజుల నుంచి అఖిల్ సన్నిహితులకి వీరి ప్రేమ విషయం తెలుసు అని అర్థమవుతోంది.

ఏడేళ్ల క్రితం అఖిల్ నిశ్చితార్థం.. రద్దు

వాస్తవానికి అఖిల్‌కి ఏడేళ్ల క్రితం శ్రియ భూపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం అయ్యింది. ఇటలీలో పెళ్లి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ.. స్పష్టమైన కారణంగా తెలియదుగానీ.. ఎందుకో ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకి అఖిల్ అక్కినేని పర్సనల్ లైఫ్‌ గురించి మళ్లీ చర్చ తెరపైకి వచ్చింది.