Akhil Akkineni Engagement: అఖిల్ ఎంగేజ్‌మెంట్.. అమ్మాయి ఈమెనే.. నాగార్జున ట్వీట్ వైరల్
Akhil Akkineni Engagement: అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. జైనాబ్ రౌజీ అనే అమ్మాయితో అఖిల్ నిశ్చితార్థం జరిగినట్లు అతని తండ్రి, నటుడు అక్కినేని నాగార్జున చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Akhil Akkineni Engagement: అఖిల్ అక్కినేని నిశ్చితార్థం మంగళవారం (నవంబర్ 26) జరిగింది. అతడు జైనాబ్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని నాగార్జున తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. ఈ మధ్యే నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం కూడా జరిగిన విషయం తెలిసిందే. గతంలో ఓసారి అఖిల్ ఎంగేజ్‌మెంట్ జరిగినా.. అది పెళ్లి వరకూ వెళ్లని విషయం తెలిసిందే.
అఖిల్ నిశ్చితార్థం
టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని మరోసారి నిశ్చితార్థం చేసుకున్నాడు. మంగళవారం (నవంబర్ 26) సాయంత్రం నాగార్జున ఈ విషయాన్ని ట్వీట్ చేయగా.. అది వైరల్ అవుతోంది. "మా కొడుకు అక్కినేని అఖిల్, మా కాబోయే కోడలు జైనా రౌజీ నిశ్చితార్థం జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం.
జైనాబ్ ను మా కుటుంబంలోకి ఆహ్వానించడం చాలా థ్రిల్లింగా ఉంది. ఈ జంట జీవితాంతం సుఖసంతోషాలతో గడపాలని కోరుకుంటూ శుభాకాంక్షలు చెప్పండి" అనే క్యాప్షన్ తో నాగార్జున ఈ ట్వీట్ చేశాడు.
జైనాబ్ ఓ ఆర్టిస్ట్. అఖిల్ ఆమెను రెండేళ్ల కిందట తొలిసారి కలిశాడు. వాళ్ల స్నేహం ప్రేమగా మారింది. ఇప్పుడు అక్కినేని వారి ఇంట్లో ఈ ఇద్దరి నిశ్చితార్థం జరిగింది. వీళ్ల పెళ్లి డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇప్పటికే నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం కూడా జరిగిన విషయం తెలిసిందే. మూడు నెలల కిందట నాగార్జున ఇలాగే సడెన్ గా వాళ్ల ఎంగేజ్‌మెంట్ ట్వీట్ చేసి ఆశ్చర్యపరిచాడు.
అఖిల్ నిశ్చితార్థం అప్పుడలా..
నిజానికి అఖిల్ అక్కినేనికి ఇది రెండో నిశ్చితార్థం. మొదటిసారి 2017లో శ్రియ భూపాల్ అనే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ జరిగింది. కానీ అది పెళ్లి వరకూ వెళ్లలేదు. ఇటలీలో చాలా ఘనంగా వీళ్ల పెళ్లి జరిపించాలని అనుకున్నారు.
కానీ కొన్ని నెలల ముందు పెళ్లి రద్దు చేసుకోవడం అందరినీ షాక్ కు గురి చేసింది. ఈ ఇద్దరూ అప్పట్లో ఎయిర్ పోర్టులోనే గొడవ పడ్డారని, దీంతో పెళ్లి రద్దు చేసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
అఖిల్ అక్కినేని ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ఏళ్లే అవుతున్నా.. ఇప్పటికీ మంచి సక్సెస్ అందుకోలేకపోయాడు. అతని చివరి మూవీ ఏజెంట్ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. ప్రస్తుతం రెండు కొత్త సినిమాలను సైన్ చేశాడు. వచ్చే ఏడాది వీటి షూటింగ్ మొదలు కానుంది. అకిల్ నెక్ట్స్ మూవీ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు.. ఈ ఎంగేజ్‌మెంట్ సడెన్ సర్‌ప్రైజ్ అని చెప్పొచ్చు.
టాపిక్