OTT: ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన ది రానా దగ్గుబాటి షో- 240 దేశాల్లో స్ట్రీమింగ్-అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఫస్ట్ ఎపిసోడ్!
The Rana Daggubati Show OTT Streaming: ఓటీటీలోకి ఇవాళ ది రానా దగ్గుబాటి షో వచ్చేసింది. దాదాపుగా 240 దేశాల్లో ది రానా దగ్గుబాటి షో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే, 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికపై ది రానా దగ్గుబాటి షో మొదటి ఎపిసోడ్‌ను వరల్డ్ ప్రీమియర్‌గా ప్రసారం చేశారు.
The Rana Daggubati Show OTT Release: దగ్గుబాటి రానా హోస్ట్‌గా వ్యవహరించిన లేటెస్ట్ టాక్ షో ది రానా దగ్గుబాటి షో. ఈ షో ఓటీటీ స్ట్రీమింగ్‌ను భారీగా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే ప్రతిష్టాత్మకమైన 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ఈవెంట్‌లో ది రానా దగ్గుబాటి షోను స్క్రీనింగ్ చేశారు.
ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్
ఐఎఫ్ఎఫ్ఐలో ది రానా దగ్గుబాటి షో మొదటి ఎపిసోడ్‌ను ప్రీమియర్ చేయడంతో పాటు క్రియేటర్, హోస్ట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రానా దగ్గుబాటితో ఎంటర్‌టైనింగ్ ఇంటరాక్షన్‌ను నిర్వహించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో అన్ స్క్రిప్ట్ తెలుగు ఒరిజినల్ సిరీస్‌గా వచ్చిన ఈ షో ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంది.
మొదటి ఎపిసోడ్ గెస్ట్‌లు
గోవాలో జరుగుతున్న 55వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో నవంబర్ 21న రానా దగ్గుబాటి సెలబ్రిటీ చాట్ షోను వరల్డ్ ప్రీమియర్ అయింది. ది రానా దగ్గుబాటి షో మొదటి ఎపిసోడ్‌లో నేచురల్ స్టార్ నాని, హనుమాన్ హీరో తేజ సజ్జా, సరిపోదా శనివారం హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ అతిథులుగా పాల్గొన్నారు.
250 మందికిపైగా
గోవాలో నిర్వహించిన ది రానా దగ్గుబాటి షో వరల్డ్ ప్రీమియర్‌కు 250 మందికి పైగా సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ స్క్రీనింగ్‌లో రానా దగ్గుబాటితో పాటు షో డైరెక్టర్ అండ్ మార్కెటింగ్ హెడ్ సోనాల్ కబీ, శిల్పా రావు తెనుగుల, తరుణ్ తల్రేజా, డెలిలా లోబో తదితరులు పాల్గొన్నారు. ఇక ది రానా దగ్గుబాటి షో నేటి (నవంబర్ 23) నుంచి ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
240 దేశాల్లో ఓటీటీ స్ట్రీమింగ్
అమెజాన్ ప్రైమ్‌లో ది రానా దగ్గుబాటి షో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా వరల్డ్ వైడ్‌గా ఉన్న 240 దేశాల్లో ది రానా దగ్గుబాటి షో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ 240 దేశాల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో అందుబాటోలు ఉంది. అందుకే అన్నిదేశాల్లో ఈ షో టెలీకాస్ట్ అవుతోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ది రానా దగ్గుబాటి మొదటి ఎపిసోడ్‌ను అందుబాటులో ఉంచారు.
రాజమౌళి-రామ్ గోపాల్ వర్మ
ప్రతి శనివారం కొత్త ఎపిసోడ్‌లతో ది రానా దగ్గుబాటి షో అలరించనుంది. ఈ ఎపిసోడ్స్‌లలో ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, దుల్కర్ సల్మాన్, నాగ చైతన్య అక్కినేని, రిషబ్ శెట్టి, సిద్ధు జొన్నలగడ్డ, శ్రీలీల వంటి స్టార్ సెలబ్రిటీలు అతిథులుగా వచ్చి మెస్మరైజ్ చేయనున్నారు. ఇదివరకే దీనికి సంబంధించిన ది రానా దగ్గుబాటి షో ట్రైలర్‌ను రిలీజ్ చేసి క్యూరియాసిటీ పెంచేశారు.
కార్లలో సూప్ చేయడం
ఈ ది రానా దగ్గుబాటి షోలో సాంప్రదాయ చాట్ షోలను బ్రేక్ చేస్తూ అభిమాన తారలతో అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుంది. దుల్కర్‌తో కలిసి టీ తాగడం నుంచి నాగ చైతన్యతో కార్లలో సూప్ చేయడం వరకు, సిద్ధు జొన్నలగడ్డ, శ్రీలీలతో పిజ్జాలు కాల్చడం, అవుట్‌డోర్ షూట్ లొకేషన్‌లో రాజమౌళిని సర్‌ప్రైజ్ చేయడం వంటివి ఎన్నో వినోదాలు ఉన్నాయి.
టాపిక్