Telugu Cinema News Live November 27, 2024: OTT Romantic Comedy Movie: ఆరు నెలల తర్వాత మరో ఓటీటీలోకి వస్తున్న మలయాళం రొమాంటిక్ కామెడీ మూవీ
తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
Wed, 27 Nov 202404:37 PM IST
- OTT Romantic Comedy Movie: ఓటీటీలోకి ఆరు నెలల తర్వాత ఓ మలయాళం రొమాంటిక్ కామెడీ స్ట్రీమింగ్ కు వస్తోంది. సన్ నెక్ట్స్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ బుధవారం (నవంబర్ 27) రివీల్ చేసింది.
Wed, 27 Nov 202402:49 PM IST
- Dhanush Divorce: ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడిపోయారు. ఇక కలిసి ఉండలేమని వాళ్లు చెప్పడంతో కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. దీంతో వీళ్ల మధ్య ఉన్న 20 ఏళ్ల వివాహ బంధానికి తెరపడింది.
Wed, 27 Nov 202402:05 PM IST
- OTT Action Thriller Web Series: ఓటీటీలో సూపర్ హిట్ అయిన యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అన్ని ఎపిసోడ్లు రాబోతున్నాయి. సోనీలివ్ ఓటీటీలోని టాప్ సిరీస్ లో ఒకటైన తనావ్ (Tanaav) రెండో సీజన్ లో వాల్యూమ్ 2 అన్ని ఎపిసోడ్లు వస్తున్నాయి.
Wed, 27 Nov 202401:20 PM IST
- OTT Psychological Thriller Movie: ఓటీటీలోకి మరో మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ తెలుగులో వస్తోంది. మార్చి, 2022లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఇప్పుడు తెలుగులో డిజిటల్ ప్రీమియర్ కాబోతుండటం విశేషం.
Wed, 27 Nov 202412:09 PM IST
- OTT Telugu Movies: ఓటీటీలోకి ఒకే రోజు రెండు బ్లాక్‌బస్టర్ తెలుగు సినిమాలు రాబోతున్నాయి. ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తున్న ఈ సినిమాలు థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం కావడం విశేషం.
Wed, 27 Nov 202411:40 AM IST
- Keerthy Suresh: కీర్తి సురేశ్ తన డేటింగ్ కన్ఫమ్ చేస్తూ చేసిన పోస్టు వైరల్ అవుతోంది. అయితే దీనిపై సమంత, కాజల్, మాళవిక మోహనన్ లాంటి టాప్ హీరోయిన్లు చేసిన కామెంట్స్ కూడా అభిమానులు ఆకర్షిస్తున్నాయి.
Wed, 27 Nov 202410:22 AM IST
- OTT Sci-Fi Movies: స్పేస్ సినిమాలంటే ఇష్టమైతే వీటిలో కొన్ని సినిమాలు తప్పక చూడాల్సిందే. ఈ ప్రతి సినిమా థ్రిల్, మిస్టరీతో నిండి ఉంటుంది. హాలీవుడ్ నుంచి వచ్చిన ఈ నాలుగు సినిమాలు మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి.
Wed, 27 Nov 202409:07 AM IST
Horror Movie: హారర్ మూవీతో డిసెంబర్‌లో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నది హన్సిక. శ్రీ గాంధారి పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో హన్సిక డ్యూయల్ రోల్ చేస్తోంది. ఈ హారర్ మూవీకి ఆర్ కన్నన్ దర్శకత్వం వహిస్తోన్నాడు.
Wed, 27 Nov 202408:51 AM IST
- Dhanush vs Nayanthara: నయనతార, ధనుష్ మధ్య వివాదం మరింత ముదిరింది. తాజాగా ఆమెతోపాటు ఆమె భర్త విఘ్నేష్ శివన్ లపై మద్రాస్ హైకోర్టులో ధనుష్ దావా వేయడం గమనార్హం.
Wed, 27 Nov 202408:46 AM IST
Sreeleela Remuneration For Pushpa 2 Item Song: పుష్ప 2 విడుదల ముంగిట ఈ సినిమాలో శ్రీలీల చేసిన ఐటెం సాంగ్ గురించి జోరుగా చర్చ జరుగుతోంది. రూ.2 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారట కదా? అని శ్రీలీలని ప్రశ్నించగా.. ఆమె ఏమని సమాధానమిచ్చారంటే?
Wed, 27 Nov 202408:21 AM IST
- NNS 27th November Episode: నిండు నూరేళ్ల సావాసం బుధవారం (నవంబర్ 27) ఎపిసోడ్లో అమర్ ని చంపడానికి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తుంటారు. పిల్లలను కిడ్నాప్ చేయడానికి స్కూల్ కు వెళ్తారు. తర్వాత ఏం జరిగిందంటే..
Wed, 27 Nov 202408:20 AM IST
Subbaraju Wedding: టాలీవుడ్ నటుడు సుబ్బరాజు పెళ్లిచేసుకున్నాడు. తన భార్యతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. పెళ్లి ఎప్పుడు జరిగింది? వధువు ఎవరన్నది మాత్రం సుబ్బరాజు రివీల్ చేయలేదు.
Wed, 27 Nov 202407:51 AM IST
Appudo Ippudo Eppudo OTT: థియేటర్లలో రిలీజైన 20 రోజుల్లోనే నిఖిల్ సిద్ధార్థ కొత్త సినిమా ఓటీటీలో ప్రత్యక్షమైంది. ఇంతకీ ఈ సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోందంటే?
Wed, 27 Nov 202407:32 AM IST
Star Maa Serial: గీతా ఎల్ఎల్‌బీ సీరియల్ టెలికాస్ట్ డేట్, టైమింగ్స్‌ను స్టార్ మా రివీల్ చేసింది. డిసెంబర్ 2 నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల నుంచి పది గంటల వరకు ఈ సీరియల్ టెలికాస్ట్ కాబోతోంది. గీతా ఎల్ఎల్‌బీ సీరియల్‌లో మలయాళ హీరోయిన్ నీతూ మాయ లీడ్ రోల్‌లో నటిస్తోంది.
Wed, 27 Nov 202406:30 AM IST
Lucky Baskhar OTT release date: దుల్కర్ సల్మాన్ హిట్ సినిమా లక్కీ భాస్కర్ మరి కొన్ని గంటల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌కి రాబోతోంది. ఈ మూవీని ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూడొచ్చంటే?
Wed, 27 Nov 202405:56 AM IST
Bold OTT: తమిళ బోల్డ్ మూవీ ష్! నేరుగా ఓటీటీలోకి వస్తోంది. నవంబర్ 29 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ష్! మూవీలో శ్రీరామ్, సోనియా అగర్వాల్, ఇనియా, ఐశ్వర్య దత్తా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
Wed, 27 Nov 202405:03 AM IST
Brother Review:జయం రవి, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా నటించిన కోలీవుడ్ మూవీ బ్రదర్ ఇటీవలే థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎమ్ రాజేష్ దర్శకత్వంలో ఫ్యామిలీ డ్రామా కథతో ఈ మూవీ రూపొందింది.
Wed, 27 Nov 202404:53 AM IST
Akhil Akkineni Engagement: అఖిల్ అక్కినేనికి కాబోయే భార్య, అక్కినేని చిన్న కోడలు గురించి నెటిజన్లు తెగ శోధిస్తున్నారు. రెండేళ్ల నుంచి ప్రేమలో ఉన్నా.. అఖిల్ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.
Wed, 27 Nov 202403:53 AM IST
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడి గంటలు నవంబర్ 27 ఎపిసోడ్‌లో పని కోసం బాలు చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఫైనాన్షియర్‌కు భయపడి బాలుకు జాబ్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారు. మరోవైపు ఇంటి ఖర్చులకు బాలు డబ్బు ఇవ్వకుండా వెళ్లడంతో ప్రభావతి మీనాను నానా మాటలు అంటుంది.
Wed, 27 Nov 202403:47 AM IST
Mystery Thriller Movie OTT: కిరణ్ అబ్బవరం లేటెస్ట్ సెన్సేషన్ మూవీ క ఓటీటీలోకి వచ్చేస్తోంది. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సీఫీస్ వద్ద మంచి వసూళ్లని రాబట్టింది. ఎప్పుడు.. ఎక్కడ ఈ సినిమా స్ట్రీమింగ్‌కానుందంటే?
Wed, 27 Nov 202402:21 AM IST
Brahmamudi:బ్రహ్మముడి నవంబర్ 27 ఎపిసోడ్‌లో కావ్య, అపర్ణ వెళ్లిపోవడంలో సీతారామయ్య, ఇందిరాదేవి బాగోగుల్ని ఎవరూ పట్టించుకోరు. సీతారామయ్యకు పాలు ఇవ్వమని ఇందిరాదేవి అడిగినందుకు...కావ్య, అపర్ణ లేకపోవడంతోనే మేము గుర్తొచ్చామని, మీ ప్రేమలు స్వార్థంగా ఉంటాయని ధాన్యలక్ష్మి రచ్చ చేస్తుంది.
Wed, 27 Nov 202401:57 AM IST
Naga Chaitanya Sobhita Dhulipala wedding: నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహానికి హైదరాబాద్‌లో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ.. ఈ పెళ్లిలో ఫొటోలు, వీడియోలు తీయడంపై కొన్ని ఆంక్షలు ఉండనున్నాయి. దానికి కారణం ఏంటంటే?
Wed, 27 Nov 202401:49 AM IST
- Karthika Deeapam 2 Today November 27 Episode: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. దీప కార్తీక్ గురించి చాలా బాధపడుతూ కనిపిస్తుంది. తనని పెళ్లి చేసుకోవడం వల్లే కార్తీక్ సీఈవో పదవి పోయిందని మధనపడుతూ ఉంటుంది.
Wed, 27 Nov 202412:52 AM IST
Bigg Boss: ఈ వారం బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. విష్ణుప్రియ, అవినాష్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు చెబుతోన్నారు. మరోవైపు టికెట్ టూ ఫినాలే రేసు అఖిల్, హారిక...నలుగురు కంటెస్టెంట్స్‌ను సెలెక్ట్ చేశారు.