Netflix: నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహ వేడుకలో ఆంక్షలు.. భారీ ధరకి వెడ్డింగ్ రైట్స్‌ను కొనుగోలు చేసిన నెట్‌ఫ్లిక్స్
Naga Chaitanya Sobhita Dhulipala wedding: నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహానికి హైదరాబాద్‌లో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ.. ఈ పెళ్లిలో ఫొటోలు, వీడియోలు తీయడంపై కొన్ని ఆంక్షలు ఉండనున్నాయి. దానికి కారణం ఏంటంటే?
అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. గత రెండేళ్లుగా డేటింగ్లో ఉన్న ఈ జంట.. ఇటీవల ఆగస్టులో నిశ్చితార్థం చేసుకుంది. ఇప్పుడు వివాహానికి ఇరు కుటుంబాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్లో డిసెంబర్ 4న నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి జరగనుంది. ఈ మేరకు అతిథులకి ఆహ్వానాల్ని కూడా పంపిస్తున్నారు.
నాగచైతన్య, శోభితా వివాహ వేడుకలో ఆంక్షలు
నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహ వేడుకలో కొన్ని ఆంక్షలు ఉండే అవకాశం ఉంది. ఫొటోలు, వీడియోలు ఎక్కువగా బయటికి రాకపోవచ్చు. దానికి కారణం.. ఈ పెళ్లి వీడియో హక్కులను ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ రూ.50 కోట్లకు సొంతం చేసుకుంది.
గతంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ పెళ్లి వీడియో హక్కులను కూడా ఇలానే దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ రెండేళ్ల తర్వాతగానీ..స్ట్రీమింగ్కి ఉంచలేదు. దాంతో నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి సంబరం చూడాలంటే అభిమానులు చాలా రోజులు ఎదురు చూడక తప్పదేమో.
పరిమిత సంఖ్యలో అతిథులు
నెట్‌ఫ్లిక్స్‌కి వెడ్డింగ్ రైట్స్ ఇచ్చేసిన అక్కినేని ఫ్యామిలీ.. వివాహానికి చాలా తక్కువ సంఖ్యలో సన్నిహితులు, అతిథులను ఆహ్వానిస్తున్నారు. అలానే వచ్చే అతిథులు ఎక్కువగా ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు అనుమతించకపోవచ్చు. గతంలో హీరోయిన్ సమంతని నాగచైతన్య వివాహం చేసుకోగా.. ఆ వివాహ వేడుకకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
త్వరలోనే అక్కినేని ఫ్యామిలీలో మరో వివాహం
అక్కినేని ఫ్యామిలీలో నాగచైతన్యతో పాటు త్వరలోనే మరో వివాహం కూడా జరగనుంది. అక్కినేని అఖిల్‌తో బైనబ్ రవ్జీకి నిశ్చితార్థం జరిగినట్లు అధికారికంగా నాగార్జున మంగళవారం ప్రకటించారు.
సోషల్ మీడియా ఇన్ఫ్లూయోన్సర్గా ఇప్పటికే మంచి పేరున్న బైనబ్ రవ్జీ..గత రెండేళ్ల నుంచి అఖిల్‌తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో నిశితార్థం జరిగింది. బైనబ్ రవ్జీ తండ్రి జుల్ఫీ రవ్జీ, నాగార్జునకి గత కొన్నేళ్లుగా మంచి స్నేహం ఉందని తెలుస్తోంది. దాంతో అఖిల్ అక్కినేని కూడా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు.