Naga Chaitanya: పెళ్లి ముంగిట ఐఎఫ్ఎఫ్ఐ 2024 వేడుకల్లో జంటగా నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల సందడి.. జత కలిసిన నాగార్జున, అమల
IFFI 2024: నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం కోసం హైదరాబాద్‌లో ఒకవైపు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఇరు కుటుంబాలు వెడ్డింగ్ కార్డ్స్‌ను పంచుతున్నాయి. అయితే.. ఈ జంట మాత్రం గోవాలో సందడి చేస్తోంది.
అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ వివాహం ముంగిట గురువారం గోవాలో సందడి చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. బుధవారం (నవంబరు 20) నుంచి గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) 2024 వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకి నాగచైతన్య, శోభితాతో పాటు అక్కినేని నాగార్జున, అమల అక్కినేని హాజరయ్యారు.
చైతన్య, శోభితాల నిశ్చితార్థం ఆగస్టు 8న హైదరాబాద్‌లో జరిగింది. ఇప్పుడు వీరి పెళ్లి కూడా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే ఇరు కుటుంబాల్లో వివాహ ఏర్పాట్లు మొదలవగా.. డిసెంబరు 4న పెళ్లి జరగనుంది. ఇప్పటికే వీరి వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సింపుల్ వెడ్డింగ్ కార్డుతో పాటు, సంప్రదాయబద్ధంగా నేసిన బుట్టలో బట్టలు, పూలు, స్వీట్స్‌ను అతిథులకి అక్కినేని, ధూళిపాళ్ల కుటుంబ సభ్యులు పంచుతున్నారు.
సమంతతో గతంలో ప్రేమాయణం నడిపిన నాగచైతన్య.. వివాహం కూడా చేసుకున్నాడు. కానీ.. భేదాభిప్రాయాలతో ఈ జంట 2021లో విడిపోయింది. ఆ తర్వాత రెండేళ్ల పాటు శోభితాతో డేటింగ్ చేసిన నాగచైతన్య.. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. నిశ్చితార్థానికి ముందే విదేశాల్లో చక్కర్లు కూడా ఈ జంట కెమెరాల కంటపడింది.
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ మూవీ ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజ్‌కానుంది. ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శ్రీకాకుళంకు చెందిన మత్స్యకారుడిగా నాగచైతన్య నటిస్తున్నాడు. శోభిత ధూళిపాళ్ల చివరిసారిగా జీ5 చిత్రం లవ్.. సితారలో కనిపించింది.