Electric Scooter : రివర్ ఇండీ అప్‌డేటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. 110 కిలోమీటర్ల రేంజ్, ధరలో మార్పు-river indie electric scooter updated price at 1 43 lakh know range and other details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Scooter : రివర్ ఇండీ అప్‌డేటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. 110 కిలోమీటర్ల రేంజ్, ధరలో మార్పు

Electric Scooter : రివర్ ఇండీ అప్‌డేటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. 110 కిలోమీటర్ల రేంజ్, ధరలో మార్పు

Anand Sai HT Telugu
Nov 27, 2024 08:00 AM IST

River Indie Electric Scooter : రివర్ ఇండీ తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అప్‌డేటెడ్ వెర్షన్‌లో లాంచ్ చేసింది. కొత్త 2024 రివర్ ఇండీ రేంజ్ 110 కిలోమీటర్లు. ఈ స్కూటీకి సంబంధించిన వివరాలపై ఓ లుక్కేయండి.

కొత్త రివర్ ఇండి 2024 లాంచ్
కొత్త రివర్ ఇండి 2024 లాంచ్ ( 2024 River Indie)

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన స్టార్టప్ రివర్ ఇండీ తన అప్‌డేటెడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. 2024 రివర్ ఇండీ ధర రూ .1.43 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. రివర్ ఇండీని 2023లో 1.25 లక్షల ధరతో ప్రారంభించగా, ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ వాహనం ధరను 1.38 లక్షలకు పెంచారు. ప్రస్తుతం ఇది మునుపటి కంటే రూ.18,000 ధర ఎక్కువ. కానీ కొన్ని మార్పులను చేసింది. మునుపటి బెల్ట్ నడిచే సిస్టమ్ స్థానంలో సింగిల్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కొత్త చైన్ డ్రైవ్ మెకానిజం జోడించింది. రివర్ ఇండీని తొలిసారిగా 2023లో బెంగళూరులో ప్రారంభించారు. అధిక గ్రౌండ్ క్లియరెన్స్, మంచి రూపం కారణంగా కంపెనీ దీనిని స్కూటర్ల ఎస్‌యూవీ అని పిలుస్తుంది.

2024 రివర్ స్పెసిఫికేషన్లు చూస్తే.. పెద్ద బాడీవర్క్, ట్విన్-బీమ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, పానియర్స్ కోసం సైడ్‌లకు అనుసంధానించిన హార్డ్ మౌంట్లతో అదే డిజైన్‌తో కొనసాగుతున్నాయి. ఫ్లాట్, వెడల్పాటి ఫ్లోర్ బోర్డ్, గ్రాబ్రైల్, క్రాష్ గార్డులు, మందపాటి టైర్లతో అల్లాయ్ వీల్స్‌తో ఉంది. రెండు యూఎస్బీ పోర్ట్‌లు, 6-అంగుళాల రైడర్ డిస్‌ప్లేతో వస్తుంది. సాంప్రదాయ స్కూటర్లు ఐసీఈ లేదా ఇతర ఎలక్ట్రిక్‌తో పోలిస్తే దాని రూపాన్ని, పనితీరును మరింత మెరుగుపరుస్తాయి.

రివర్ ఇండీలో 55 లీటర్ల స్టోరేజ్ ఉంది. గ్లోవ్ బాక్స్‌లో 12 లీటర్లు, అండర్ సీట్ స్టోరేజ్‌లో 43 లీటర్లు ఉన్నాయి. 14-అంగుళాల చక్రాలను కలిగి ఉంది. రివర్ ఇండీలో 6.7 కిలోవాట్ల (8.9 బిహెచ్పీ) ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. ఇది 26 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు కాగా, బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

స్టాండర్డ్ ఛార్జర్ ఉపయోగించి 5 గంటల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని రివర్ కంపెనీ తెలిపింది. ఇది ఎకో, రైడ్, రష్ అనే మూడు రైడ్ మోడ్ ఆప్షన్స్ కలిగి ఉంది. మోడ్ ఆధారంగా రేంజ్ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎకోలో 110 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. రివర్ ఇండీకి చేసిన అతిపెద్ద అప్‌డేట్ కొత్త సింగిల్ స్పీడ్ గేర్ బాక్స్, ఇది చైన్ డ్రైవ్ సిస్టమ్ కలిగి ఉంది. ఈ సెగ్మెంట్లో ఇది మొదటిదని కంపెనీ పేర్కొంది.

సింగిల్-స్పీడ్ గేర్ బాక్స్‌తో కలిపిన చైన్ డ్రైవ్ స్కూటర్ అసెంబ్లింగ్ ప్రక్రియ, మరమ్మత్తు పనులు రెండింటినీ సులభతరం చేస్తుందని రివర్ మెకానికల్ డిజైన్ హెడ్ మజర్ అలీ బేగ్ మీర్జా తెలిపారు. రివర్ ఇండీ ఇప్పుడు 2024 అప్డేట్‌తో రెండు కొత్త కలర్ ఆప్షన్లలో వస్తుంది. వింటర్ వైట్, స్టార్మ్ గ్రేలో దొరుకుతుంది.

Whats_app_banner