YouTube Music: యూట్యూబ్ మ్యూజిక్ లో కొత్తగా యూజర్ ఫ్రెండ్లీ ‘స్పీడ్ డయల్’ ఫీచర్; ఇది ఎలా పని చేస్తుందంటే?
YouTube Music: యూట్యూబ్ మ్యూజిక్ లో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ‘స్పీడ్ డయల్’ ఫీచర్ వినియోగదారులు తమకు ఇష్టమైన పాటలను త్వరగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. దాంతో పాటు, యాప్ మొత్తం నావిగేషన్ అనుభవాన్ని మెరుగుపరచడానికి అనుమతిస్తుంది.
YouTube Music: యూట్యూబ్ మ్యూజిక్ కోసం స్పీడ్ డయల్ అనే కొత్త ఫీచర్ నను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. ఇది వినియోగదారులు తమకు ఇష్టమైన, తరచుగా ప్లే చేసే పాటలను త్వరగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ అప్ డేట్ గతంలో ఉన్న లిజన్ అగైన్ (Listen Again) మెనూను మరింత మెరుగుపరుస్తుంది. వాస్తవానికి 2023లో ప్రకటించిన ఈ ఫీచర్ ఇప్పుడు యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చింది.
యూట్యూబ్ మ్యూజిక్ స్పీడ్ డయల్ ఫీచర్
యూట్యూబ్ (youtube) మ్యూజిక్ యాప్ లోని హోమ్ సెక్షన్ లో స్పీడ్ డయల్ ఫీచర్ ఉంది. ఇది వినియోగదారులు విన్న మొదటి తొమ్మిది పాటలను ప్రదర్శిస్తుంది. తొమ్మిది అదనపు ట్రాక్ లను స్వైప్ చేసి వీక్షించే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్స్ గతంలో వినియోగదారులు తమకు ఇష్టమైనవిగా మార్క్ చేసిన పాటలు.
ఈజీ నావిగేషన్
ఇది మునుపటి లిజన్ ఎగైన్ ఫీచర్ మాదిరిగా కాకుండా, సింగిల్ స్క్రీన్ పైననే ఎక్కువ పాటలను చూపిస్తుంది. గతంలో ఉన్న మళ్లీ వినండి (Listen Again) మెనూ లో అదనపు ట్రాక్ లను యాక్సెస్ చేయడానికి బహుళ స్వైప్ లు అవసరమయ్యేయి. ఇప్పుడు స్పీడ్ డయల్ ఇంటర్ ఫేస్ ను సరళీకరించారు. ఇది సింగిల్ స్క్రీన్ పై సులభమైన నావిగేషన్ ను అనుమతిస్తుంది. ప్రస్తుతం స్పీడ్ డయల్ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్ లకు యూట్యూబ్ మ్యూజిక్ యాప్ లో అందుబాటులో ఉంది.
యూజర్ ఇంటర్ ఫేస్ స్పీడ్
స్పీడ్ డయల్ ఫీచర్ తో పాటు, యూట్యూబ్ మ్యూజిక్ యాప్ లో మరికొన్ని యూజర్ ఇంటర్ ఫేస్ అప్ డేట్స్ వచ్చాయి. ముఖ్యంగా పెద్ద స్క్రీన్లపై, వన్ హ్యాండ్ నావిగేషన్ ను సులభం చేయడానికి మూడు చుక్కల మెనూ ఆప్షన్లను రీసైజ్ చేశారు. బాహ్య స్పీకర్లకు స్పీడ్ గా కనెక్ట్ చేసే వీలు కల్పించారు. ఇతర యుఐ ఎలిమెంట్లను కూడా అప్ డేట్ చేశారు. ఇవి స్పీడ్ డయల్ అంత ముఖ్యమైనవి కానప్పటికీ, అవి యూట్యూబ్ మ్యూజిక్ యాప్ లోని అప్ డేట్స్ ను మరింత మెరుగుపరుస్తాయి.