Instagram: ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు అదిరిపోయే అప్ డేట్; స్పాటిఫై తో ఇంటిగ్రేషన్ లో మరో ముందడుగు
Instagram new feature: మీరు ఇన్ స్టాగ్రామ్ స్టోరీల సాంగ్స్ ను మీ స్పాటిఫై ప్లే లిస్ట్ కు యాడ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాారా?.. మీ లాంటి ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు శుభవార్త. ఇన్ స్టాగ్రామ్ స్టోరీల నుండి పాటలను నేరుగా మీ స్పాటిఫై ప్లే జాబితాలకు యాడ్ చేయవచ్చు. ఎలా చేయాలో ఇక్కడ చూడండి.
Instagram new feature: ఇన్ స్టాగ్రామ్, స్పాటిఫై ల భాగస్వామ్యంతో ఇన్ స్టా గ్రామ్ లో యూజర్లకు ఎంతో ఉపయోగపడే కొత్త ఫీచర్ ప్రారంభమైంది. దీని ద్వారా ఇన్ స్టా వినియోగదారులు తమ ఇన్ స్టాగ్రామ్ స్టోరీల నుండి పాటలను నేరుగా వారి స్పాటిఫై ప్లే జాబితాలకు యాడ్ చేయవచ్చు. అలాగే, స్పాటిఫై ప్లే లిస్ట్ లోని సాంగ్స్ ను ఇన్ స్టా స్టోరీలకు యాడ్ చేయవచ్చు. ఇన్ స్టాగ్రామ్, స్పాటిఫై వినియోగదారులకు మరింత ఇంటరాక్టివ్ అనుభవం అందించడం లక్ష్యంగా ఈ ఫీచర్ ను ప్రారంభించారు.
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి..
ఈ ఫీచర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. అయితే, యూజర్లు ముందుగా తమ స్మార్ట్ ఫోన్స్ లోని ఇన్ స్టాగ్రామ్, స్పాటిఫై యాప్స్ ను వాటి తాజా వెర్షన్లకు అప్డేట్ చేసుకోవాలి. ఇన్ స్టాగ్రామ్ (instagram) వినియోగదారులు ఇప్పుడు స్పాటిఫై ట్రాక్స్, ఆల్బమ్స్ లేదా ప్లేజాబితాలకు లింక్ లు కలిగి ఉన్న స్టోరీలను సృష్టించవచ్చు. ఒక స్టోరీలో పాటలను చూసిన తర్వాత స్పాటిఫైలో ఆ పాటను సెర్చ్ చేయడానికి బదులుగా, వినియోగదారులు సింపుల్ గా ఆ స్టోరీలో ఇంటిగ్రేట్ అయి ఉన్న "ప్లే లిస్ట్ కు జోడించు" బటన్ పై క్లిక్ చేసి, ఆ పాటను తమ స్పాటిఫై (spotify) ప్లే లిస్ట్ లో యాడ్ చేయవచ్చు.
ట్రాక్ ప్రివ్యూ కూడా
ఈ ఫంక్షనాలిటీ ద్వారా యూజర్లు పాటలను నేరుగా వారి స్పాటిఫై లైబ్రరీకి లేదా నచ్చిన ప్లే లిస్ట్ కు సేవ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ బటన్ మ్యూజిక్ ప్లేయర్ పక్కన స్పష్టంగా కనిపించేలా, సౌకర్యవంతంగా ఉంటుంది. ఆ పాటను ప్లే లిస్ట్ కు యాడ్ చేసేముందు వినియోగదారులు ఆ ట్రాక్ ను ప్రివ్యూ చేసే వీలు కూడా ఉంది.
ఇన్ స్టాగ్రామ్ కు స్పాటిఫైని ఎలా కనెక్ట్ చేయాలి
ఈ ఫీచర్ ను ఉపయోగించడానికి, వినియోగదారులు ముందుగా, తమ స్పాటిఫై ఖాతాను ఇన్ స్టాగ్రామ్ కు కనెక్ట్ చేయాలి. ఇన్ స్టాగ్రామ్ ద్వారా జోడించిన పాటలు "లైక్డ్ సాంగ్స్" ప్లే లిస్ట్ లో, స్పాటిఫైలోని "యువర్ లైబ్రరీ" ట్యాబ్ క్రింద కనిపిస్తాయి. ఈ కొత్త ఇంటిగ్రేషన్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ డివైస్ లలో పనిచేస్తుంది. ఇన్స్టాగ్రామ్, స్పాటిఫై రెండింటికీ ఈ ఫీచర్ ఉపయోగకరమైనది. స్టోరీస్ లో మ్యూజిక్ క్లిప్ లను భాగస్వామ్యం చేయడానికి ఇన్ స్టాగ్రామ్ ప్రస్తుత సామర్థ్యం ఇప్పుడు మరింత ఇంటరాక్టివ్ అనుభవంగా అభివృద్ధి చెందింది. దీనివల్ల స్పాటిఫై విస్తృతి కూడా పెరుగుతుంది.