Spotify new feature : ఇక ఆఫ్​లైన్​లోనూ పాటలు ఎంజాయ్​ చేయండి.. స్పాటిఫై కొత్త ఫీచర్​ ఇదే!-spotify to soon launch offline mix feature see full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Spotify New Feature : ఇక ఆఫ్​లైన్​లోనూ పాటలు ఎంజాయ్​ చేయండి.. స్పాటిఫై కొత్త ఫీచర్​ ఇదే!

Spotify new feature : ఇక ఆఫ్​లైన్​లోనూ పాటలు ఎంజాయ్​ చేయండి.. స్పాటిఫై కొత్త ఫీచర్​ ఇదే!

Sharath Chitturi HT Telugu
Jun 10, 2023 12:11 PM IST

Spotify new feature : ఇంటర్నెట్​ సదుపాయం లేనపట్టికీ.. ఆఫ్​లైన్​లో మ్యూజిక్​ విని విధంగా కొత్త ఫీచర్​ను తీసుకురాబోతోంది స్పాటిఫై. ఈ ఫీచర్​ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాము..

ఇక ఆఫ్​లైన్​లోనూ పాటలు ఎంజాయ్​ చేయొచ్చు.. స్పాటిఫై కొత్త ఫీచర్​ వచ్చేస్తోంది!
ఇక ఆఫ్​లైన్​లోనూ పాటలు ఎంజాయ్​ చేయొచ్చు.. స్పాటిఫై కొత్త ఫీచర్​ వచ్చేస్తోంది! (AP)

Spotify new feature : స్పాటిఫ్​ వినియోగదారులకు క్రేజీ న్యూస్.. ఇకపై ఆఫ్​లైన్​లోనూ పాటలు వినొచ్చు! ఇంటర్నెట్​ వెసులుబాటు లేకపోయినప్పటికీ మ్యూజిక్​ను వినే విధంగా 'యువర్​ ఆఫ్​లైన్​ మిక్స్​' అనే కొత్త ఫీచర్​ను స్పాటిఫై తీసుకొస్తోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈఓ డానియల్​ తెలిపారు.

కొత్త ఫీచర్​ ఎలా పనిచేస్తుంది..?

ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజిక్​ స్ట్రీమింగ్​ సర్వీస్​గా కొనసాగుతోంది స్పాటిఫై. 500 మిలియన్​ మందికిపైగా యూజర్లు స్పాటిఫైని వాడుతున్నారు. యూజర్​ ఎక్స్​పీరియన్స్​ను మెరుగుపరిచేందుకు సంస్థ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే రానున్న రోజుల్లో 'Your Offline Mix' అనే ఫీచర్​ను తీసుకొస్తోంది.

అయితే ఈ ఫీచర్​కు సంబంధించిన వివరాలపై ప్రస్తుతం పెద్దగా సమాచారం లేదు. కానీ ఇంటర్నెట్​ లభించని సమయంలో.. యూజర్లు రీసెంట్​గా ప్లే చేసిన మ్యూజిక్​ను కలిపి ఓ లిస్ట్​ తయారవుతుందని, దానిని ఆఫ్​లైన్​లోను వాడుకోవచ్చని తెలుస్తోంది. 2020 నుంచి ఈ ఫీచర్​పై సంస్థ ప్రయోగాలు చేస్తున్నట్టు సమాచారం.

ఇదీ చూడండి:- Spotify Layoffs: ఉద్యోగులకు షాక్ ఇచ్చిన మరో కంపెనీ.. 6శాతం మందిని తొలగించనున్న స్పాటిఫై

స్పాటిఫై ప్రీమియం సబ్​స్క్రైబర్లకు.. మ్యూజిక్​ ఆల్బమ్స్​ను డౌన్​లోడ్​ చేసుకుని, ఆఫ్​లైన్​లో వినే వెసులుబాటు ఉంది. కానీ ప్రతిసారి డౌన్​లోడ్​ చేసుకుని పెట్టుకోవడం అంటే కష్టమే. ఒక్కోసారి మర్చిపోవచ్చు కూడా! ఇక్కడే ఈ కొత్త స్పాటిఫై ఫీచర్​ ఉపయోగపడుతుంది. యూజర్లు రీసెంట్​గా ప్లే చేసిన మ్యూజిక్​ను ఈ ఫీచర్​ ఆటోమెటిక్​గా డౌన్​లోడ్​ చేస్తుందట. ట్రావెలింగ్​లో ఉన్నప్పుడో, నెట్​ యాక్సెస్​ లేనప్పుడో దీనిని వాడుకోవచ్చు.

Spotify Your Offline Mix feature : ఈ కొత్త ఫీచర్​ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? అన్న విషయంపై సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ రానున్న రోజుల్లోనే యూజర్లు దీనిని ఉపయోగించుకోవచ్చని తెలుస్తోంది. అయితే.. ఈ ఫీచర్​ అందరికి వస్తుందా? లేదా ప్రీమియం సబ్​స్క్రైబర్లు మాత్రమే పొందుతారా? అన్నది వేచి చూడాలి.

స్పాటిఫైకు గట్టిపోటీనిస్తున్న యూట్యూబ్​ మ్యూజిక్​లో ఇప్పటికే 'ఆఫ్​లైన్​ మిక్స్​టేప్​' ఫీచర్​ ఉంది. అదే సమయంలో 'స్మార్ట్​ డౌన్​లోడ్​' ఆప్షన్​తో 500కుపైగా పాటలను డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం