Hotstar Free : క్రికెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. హాట్‌స్టార్‌లో ఆసియా కప్, ప్రపంచ కప్ ఫ్రీ స్ట్రీమింగ్
Watch World Cup Cricket Matches Free : క్రికెట్ అభిమానులకు హాట్ స్టార్ శుభవార్త చెప్పింది. ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ల డిజిటల్ హక్కులను కలిగి ఉన్న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఇప్పుడు ఆ మ్యాచ్‌లను తన ప్లాట్‌ఫారమ్‌లో ఉచితంగా ప్రసారం చేయాలని నిర్ణయించింది.
ఐపీఎల్ టోర్నమెంట్ డిజిటల్ స్ట్రీమింగ్‌ను ప్రసారం చేసిన జియోసినిమా(Jio Cinema) సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే . జియోసినిమాలో ఐపీఎల్ మ్యాచ్‌లను(IPL Matches) ఉచితంగా ప్రసారం చేయడంతో దాదాపు 45 కోట్ల మంది డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఐపీఎల్‌ను వీక్షించారు. 3 కోట్ల మందికి పైగా ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించి రికార్డు నమోదు చేశారు. అంతకు ముందు, IPL మ్యాచ్‌ల డిజిటల్ ప్రసార హక్కులను పొందిన డిస్నీ హాట్‌స్టార్ (Disney + Hotstar) చాలా మంది వీక్షకులను పొందలేదు. సబ్‌స్క్రైబ్ చేయడం వల్ల హాట్‌స్టార్ వీక్షకుల సంఖ్య తక్కువగా ఉంది.
మెున్నటి ఐపీఎల్ లో జియోసినిమా ప్లాన్ వర్కవుటైంది. దీనితో హాట్‌స్టార్ తన వ్యూహాన్ని మార్చుకుంది. నివేదికల ప్రకారం, రాబోయే ఆసియా కప్, ICC ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ల డిజిటల్ హక్కులను కలిగి ఉన్న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఇప్పుడు ఆ మ్యాచ్‌లను తన ప్లాట్‌ఫారమ్‌లో ఉచితంగా ప్రసారం చేయాలని నిర్ణయించుకుంది.
భారతదేశంలో క్రికెట్ మ్యాచ్‌లను వీలైనన్ని ఎక్కువ మంది వీక్షించేలా ఉచితంగా స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రకటించింది. దీని కారణంగా, ఐపీఎల్ టోర్నమెంట్ సమయంలో కోల్పోయిన కోట్లాది మంది వీక్షకులను తిరిగి పొందాలని హాట్‌స్టార్ భావిస్తోంది.
2023 IPL మ్యాచ్‌లను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో ఉచితంగా ప్రసారం చేయడం ఇదే మొదటిసారి. జియోసినిమా సాహసోపేతమైన అడుగు వేసిందని చెప్పవచ్చు. వీక్షకులను తన ప్లాట్‌ఫారమ్‌కి ఆకర్షించడానికి క్రికెట్‌ను మించిన సాధనం మరొకటి లేదని జియోకు తెలుసు కాబట్టి ఈ రిస్క్ తీసుకుంది. ఇప్పుడు Jioకు కూడా ఓ సవాలు ఉంది. ఐపీఎల్ చూసేందుకు వచ్చిన వినియోగదారులను నిలుపుకోవాలి.
స్టార్ గ్రూప్ ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టీవీ, డిజిటల్ ప్రసార హక్కులను కలిగి ఉంది. టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉచితంగా ప్రసారం చేస్తున్నారు. ఇది చాలా మంది ప్రేక్షకులను తిరిగి పొందింది. ఆసియా కప్(Asia Cup), ప్రపంచ కప్(World Cup) టోర్నమెంట్‌లపై ప్రజలకు ఎక్కువగా ఇంట్రస్ట్ ఉంటుంది కాబట్టి.. హాట్‌స్టార్ ఎక్కువ మంది వీక్షకులను ఆకర్షించే అవకాశం ఉంది .
IPL 2023 టోర్నమెంట్‌లో జియో సినిమా మాత్రమే కాకుండా స్టార్ గ్రూప్ కూడా భారీ లాభాలను ఆర్జించింది. జియో డిజిటల్ ప్రసార హక్కులను కలిగి ఉండగా, స్టార్.. టీవీ ప్రసార హక్కులను కలిగి ఉంది. జియోలో క్రికెట్ చూస్తున్న వారి సంఖ్య 44 కోట్లు కాగా, స్టార్ ఛానెల్స్‌లో టీవీల్లో ఐపీఎల్ చూస్తున్న వారి సంఖ్య 50 కోట్లు ఉందని అంచనా.