Most subscribed Youtube channel : ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలో అవుతున్న యూట్యూబ్​ ఛానెల్​.. మనదే!-tseries is the biggest youtube channel with more number of followers check full list ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Most Subscribed Youtube Channel : ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలో అవుతున్న యూట్యూబ్​ ఛానెల్​.. మనదే!

Most subscribed Youtube channel : ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలో అవుతున్న యూట్యూబ్​ ఛానెల్​.. మనదే!

Sharath Chitturi HT Telugu
Feb 12, 2023 11:11 AM IST

Most subscribed YoutTube channel : ప్రపంచంలో చాలా యూట్యూబ్​ ఛానెల్స్​ ఉన్నాయి. మరి సబ్​స్క్రైబర్స్​ పరంగా టాప్​లో ఉన్న యూట్యూబ్​ ఛానెల్​ ఏదో తెలుసా? ఇండియాకు చెందిన టీ- సిరీస్​.. ఈ జాబితాలో టాప్​లో నిలిచింది!

ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలో అవుతున్న యూట్యూబ్​ ఛానెల్​.. మనదే!
ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలో అవుతున్న యూట్యూబ్​ ఛానెల్​.. మనదే!

Biggest YouTube channel : ప్రముఖ బాలీవుడ్​ మ్యూజిక్​ ఛానెల్​ టీ- సిరీస్​ దుమ్మురేపింది! ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలో అవుతున్న యూట్యూబ్​ ఛానెల్​ జాబితాలో తొలి స్థానాన్ని దక్కించుకుంది.

8 ఛానెల్స్​.. టాప్​లో టీ- సిరీస్​..!

ప్రపంచంలో అత్యధిక మంది సబ్​స్క్రైబ్​ చేసుకున్న యూట్యూబ్​ ఛానెల్​ జాబితాను జర్మనీకి చెందిన 'స్టాటిస్టా' తాజాగా వెల్లడించింది. ఇదొక కన్జ్యూమర్​ డేటా అండ్​ మార్కెట్​ ఇన్​సైట్స్​ కంపెనీ. ఈ ఏడాది జనవరి 25 నాటికి.. ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్న యూట్యూబ్​ ఛానెల్​పై "ది యూట్యూబ్​ ఛానెల్స్​ విత్​ ది మోస్ట్​ సబ్​స్క్రైబర్స్​" అనే పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది.

Most subscribed YouTube channel : ఈ జాబితాలో మొత్తం 8 ఛానెల్స్​ ఉన్నాయి. ఇవి మ్యూజిక్​, కిడ్స్​, కంటెంట్​, వినోదం, స్పోర్ట్స్​కి సంబంధించనవి కావడం విశేషం. వాస్తవానికి 2018 వరకు PewDiePie అనే యూట్యూబ్​ ఛానెల్​ టాప్​ పొజిషన్​లో ఉండేది. వరుసగా ఐదేళ్లు ఆ స్థానంలో కొనసాగింది. టీ సిరీస్​.. దానికి గట్టిపోటీనిచ్చి.. తొలి స్థానాన్ని లాగేసుకుంది. ఇక ఇప్పుడు ఈ ప్యూడైపై యూట్యూబ్​ ఛానెల్​ 5వ స్థానానికి పడిపోయింది. ఈ ప్యూడైపై అనేది ఒక వినోదాత్మక ఛానెల్​. ఇది స్వీడిష్​ యూట్యూబర్​ ఫెలిక్స్​ అరవిద్​ ఉల్ఫ్​కి చెందినది. అతనొక నటుడు, కమీడియన్​, గేమర్​- కామెంటర్​. వీడియో కంటెంట్​కి అతను ప్రసిద్ధి.

అత్యధిక సబ్​స్క్రైబర్స్​ ఉన్న యూట్యూబ్​ ఛానెల్స్​..

T series YouTube channel subscribers : ఇక ఇండియాకు చెందిన టీ సిరీస్​ యూట్యూబ్​ ఛానెల్​.. గుల్షణ్​ కుమార్​, భూషణ్​ కుమార్​లకు చెందినది. దీనికి 234మిలియన్​ మంది ఫాలోవర్లు ఉన్నారు.

రెండో స్థానంలో కోకోమిలన్​ అనే యూట్యూబ్​ ఛానెల్​ ఉంది. 152 మిలియన్​ మంది ఫాలో అవుతున్నారు. ఇదొక కిడ్​ కంటెంట్​ ఛానెల్​.

How to add subtitles to YouTube video : యూట్యూబ్​ వీడియోలకు సబ్​టైటిల్స్​ ఎలా యాడ్​ చేయాలి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

మూడో స్థానాన్ని ఎస్​ఈటీ ఇండియా అనే యూట్యూబ్​ ఛానెల్​ దక్కించుకుంది. 150 మిలియన్​ మంది ఫాలోవర్లు ఉన్నారు.

నాలుగో స్థానంలో మిస్టర్​ బీస్ట్​ (129 మిలియన్​), ఐదో స్థానంలో ప్యూడైపై (111 మిలియన్​), ఆరో స్థానంలో కిడ్స్​ డయానా షో (107 మిలియన్​), 7వ స్థానంలో లైక్​ నస్త్య (104 మిలియన్​), 8వ స్థానంలో డబ్ల్యూడబ్ల్యూఈ (93 మిలియన్​) యూట్యూబ్​ ఛానెల్స్​ ఉన్నాయి.

YouTube channel with most number of subscribers : నివేదిక ప్రకారం.. 2020 వరకు మ్యూజిక్​, వినోదం వంటి యూట్యూబ్​ ఛానెల్స్​కే క్రేజ్​ ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత కిడ్​ కంటెంట్​కు డిమాండ్​ విపరీతంగా పెరిగింది.

WhatsApp channel