YouTube : యూట్యూబ్​ వీడియోలకు సబ్​టైటిల్స్​ ఎలా యాడ్​ చేయాలి?-all you need to know on how to add subtitles to youtube videos ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Youtube : యూట్యూబ్​ వీడియోలకు సబ్​టైటిల్స్​ ఎలా యాడ్​ చేయాలి?

YouTube : యూట్యూబ్​ వీడియోలకు సబ్​టైటిల్స్​ ఎలా యాడ్​ చేయాలి?

Sharath Chitturi HT Telugu
Aug 07, 2022 01:29 PM IST

How to add subtitles to YouTube videos : మీకు యూట్యూబ్​ ఛానెల్​ ఉందా? వీడియోలకు సబ్​టైటిల్స్​ యాడ్​ చేయాలి అని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే..

<p>యూట్యూబ్​ వీడియోలకు సబ్​టైటిల్స్​ ఎలా యాడ్​ చేయాలి?</p>
యూట్యూబ్​ వీడియోలకు సబ్​టైటిల్స్​ ఎలా యాడ్​ చేయాలి? (REUTERS)

How to add subtitles to YouTube videos : ఇప్పుడు చాలా మంది.. యూట్యూబ్​లో వీడియోలు చూడటంతో పాటు సొంతంగా ఛానెల్​ పెట్టి కంటెంట్​ తయారు చేస్తున్నారు. 'ఈ జనరేషన్​లో.. భాషతో సంబంధం లేదు, కంటెంట్​ బాగుంటే.. ఛానెల్​ సూపర్​ హిట్​ అవుతుంద'ని అనడంలో సందేహం లేదు. భాష ఏదైనా.. 'సబ్​టైటిల్స్​/క్యాప్షన్లు' ఉంటే చాలు.. కంటెంట్​ను వ్యూవర్స్​ సులభంగా అర్థం చేసుకోగలుగుతున్నారు. మరి.. మీకు యూట్యూబ్​ ఛానెల్​ ఉందా? మీరు కూడా మీ యూట్యూబ్​ వీడియోలకు సబ్​టైటిల్స్​ యాడ్​ చేయాలని అనుకుంటున్నారా? మీకు ఆ ప్రక్రియ తెలియదా? అయితే ఈ కథనం మీకోసమే..!

యూట్యూబ్​ వీడియోలకు సబ్​టైటిల్స్​ యాడ్​ చేసేందుకు నాలుగు మార్గాలు ఉన్నాయి. ముందే రాసిన ఫైల్​ని అప్లోడ్​ చేసుకోవచ్చు. ఆటో సింక్​ ఆప్షన్​ ఉంటుంది. సొంతంగా టైప్​ చేసుకోవచ్చు. ఆటో ట్రాన్స్​లేట్​ కూడా చేసుకోవచ్చు.

ఫైల్​ అప్లోడింగ్​:-

ఈ రకంగా యూట్యూబ్​ వీడియోలకు సబ్​టైటిల్స్​ యాడ్​ చేయాలంటే..

  • ముందుగా మీ యూట్యూబ్​ ఖాతాలోకి లాగిన్​ అవ్వాలి. 'యూట్యూబ్​ స్టూడియో' లోకి వెళ్లాలి.
  • లెఫ్ట్​ సైడ్​ బార్​లో ఉన్న ‘సబ్​టైటిల్స్’​ అప్షన్​ను క్లిక్​ చేయాలి.
  • సబ్​టైటిల్స్​ యాడ్​ చేయాలి అని అనుకుంటున్న యూట్యూబ్​ వీడియో మీద క్లిక్​ చేయాలి.
  • యాడ్​ లాంగ్యువేజ్’​(భాష) మీద క్లిక్​ చేసి, మీకు కావాల్సిన భాషను ఎంచుకోవాలి.
  • యాడ్​ అండర్​ సబ్​టైటిల్స్’​ మీద క్లిక్​ చేసి.. ఫైల్​ అప్లోడ్​ చేయాలి.
  • 'విత్​ టైమింగ్​', 'వితౌట్​ టైమింగ్​' అని రెండు ఆప్షన్లు ఇస్తుంది యూట్యూబ్​
  • కంటిన్యూ’ బటన్​ ప్రెస్​ చేయాలి. అప్లోడ్​కి సిద్ధంగా ఉన్న ఫైల్​ని క్లిక్​ చేయాలి.
  • సేవ్​ డ్రాఫ్ట్​ మీద క్లిక్​ చేసి, పబ్లీష్​ చేయాలి.

ఆటో సింక్​:-

ఈ ఆప్షన్​తో యూట్యూబ్​ వీడియోలకు సబ్​టైటిల్స్​ యాడ్​ చేయాలంటే..

  • ముందుగా ‘యూట్యూబ్​ స్టూడియో’లో లాగిన్​ అవ్వాలి
  • సబ్​టైటిల్స్​’ మీద క్లిక్​ చేయాలి. లెఫ్ట్​ సైడ్​ బార్​లో ఉంటుంది.
  • ఎడిట్​ చేయాలి అని అనుకుంటున్న వీడియోను క్లిక్​ చేయాలి. సబ్​టైటిల్స్​ కింద ఉన్న 'యాడ్​' మీద క్లిక్​ చేయాలి.
  • 'ఆటో సింక్​' మీద క్లిక్​ చేసి, 'టైప్​స్క్రిప్ట్'​ మీద క్లిక్​ చేయాలి.
  • మూడు డాట్​ బటన్స్​ కనిపిస్తాయి. దాని మీద క్లిక్​ చేసి, టైమింగ్​ ఎడిట్​ చేయాలి. అప్లోడ్​ ఫైల్​ మీద క్లిక్​ చేయాలి.
  • ఆ తర్వాత.. ‘ఎడిట్​ టైమింగ్స్|’​ మీద క్లిక్​ చేసి, ‘సేవ్​ అండ్​ క్లోజ్’​ మీద క్లిక్​ చేయాలి.

మ్యాన్యువల్​:-

How to add Youtube subtitles : మ్యాన్యువల్​గా యూట్యూబ్​ వీడియోలకు సబ్​టైటిల్స్​ యాడ్​ చేయాలంటే..

  • ముందుగా ‘యూట్యూబ్​ స్టూడియో’లో లాగిన్​ అయ్యి, ‘సబ్​టైటిల్స్​ ’ సెలక్ట్​ చేయాలి.
  • వీడియో ఎంచుకుని, ‘యాడ్​ అండర్​ సబ్​టైటిల్స్’​ క్లిక్​ చేయాలి.
  • టైప్​ మ్యాన్యువల్లి’ అనే ఆప్షన్​ మీద క్లిక్​ చేయాలి.
  • వీడియోను ముందికి, వెనక్కి అడ్జస్ట్​ చేసుకుంటూ.. క్యాప్షన్లు టైప్​ చేయాలి. యాడ్​ ట్యాగ్స్​లో మీకు నచ్చిన ట్యాగ్స్​ ఇవ్వాలి.
  • పబ్లీష్​ చేయాలి.

ఆటో- ట్రాన్స్​లేట్​:-

ఆటో ట్రాన్స్​లేట్​ ద్వారా యూట్యూబ్​ వీడియోలకు సబ్​టైటిల్స్​ యాడ్​ చేసే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ ఫీచర్​ కేవలం 13 భాషల్లోనే అందుబాటులో ఉంది. అవి.. డచ్​, ఇంగ్లీష్​, ఫ్రెంచ్​, జర్మన్​, ఇండోనేషియన్​, ఇటాలియన్​, జాపనీస్​, కొరియన్​, పోర్చుగీస్​, రష్యన్​, స్పానిష్​, టర్కిష్​, వియాత్నమీస్​.

  • ముందుగా ‘యూట్యూబ్​ స్టూడియో’లో లాగిన్​ అవ్వాలి.
  • సబ్​టైటిల్స్’​ ఆప్షన్​ క్లిక్​ చేయాలి. వీడియో సెలక్ట్​ చేసుకోవాలి
  • మూడు డాట్స్​ కనిపించే ఆప్షన్​ మీద క్లిక్​ చేయాలి. అది సబ్​టైటిల్స్​ కింద ఉంటుంది.
  • ఆటో క్యాప్షన్​’ మీద క్లిక్​ చేసి, సబ్​టైటిల్స్​ సమీక్షించుకోవాలి.

ఈ విధంగా.. మీరు మీ ఛానెల్​లో.. యూట్యూబ్​ వీడియోలకు సబ్​టైటిల్స్​ యాడ్​ చేసుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్