DC IPL 2025 Players list: ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లోకి కొత్తగా ఇద్దరు కెప్టెన్లు.. మేటి బౌలర్ చేరికతో పూర్తి జట్టు ఇలా
Delhi Capitals IPL 2025: ఐపీఎల్ 2025 వేలంలో రిషబ్ పంత్‌ను చేజార్చుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. కేఎల్ రాహుల్, డుప్లెసిస్ రూపంలో ఇద్దరు కెప్టెన్లని కొనుగోలు చేసింది. అలానే ఒక మేటి ఫాస్ట్ బౌలర్‌ను కూడా చౌకగానే కొట్టేసింది.
Delhi Capitals IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలం ముగిసింది. రెండు రోజుల వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ 19 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ రూ.73 కోట్లతో వేలానికి తీసుకొచ్చింది. వేలం ముగిసే సరికి ఆ ఫ్రాంఛైజీ పర్సులో కేవలం రూ.10 లక్షలు మాత్రమే మిగిలాయి.
కేఎల్ రాహుల్, మిచెల్ స్టార్క్ లాంటి మేటి ఆటగాళ్లని వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ చాలా చౌకగానే కొనుగోలు చేసింది. వేలంలో కేఎల్ రాహుల్ రూ.14 కోట్లకు, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌ను రూ.11.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. కేఎల్ రాహుల్‌కి కనీసం రూ.18 కోట్లు ధర వస్తుందని అంతా ఊహించారు. అలానే ఐపీఎల్ 2024 వేలంలో మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్లు పలికిన విషయం తెలిసిందే.
ఢిల్లీ జట్టులోకి మెరుగైన బౌలర్లు వచ్చారు. టి.నటరాజన్‌ను రూ.10.75 కోట్లకు, ఆస్ట్రేలియా క్రికెటర్ జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్ను రూ.9 కోట్లకు కొనుగోలు చేసింది. వేలానికి ముందు అక్షర్ పటేల్ సహా నలుగురు ఆటగాళ్లను డీసీ రిటైన్ చేసుకుంది. మాజీ కెప్టెన్ రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్‌కి ఢిల్లీ చేజార్చుకుంది. అతడ్ని రూ.27 కోట్లకు లక్నో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన ప్లేయర్ల జాబితా ఇదే
- కేఎల్ రాహుల్: రూ.14 కోట్లు
- మిచెల్ స్టార్క్: రూ.11.75 కోట్లు
- టీ. నటరాజన్ రూ.10.75 కోట్లు
- జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్ - రూ.9 కోట్లు
- ముఖేష్ కుమార్ - రూ.8 కోట్లు
- హ్యారీ బ్రూక్ - రూ.6.25 కోట్లు
- అశుతోష్ శర్మ - రూ.3.8 కోట్లు
- మోహిత్ శర్మ - రూ.2.2 కోట్లు
- ఫాఫ్ డుప్లెసిస్ - రూ.2 కోట్లు
- సమీర్ రిజ్వీ - రూ.95 లక్షలు
- విప్రరాజ్ నిగమ్ - రూ.50 లక్షలు
- దుష్మంత చమీరా - రూ.75 లక్షలు
- డోనోవన్ ఫెరీరా - రూ.75 లక్షలు
- అజయ్ మండల్ - రూ.30 లక్షలు
- మన్వంత్ కుమార్ ఎల్ - రూ.30 లక్షలు
- త్రిపురన్ విజయ్ - రూ.30 లక్షలు
- మాధవ్ తివారీ - రూ.40 లక్షలు
- కరుణ్ నాయర్ - రూ.50 లక్షలు
ఐపీఎల్ 2025 వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్ చేసుకున్న ఆటగాళ్లు
- అక్షర్ పటేల్ (రూ.16.50 కోట్లు)
- కుల్దీప్ యాదవ్ (రూ.13.25 కోట్లు)
- ట్రిస్టన్ స్టోబ్స్ (రూ.10 కోట్లు)
- అభిషేక్ పోరెల్ (రూ.4 కోట్లు)
ఐపీఎల్‌లో టీమ్‌లో గరిష్టంగా 25 మంది ఆటగాళ్లు ఉండే వెసులబాటు ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 23 మందితోనే సరిపెట్టింది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2025 పూర్తి జట్టు
అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, కెఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టోబ్స్, అభిషేక్ పోరెల్, మిచెల్ స్టార్క్, హ్యారీ బ్రూక్, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, టి.నటరాజన్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, త్రిపురన విజయ్, మాధవ్ తివారీ, మోహిత్ శర్మ, ఫాఫ్ డుప్లెసిస్, ముఖేష్ కుమార్, దర్శన్ నల్కండే, వి.నిగమ్, దుష్మంత చమీరా, డోనోవన్ ఫెరీరా.