DC IPL 2025 Players List: ఐపీఎల్ 2025 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ తెలివి.. తక్కువ ధరకే టాప్ ప్లేయర్లు టీమ్‌లోకి
Delhi Capitals Team IPL 2025: కేఎల్ రాహుల్, మిచెల్ స్టార్క్‌కి వేలంలో కనీసం రూ.18-20 కోట్ల ధర పలుకుతుందని అంతా ఊహిాంచారు. కానీ.. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ చౌకగానే ఈ ఇద్దరినీ దక్కించుకుంది. ఆర్టీఎం కార్డు విషయంలోనూ.. డీసీది తెలివైన నిర్ణయమే.
KL Rahul IPL Price: ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ ఆదివారం చాలా తెలివిగా వ్యవహరించింది. కేఎల్ రాహుల్, మిచెల్ స్టార్క్ లాంటి స్టార్ ప్లేయర్లని సైతం చాలా వ్యూహాత్మకంగా తక్కువ ధరకే ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ చేజిక్కించుకుంది. మరీ ముఖ్యంగా.. ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ను కోసం రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) కార్డు వాడిన విధానం జట్టు కూర్పులో ఆ ఫ్రాంఛైజీ స్పష్టతకి నిదర్శనం.
గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఈ 22 ఏళ్ల ఫ్రేజర్ లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్లో 35 బంతుల్లో 55 పరుగులు చేశాడు. 9 ఇన్నింగ్స్‌లో 234 స్ట్రైక్‌రేట్‌తో 330 పరుగులు చేశాడు. ఇందులో సగం పరుగులు సిక్సర్ల రూపంలోనే వచ్చాయి. దాంతో ఈ పవర్ హిట్టర్ కోసం పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీపడగా.. ఆర్టీఎం వాడి రూ.9 కోట్లకి కొనుగోలు చేసింది.
వికెట్ కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్‌ను రూ.14 కోట్లకే ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. కెప్టెన్‌గా కూడా అతనికి అనుభవం ఉండటం కలిసొచ్చే అంశం. ఆస్ట్రేలియాకి చెందిన అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ను రూ.11.75 కోట్లకి దక్కించుకుంది. అలానే ఇంగ్లాండ్ కు చెందిన హ్యారీ బ్రూక్ రూ.6.25 కోట్లకే కొనుగోలు చేసింది. అయితే.. కెప్టెన్ రిషబ్ పంత్‌ను చేజార్చుకోవడం ఢిల్లీ క్యాపిటల్స్‌కి లోటు.
ఐపీఎల్ 2025 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోళ్లు
- హ్యారీ బ్రూక్ (రూ.6.25 కోట్లు)
- జేక్ ఫ్రేజర్-మెక్ గుర్క్ (రూ. 9 కోట్లు)
- కేఎల్ రాహుల్ (రూ. 14 కోట్లు)
- మిచెల్ స్టార్క్ (రూ. 11.75 కోట్లు)
- టి. నటరాజన్ (రూ. 10.75 కోట్లు)
- అశుతోష్ శర్మ (రూ. 3.8కోట్లు)
- మోహిత్ శర్మ (రూ. 2.2 కోట్లు)
- సమీర్ రిజ్వీ (రూ. 95 లక్షలు),
- కరుణ్ నాయర్ (రూ. 50 లక్షలు)
ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే రిటేన్ చేసుకున్న ఆటగాళ్లు
- అక్షర్ పటేల్ (రూ.16.50 కోట్లు)
- కుల్దీప్ యాదవ్ (రూ.13.25 కోట్లు)
- స్టబ్స్ (రూ.10 కోట్లు),
- అభిషేక్ పోరెల్ (రూ.4 కోట్లు)
ఐపీఎల్ 2025 వేలంలో ఆదివారం రూ.59.20 కోట్లని ఖర్చు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. రూ.47 కోట్లని రిటెన్షన్ కోసం ఖర్చు చేసింది. దాంతో ఇక ఆ ఫ్రాంఛైజీ వద్ద రూ.13.80 కోట్లు మాత్రమే ఉన్నాయి.