జీపీఎస్​ చెప్పిందని వెళ్లి కూలిన వంతెన మీద నుంచి పడిన కారు- ముగ్గురు దుర్మరణం!-up gps error dense fog causes car to fall from damaged bridge three dead ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  జీపీఎస్​ చెప్పిందని వెళ్లి కూలిన వంతెన మీద నుంచి పడిన కారు- ముగ్గురు దుర్మరణం!

జీపీఎస్​ చెప్పిందని వెళ్లి కూలిన వంతెన మీద నుంచి పడిన కారు- ముగ్గురు దుర్మరణం!

Sharath Chitturi HT Telugu
Nov 25, 2024 05:49 AM IST

జీపీఎస్​ చెప్పడంతో ఓ కారు నిర్మాణంలో ఉన్న వంతెనపైకి వెళ్లింది. అది సగం కూలిపోయి ఉండటంతో, కారు కింద నదిలోకి పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.

ప్రమాదానికి గురైన కారు ఇదే..
ప్రమాదానికి గురైన కారు ఇదే.. (@SachinGuptaUP)

ఉత్తర్​ప్రదేశ్​లో షాకింగ్​ ఘటన చోటు చేసుకుంది. జీపీఎస్​ చెప్పిందని ఓ నిర్మాణంలో ఉన్న వంతెనపైకి వెళ్లిన ఓ కారు.. అక్కడి నుంచి కిందపడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.

ఇదీ జరిగింది..

బరేలీలో నిర్మాణంలో ఉన్న వంతెనపై నుంచి కారు రాంగంగా నదిలో పడి ముగ్గురు మృతి చెందారు. వారు మ్యాప్​ని ఉపయోగించి నావిగేట్ అయ్యారు. కానీ వంతెన కొంత భాగం దెబ్బతిన్నట్లు సూచించడంలో యాప్ విఫలమైందని వార్తా సంస్థ పిటిఐ నివేదించింది.

బాధితులు బరేలీ నుంచి బదౌన్ జిల్లాలోని డాటాగంజ్ వెళ్తుండగా ఖల్పూర్-దతాగంజ్ రహదారిపై ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఫరీద్ పూర్, బరేలీ, బదౌన్​లోని దాతాగంజ్ పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసు బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయని వివరించారు.

ఈ ఏడాది మొదట్లో వచ్చిన వరదల కారణంగా వంతెన ముందు భాగం కూలిపోయి నదిలో పడిపోయింది. అయితే ఈ మార్పు.. జీపీఎస్​లో అప్​డేట్ అవ్వలేదు. ఫలితంగా, డ్రైవర్​ని తప్పుదారి పట్టించడంతో, వంతెన సురక్షితం కాదని గ్రహించలేదు," అని ఆ ప్రాంత సర్కిల్ ఆఫీసర్ అశుతోష్ శివం చెప్పారు.

జీపీఎస్ యాప్ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిలోకి ప్రయాణికులను తప్పుదోవ పట్టించింది. వంతెనపై భద్రతా అవరోధాలు లేదా హెచ్చరిక సంకేతాలు కూడా లేవు, ఇది ప్రమాదాన్ని పెంచింది. ప్రమాదానికి దారితీసింది.

కారును అప్పటికే అతివేగం మీద ఉండటంతో చివరి నిమిషంలో డ్రైవర్​ కూడా ఏం చేయలేకపోయాడు. దట్టమైన పొగమంచు కారణంగా ముందు ప్రమాదాన్ని డ్రైవర్ గుర్తించలేకపోయాడు.

మృతుల్లో ఇద్దరిని అమిత్, వివేక్​గా గుర్తించారు. వీరంతా ఫరూకాబాద్​లోని ఇమాద్​పూర్ వాసులుగా బరేలీ పోలీసులు తెలిపారు. మూడో వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియరాలేదు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు సర్కిల్ అధికారి తెలిపారు. ఈ ప్రమాదంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

పొగమంచు వల్ల ప్రమాదాలు..

యూపీలోని ఫిరోజాబాద్ జిల్లాలో నవంబర్ 14న రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఒక ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులు గాయపడగా, మరో ప్రమాదంలో మరో అరడజను మంది గాయపడ్డారు.

"దిల్లీ వైపు వెళ్తున్న ఓ ట్రక్కు బ్రేకులు వేయడంతో వెనుక ఉన్న బస్సు డ్రైవర్ ట్రక్కు ఆగడం చూడలేకపోయాడు. బస్సు ట్రక్కు వెనుక భాగాన్ని ఢీకొట్టింది. బస్సు ముందు భాగం దెబ్బతినడంతో పాటు 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి," అని మథుర జిల్లా జైత్ పోలీస్ స్టేషన్ ఇన్​చార్జి ఇన్​స్పెక్టర్ అశ్విని కుమార్ తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం