నవంబర్ 25 రాశి ఫలాలు- ఈ రాశుల వారికి కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది-today november 25th monday rasi phalalu check zodiac wise horoscope prediction in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  నవంబర్ 25 రాశి ఫలాలు- ఈ రాశుల వారికి కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది

నవంబర్ 25 రాశి ఫలాలు- ఈ రాశుల వారికి కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది

HT Telugu Desk HT Telugu
Nov 25, 2024 12:18 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 25.11.2024 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Today Horoscope Telugu: నేటి రాశి ఫలాలు తేదీ 25.11.2024 సోమవారం
Today Horoscope Telugu: నేటి రాశి ఫలాలు తేదీ 25.11.2024 సోమవారం (Pixabay)

రాశిఫలాలు (నేటి రాశిఫలాలు) 25-11-2024

సంవత్సరం: శ్రీ క్రోధినామ సంవత్సర. అయనము: దక్షిణాయనం.

మాసం: కార్తీకము, తిథి: బ. దశమి, వారం: సోమవారం, నక్షత్రం: ఉత్తర

మేషం:

సమస్యలు సానుకూలంగా పరిష్కారమవుతాయి.వివాదాలు కొలిక్కి వస్తాయి. శుభకార్యయత్నాలు చేస్తారు. అందరి సహకారం అందుతుంది. వృత్తివ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృషభం:

ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. వివాదాలు తలెత్తవచ్చు. విద్యార్థులకు అంత అనుకూలంగా ఉండదు. వ్యాపార కార్యకలాపాలు అంత ప్రోత్సాహకరంగా ఉండవు. పనులను వాయిదా వేయవలసి వస్తుంది. చికాకుగా ఉంటుంది. ఓర్పు వహించాలి. కళా, క్రీడారంగాల్లోని వారికి శ్రమాధిక్యం.

మిథునం:

ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్య తలెత్తవచ్చు. అనుకోని పనులు మీద పడతాయి. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆలోచించి అడుగేయండి. వ్యాపారులకు అనుకూలంగా ఉండదు. వివాదాలకు దూరంగా ఉండండి. మాట జారవద్దు.

కర్కాటకం:

ఈ రోజు అంతా బాగుంటుంది. ఉద్యోగులకు పదోన్నతి లభించవచ్చు. కొత్త పరిచయాలు కలసివస్తాయి. అధికారుల అండ లభిస్తుంది. కొత్త పెట్టుబడులకు అనుకూలమైన సమయం. వ్యాపారులకు కలసివస్తుంది. వాహన కొనుగోలు యత్నం చేస్తారు. లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య భంగం వాటిల్లవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహం:

వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు బదిలీ కావచ్చు. ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వ్యాపార ఒప్పందాలు ఫలిస్తాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది.

కన్య:

ఖర్చులు పెరుగుతాయి. అనుకోకుండా సొమ్ము చేతికి అందుతుంది. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. వివాదాలు పరిష్కారమవుతాయి. అందరి సహకారము లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార భాగస్వాముల మధ్య వివాదాలు పరిష్కారమవుతాయి. సహోద్యోగులు సహకరిస్తారు.

తుల:

శ్రమాధిక్యంగా ఉంటుంది. పనుల్లో జాప్యం చోటు చేసుకుంటుంది. ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు. వివాదాలు చోటు చేసుకుంటాయి. ఓర్పు వహించాలి. వ్యాపారులకు లావాదేవీలు బాగా జరుగుతాయి. రాబడి బాగుంటుంది. తొందరపాటు నిర్ణయాలు తగదు.

వృశ్చికం:

నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి. ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. అనుకున్నట్టుగా డబ్బు చేతికి అందదు. పనుల్లో జాప్యం జరుగుతుంది.

ధనుస్సు:

అంతా అనుకూలంగా ఉంటుంది. అప్పులు తీరతాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి. అనుకోని విధంగా సొమ్ము చేతికి అందుతుంది. వ్యాపారులు సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది.

మకరం:

వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త పరిచయాలు లాభిస్తాయి. అంతా అనుకూలంగా ఉంటుంది. డబ్బు చేతికి అంది సమస్యలు తీరతాయి. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు అన్ని విధాలుగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు కలసివస్తుంది.

కుంభం:

అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. మంచి వార్తలు వింటారు. వ్యాపార విస్తరణ చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెడతారు. వాహన కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు వద్దు. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది.

మీనం:

పని మీద దృష్టి పెట్టండి. వివాదాలు చోటు చేసుకోవచ్చు. ఓర్పుతో మౌనంగా ఉండండి. మాట జారవద్దు. అపార్థాలకు చోటివ్వవద్దు. శ్రమానంతర ఫలితం లభిస్తుంది. కొత్త ప్రయోగాలు చేపట్టవద్దు. రాజకీయనాయకులకు, కళాకారులకు అంత అనుకూలంగా ఉండదు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner