Pushpa 2 Kissik Song: పుష్ప 2 కిస్సిక్ సాంగ్‌పై నెటిజన్ల ట్రోల్స్ - పాట లిరిక్స్ ఇవిగో…
Pushpa 2 Kissik Song: అల్లు అర్జున్ పుష్ప 2 నుంచి కిస్సిక్ సాంగ్ రిలీజైంది. ఈ పాటలు అల్లు అర్జున్, శ్రీలీల మాస్ స్టెప్పులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. చెన్నైలో ఆదివారం జరిగిన వైల్డ్ ఫైర్ ఈవెంట్‌లో ఈ పాటను రిలీజ్ చేశారు.
Pushpa 2 Kissik Song: అల్లు అర్జున్ పుష్ప 2 నుంచి కిస్సిక్ సాంగ్ వచ్చేసింది. ఈ పాటలో అల్లు అర్జున్‌తో పాటు శ్రీలీల నటించింది. వీరిద్దరి మాస్ స్టెప్పులు పాటకు హైలైట్‌గా నిలిచాయి. అల్లు అర్జున్‌తో పోటీపడి శ్రీలీల వేసిన డ్యాన్స్ మూవ్‌మెంట్స్ అభిమానులను ఆకట్టుకుంటోన్నాయి. కిస్సిక్ సాంగ్‌ను శుబ్లాషిని ఆలపించింది. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు.
వైల్డ్ ఫైర్ ఈవెంట్...
చెన్నైలో ఆదివారం వైల్డ్ ఫైర్ పేరుతో స్పెషల్ ఈవెంట్‌ను పుష్ప 2 టీమ్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో కిస్సిక్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. చెన్నై వేడుకలో అల్లు అర్జున్, రష్మిక మందన్నతోపాటు సినిమా టీమ్ పాల్గొన్నారు. కిస్సిక్ పాట ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది.
కిస్సిక్ సాంగ్‌పై ట్రోల్స్...
కిస్సిక్ సాంగ్‌కు ప్రశంసలతో పాటు సోషల్ మీడియాలో ట్రోల్ వస్తోన్నాయి. పుష్ప 2 సినిమా కథ మొత్తం 1990 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. కానీ కిస్సిక్ పాటలోనే పదాలు మాత్రం నేటి ట్రెండ్‌కు తగ్గట్లుగా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన చాలా పదాలు పాటలు వినిపించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తోన్నారు. ఊ అంటావా మావ పాటకు కిస్సిక్ సాంగ్ లేదని అంటున్నారు.
డ్యూయెట్ సాంగ్...
పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా షూటింగ్ సోమవారం నాటితో పూర్తికానున్నట్లు సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్, రష్మిక మందన్నలపై హైదరాబాద్‌లో సుకుమార్ ఓ డ్యూయెట్ సాంగ్‌ను చిత్రీకరిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. పుష్ప 2 మూవీలో మలయాళం నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తోన్నాడు. సునీల్, జగపతిబాబు, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు.
పుష్ప 2 ట్రైలర్‌ను ఇటీవల బీహార్‌లోని పాట్నాలో రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు దాదాపు మూడు లక్షలకుపైగా అభిమానులు హాజరయ్యారు.
కిస్సిక్ సాంగ్ లిరిక్స్...
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దించర దించర దించు
మావయ్యోచ్చాడు దించు
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దించర దించర దించు
బావయ్యోచాడు దించు
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
చిచ్చా వచ్చాడు దించు కిస్సిక్
మచ్చా వచ్చాడు దించు కిస్సిక్
పిలిసినోడొచ్చాడు దించు కిస్సిక్
పిలవనోడొచ్చాడు దించు కిస్సిక్
మావోడొచ్చాడు మీవోడొచ్చాడు మనోడొచ్చాడు దించు
ఆళ్లతో ఫోటో ఈళ్లతో ఫోటో ఆల్బం లో అంటించు
మరి నాతో దిగిన బొమ్మను లోకర్లో దాచుంచు
హే పుసుక్కున ఈ కిస్సిక్కులు బైటికి వచ్చాయో
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
పక్కన నిలబడి ఫోటో తీసుకో
భుజాలు గాని రాసుకుంటే
దెబ్బలు పడతయి రో కిస్సిక్
దెబ్బలు పడతయి రో కిస్సిక్
సర్లే భుజం పైన సెయ్యేసి తీసుకో
సేతులు తిన్నగా వుండకపోతే
దెబ్బలు పడతయి రో కిస్సిక్
దెబ్బలు పడతయి రో కిస్సిక్
సింగల్ ఫోటో పర్లేదు
రంగుల ఫోటో పర్లేదు
గ్రూప్ ఫోటో తీసుకుందాం తప్పేమి లేదు
కానీ పబ్లిక్ లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కామెంట్స్ సేసారో
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
ఏ పోసైన ఫోటో తీస్కో
ఎక్సపోసింగ్ ల ఉన్నాదంటే
దెబ్బలు పడతయి రో కిస్సిక్
దెబ్బలు పడతయి రో కిస్సిక్
అంగెల్ ఏదైనా ఫోటో తీస్కో
బాడ్ అంగెల్లో చూసావంటే
దెబ్బలు పడతయి రో కిస్సిక్
దెబ్బలు పడతయి రో కిస్సిక్
తీసిన ఫోటో దాసుకో
తీరుబడిగా సూసుకో
కళ్ళకు పండగ సేసుకో
కాదనేది లేదు
కానీ ఫేసులు గీసులు మార్ఫింగ్ సేసి పిచ్చి పిచ్చి వేషాలు ఏసారొ
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
కిస్ కిస్ కిస్ కిస్సిక్