Youtube first video : యూట్యూబ్​లో అప్లోడ్​ చేసిన తొలి వీడియో ఇదే!-youtube shares its first ever video uploaded 17 years ago ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Youtube First Video : యూట్యూబ్​లో అప్లోడ్​ చేసిన తొలి వీడియో ఇదే!

Youtube first video : యూట్యూబ్​లో అప్లోడ్​ చేసిన తొలి వీడియో ఇదే!

Sharath Chitturi HT Telugu
Jun 13, 2022 02:25 PM IST

Youtube first video : యూట్యూబ్​లో కోట్ల కొద్ది వీడియో ఉంటాయి. కానీ యూట్యూబ్​లో అప్లోడ్​ చేసిన తొలి వీడియో ఏది? అని మీకు ఎప్పుడైనా సందేహం కలిగిందా? అయితే మీ ప్రశ్నకు సమాధానం ఇదే..

<p>యూట్యూబ్​లో అప్లోడ్​ చేసిన తొలి వీడియో ఇదే</p>
యూట్యూబ్​లో అప్లోడ్​ చేసిన తొలి వీడియో ఇదే (REUTERS)

Youtube first video : యూట్యూబ్​.. స్మార్ట్​ఫోన్​ ఉన్న వారి జీవితాల్లో ఈ సామాజిక మాధ్యమ దిగ్గజం ఓ భాగమైపోయింది. చిన్న విషయం నుంచి బుర్రకు అర్థంకాని ఎన్నో అంశాలకు సంబంధించిన వీడియోలకు అడ్డా.. 'యూట్యూబ్​.' అంతేకాకుండా.. క్రియేటివిటీతో మంచి రెవెన్యూను కూడా సంపాదించుకునేందుకు ఇప్పుడు అనేకమంది యూట్యూబ్​ను వినియోగిస్తున్నారు. ఇందులో కోట్ల కొద్ది వీడియోలు దర్శనమిస్తుంటాయి. మరి ఈ యూట్యూబ్​లో అప్లోడ్​ చేసిన తొలి వీడియో ఏంటి? అని మీకు ఎప్పుడైనా సందేహం కలిగిందా? అయితే ఈ కథనమే మీ ప్రశ్నకు సమాధానం.

17ఏళ్ల క్రితం..

యూట్యూబ్​లో అప్లోడ్​ చేసిన తొలి వీడియోకు సంబంధించి సామాజిక మాధ్యమం.. తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో ఓ పోస్ట్​ చేసింది. 'ఇప్పుడు అలోచిస్తుంటే.. ఒకటి అనిపిస్తోంది. మొదటి యూట్యూబ్​ వీడియో.. ఒక 'షార్ట్​' #YouTubeFactFest పేరుతో ఒక షార్ట్​ను రూపొందించి యూట్యూబ్​లో పెట్టాము,' అని చెప్పుకొచ్చింది.

ఆ వీడియోలో యూట్యూబ్​ కో-ఫౌండర్​ జావెద్​ కరీమ్​ కనిపిస్తారు. 17ఏళ్ల క్రితం ఆ వీడియోను యూట్యూబ్​లో అప్లోడ్​ చేశారు. అమెరికాలోని సాన్​ డియాగో జూలో ఏనుగుల ఎదురుగా నిలబడిన జావెద్​ కరీమ్​.. ఓ వీడియోను చిత్రీకరించి.. యూట్యూబ్​లో అప్లోడ్​ చేశారు.

"మనం ఇప్పుడు ఏనుగుల ముందు ఉన్నాము. ఏనుగులకు పొడవాటి ట్రంక్లు(తొండం) ఉన్నాయి. కూల్​ స్టఫ్​. ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు," అని జావెద్​ అన్న వ్యాఖ్యలు.. యూట్యూబ్​ తొలి వీడియోలో రికార్డ్​ అయి ఉండటం విశేషం.

ఈ వీడియోకి ఇప్పటివరకు 235మిలియన్లకుపైగా వ్యూస్​ వచ్చాయి. ఇక యూట్యూబ్​ తొలి వీడియో పోస్ట్​కు ఇన్​స్టాగ్రామ్​లో ఏకంగా 1,68,236 వ్యూస్​ వచ్చాయి.

ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైరల్​గా మారింది. 'వావ్​' అని కొందరు కామెంట్లు పెడుతుంటే.. 'ఈ వీడియో తర్వాత చాలా మంది జీవితాలు మారిపోయాయి' అని యూట్యూబ్​ను మరికొందరు ప్రశంసిస్తున్నారు.

ఇదీ ప్రస్థానం..

యూట్యూబ్​ను 2005 ఫిబ్రవరి 14న లాంచ్​ చేశారు. గూగుల్​ తర్వాత.. రెండో అతిపెద్ద ప్లాట్​ఫారంగా యూట్యూబ్​ నిలిచింది.

యూట్యూబ్​కు నెలకు 2.5బిలియన్​కుపైగా యూజర్లు ఉన్నారు. బిలియన్ల గంటల కొద్ది వీడియోలను చూస్తూ ఉంటారు. ఇది నిజంగానే ప్రజల జీవితాన్ని మార్చేసింది!

యాడ్​ స్కిప్​..

YouTube Hacks | అప్పుడప్పుడు టైమ్​ పాస్​ కోసం యూట్యాబ్​ ఓపెన్ చేస్తాం. లేదా ఏదైనా ముఖ్యమైన వీడియో చూడటం కోసం యూట్యూబ్​ను చూస్తాం. కరెక్టగా అదే సమయానికి మన దగ్గర నెట్​ అయిపోతుంది. డేటా తక్కువుంటే ఎక్కువ సేపు బఫర్ అవుతుంది. లేదా ఇంటర్నెట్​ సర్వర్​ డౌన్​ ఉండొచ్చు. ఈ సమయంలోనే ఎవరో పిలిచినట్లు వస్తాయి యాడ్స్. వీడియో ఓపెన్ చేయగానే స్టార్ట్ అవుతాయి.

పోనిలే స్కిప్​ బటన్ కొడదాం అనుకుంటే.. అక్కడ ఆ ఆప్షన్ ఉండదు. పైగా ఆ వీడియో 20 నుంచి 40 సెకన్ల దాకా.. లేదా ఆపైనా వీడియో ప్లే అవుతూనే ఉంటుంది. దీనిని స్కిప్ చేయడం కూడా అవదు. పైగా ఇది ఫుల్​ క్లారిటీతో ప్లే అయి.. ఉన్నా డేటాను పూర్తిగా అవగొట్టేస్తుంది. తరువాత మనకి కావాల్సిన వీడియో బఫర్ అవుతూ.. బఫర్ అవుతూ.. బఫర్​ అవుతూనే ప్లే అవుతుంది. దానిని పూర్తి చేయడానికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఒక్కోసారి చూడాలన్నా మూడ్, ఉత్సాహం అన్ని సర్వనాశనం అయిపోతాయి. స్కిప్​ చేయలేని యాడ్స్ వచ్చినప్పుడు... వాటిని చూడలేక వీడియోను తర్వాత చూద్దాంలే అని యూట్యూబ్​ని క్లోజ్​ చేసేవారెందరో..

అయితే మీ కోసమే ఓ చక్కటి చిట్కాను మీ ముందుకు తీసుకువచ్చాం. ఈ తరహా యాడ్​లను చూసే గోల లేకుండా.. మీకు నచ్చిన, అవసరమైన వీడియోను ఆస్వాదించాలంటే.. మీరు దీనిని ఫాలో అవ్వాల్సిందే. పైగా దీనిని చేయడానికి మీకు ఇంకో యాప్​ కూడా అవసరం లేదు. మీరు యూట్యూబ్​ తెరిచినప్పుడు.. స్కిప్​ ఆప్షన్​ లేని యాడ్ వస్తుంటే.. యాడ్ డ్యూరేషన్ దగ్గర ఉండే ‘ఐ’ బటన్​ని నొక్కాలి. తర్వాత స్టాప్ సీయింగ్ దిస్​ యాడ్​ బటన్​ను ప్రెస్​ చేయాలి. తర్వాత యస్ కొట్టి.. అక్కడ వచ్చే ఆప్షన్​లలో ఏదొక దానిని ఎంచుకోవాలి. అంతే సింపుల్. వెంటనే మీకు కావాల్సిన వీడియో ప్లే అయిపోతుంది. ఇంకేముంది ఈ చిట్కాను మీరు వాడేయండి. మీ ఫ్రెండ్స్​కి షేర్ చేసేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం