YouTube Hacks | యూట్యూబ్‌లో యాడ్ స్కిప్ చేసే ఆప్షన్ లేదా.. అయితే ఇది మీ కోసమే
యూట్యూబ్‌లో చిరాకు రప్పించేవి యాడ్స్. కనీసం ఇంతకుముందు 5 సెకన్లకైనా యాడ్ స్కిప్ చేసుకునే ఆప్షన్ ఉండేది. కానీ ఇప్పుడు కొన్ని యాడ్స్ ఎంతసేపు వచ్చినా స్కిప్ చేసే ఆప్షనే ఉండదు. అయితే అలా 20, 40 సెకన్లు వచ్చే యాడ్స్‌ను చిటికెలో స్కిప్ చేసే ఆప్షన్ ఉంది మీకు తెలుసా? తెలియకపోతే ఇది చదివేయండి.
YouTube Hacks | అప్పుడప్పుడు టైమ్ పాస్ కోసం యూట్యాబ్ ఓపెన్ చేస్తాం. లేదా ఏదైనా ముఖ్యమైన వీడియో చూడటం కోసం యూట్యూబ్‌ను చూస్తాం. కరెక్టగా అదే సమయానికి మన దగ్గర నెట్ అయిపోతుంది. డేటా తక్కువుంటే ఎక్కువ సేపు బఫర్ అవుతుంది. లేదా ఇంటర్నెట్ సర్వర్ డౌన్ ఉండొచ్చు. ఈ సమయంలోనే ఎవరో పిలిచినట్లు వస్తాయి యాడ్స్. వీడియో ఓపెన్ చేయగానే స్టార్ట్ అవుతాయి.
పోనిలే స్కిప్ బటన్ కొడదాం అనుకుంటే.. అక్కడ ఆ ఆప్షన్ ఉండదు. పైగా ఆ వీడియో 20 నుంచి 40 సెకన్ల దాకా.. లేదా ఆపైనా వీడియో ప్లే అవుతూనే ఉంటుంది. దీనిని స్కిప్ చేయడం కూడా అవదు. పైగా ఇది ఫుల్ క్లారిటీతో ప్లే అయి.. ఉన్నా డేటాను పూర్తిగా అవగొట్టేస్తుంది. తరువాత మనకి కావాల్సిన వీడియో బఫర్ అవుతూ.. బఫర్ అవుతూ.. బఫర్ అవుతూనే ప్లే అవుతుంది. దానిని పూర్తి చేయడానికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఒక్కోసారి చూడాలన్నా మూడ్, ఉత్సాహం అన్ని సర్వనాశనం అయిపోతాయి. స్కిప్ చేయలేని యాడ్స్ వచ్చినప్పుడు... వాటిని చూడలేక వీడియోను తర్వాత చూద్దాంలే అని యూట్యూబ్‌ని క్లోజ్ చేసేవారెందరో..
జస్ట్ సింపుల్ స్టెప్స్..
అయితే మీ కోసమే ఓ చక్కటి చిట్కాను మీ ముందుకు తీసుకువచ్చాం. ఈ తరహా యాడ్లను చూసే గోల లేకుండా.. మీకు నచ్చిన, అవసరమైన వీడియోను ఆస్వాదించాలంటే.. మీరు దీనిని ఫాలో అవ్వాల్సిందే. పైగా దీనిని చేయడానికి మీకు ఇంకో యాప్ కూడా అవసరం లేదు. మీరు యూట్యూబ్ తెరిచినప్పుడు.. స్కిప్ ఆప్షన్ లేని యాడ్ వస్తుంటే.. యాడ్ డ్యూరేషన్ దగ్గర ఉండే ‘ఐ’ బటన్ని నొక్కాలి. తర్వాత స్టాప్ సీయింగ్ దిస్ యాడ్ బటన్‌ను ప్రెస్ చేయాలి. తర్వాత యస్ కొట్టి.. అక్కడ వచ్చే ఆప్షన్లలో ఏదొక దానిని ఎంచుకోవాలి. అంతే సింపుల్. వెంటనే మీకు కావాల్సిన వీడియో ప్లే అయిపోతుంది. ఇంకేముంది ఈ చిట్కాను మీరు వాడేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసేయండి.
టాపిక్