Game Changer Release Date: గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్‍ను కన్ఫర్మ్ చేసిన థమన్.. మరిన్ని అప్‍డేట్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్
Game Changer Release Date: గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ డేట్‍పై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సర్‌ప్రైజింగ్ అప్‍డేట్ ఇచ్చారు. విడుదల తేదీని కన్ఫర్మ్ చేసేశారు. రెండో పాట, బీజీఎం గురించి కూడా వెల్లడించారు.
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో ముందు వరుసలో ఉంది ‘గేమ్ ఛేంజర్’. మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రం కోసం నిరీక్షణ కొనసాగుతోంది. మూడేళ్లుగా ఈ ప్రాజెక్ట్ సాగుతూనే ఉంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా గేమ్ ఛేంజర్ మూవీని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు. అయితే, రిలీజ్ ఎప్పుడా అనే ఉత్కంఠ మాత్రం కంటిన్యూ అవుతోంది. ఈ తరుణంలో ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సడెన్ అప్‍డేట్ ఇచ్చేశారు.
రిలీజ్ డేట్ ఇదే
గేమ్ ఛేంజర్ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ అవుతుందని థమన్ నేడు (సెప్టెంబర్ 18) వెల్లడించారు. ఈ చిత్రంపై ఇచ్చిన అప్‍డేట్లలో విడుదల తేదీని కూడా పేర్కొన్నారు. సడెన్ అప్‍డేట్‍తో గుడ్‍న్యూస్ చెప్పేశారు.
ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా గేమ్ ఛేంజర్ మూవీని రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్‍రాజు కొన్నాళ్లుగా చెబుతూ వస్తున్నారు. దీంతో డిసెంబర్ 20న ఈ మూవీ రిలీజ్ అవుతుందనే అంచనాలు వచ్చాయి. అయితే, రామ్‍చరణ్ పుట్టిన రోజు కూడా ఈ డేట్‍ను వెల్లడించపోవటంతో మళ్లీ ఉత్కంఠ రేగింది. అయితే, డిసెంబర్ 20నే వస్తుందని థమన్ ఇప్పుడు ఖరారు చేశారు.
వచ్చే వారం నుంచి..
గేమ్ ఛేంజర్ సినిమాపై వచ్చే వారం నుంచి అన్‍స్టాపబుల్ అప్‍డేట్స్ వస్తాయనేలా థమన్ ట్వీట్ చేశారు. “వచ్చే వారం నుంచి అన్‍స్టాపబుల్ ఈవెంట్స్ ఉండనున్నాయి. 2024 డిసెంబర్ 20న గేమ్ ఛేంజర్ చిత్రం రిలీజ్ కానుంది” అని థమన్ పోస్ట్ చేశారు. ఈ మూవీని నిర్మిస్తున్న శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ఈ ట్వీట్‍ను రీపోస్ట్ చేసింది.
గేమ్ ఛేంజర్ సినిమా కోసం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ పనులు అక్టోబర్ 1వ తేదీన మొదలవుతాయని మరో ట్వీట్ చేశారు థమన్. మొత్తంగా వరుస అప్‍డేట్లతో థమన్ సర్‌ప్రైజ్ చేశారు.
రెండో పాటపై..
గేమ్ ఛేంజర్ నుంచి సెప్టెంబర్‌లోనే రెండో పాట రానుంది. రామ్‍చరణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 7న ఈ విషయాన్ని మూవీ టీమ్ చెప్పింది. చరణ్ కొత్త పోస్టర్ తెచ్చింది. మాస్ సాంగ్ వస్తుందని వెల్లడించింది. అయితే, డేట్ మాత్రం ఖరారు చేయలేదు. ఈ పాటపై వచ్చే వారం అప్‍డేట్ వస్తుందనేలా థమన్ ట్వీట్ చేశారు. “తర్వాత అప్‍డేట్ వచ్చే వారం ఉంటుంది. మనం స్మాష్ చేసేద్దాం” ఇంకో ట్వీట్ చేశారు థమన్. మొత్తంగా డిసెంబర్ 20న గేమ్ ఛేంజర్ రానుందంటూ చెప్పి అభిమానులను సంతోషపరిచారు.
గేమ్ ఛేంజర్ షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని టాక్. ఈ చిత్రంలో రామ్‍చరణ్ సరసన కియారా అడ్వానీ హీరోయిన్‍గా చేశారు. ఎస్‍జే సూర్య, అంజలి, సునీల్, శ్రీకాంత్, జయరాం, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజుతో పాటు శిరీష్ ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశారు. పొలిటికల్ అంశం ఉన్నా ఈ మూవీ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని దిల్‍రాజు ఇటీవల చెప్పారు.