Game Changer: రామ్‍చరణ్ పని పూర్తి! రేపు ఆ ఈవెంట్లో రిలీజ్‍పై శంకర్ క్లారిటీ ఇస్తారా?-ram charan completes his shooting part for game changer movie and release date yet to announce ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Game Changer: రామ్‍చరణ్ పని పూర్తి! రేపు ఆ ఈవెంట్లో రిలీజ్‍పై శంకర్ క్లారిటీ ఇస్తారా?

Game Changer: రామ్‍చరణ్ పని పూర్తి! రేపు ఆ ఈవెంట్లో రిలీజ్‍పై శంకర్ క్లారిటీ ఇస్తారా?

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 06, 2024 06:22 PM IST

Game Changer - Ram Charan: గేమ్ ఛేంజర్ సినిమాపై బిగ్ అప్‍డేట్ బయటికి వచ్చింది. రామ్‍చరణ్ షూటింగ్ పార్ట్ పూర్తయిందని తెలుస్తోంది. రిలీజ్ డేట్‍పై ఉత్కంఠ నెలకొని ఉంది.

Game Changer: రామ్‍చరణ్ పని పూర్తి! రేపు ఆ ఈవెంట్లో రిలీజ్‍పై శంకర్ క్లారిటీ ఇస్తారా?
Game Changer: రామ్‍చరణ్ పని పూర్తి! రేపు ఆ ఈవెంట్లో రిలీజ్‍పై శంకర్ క్లారిటీ ఇస్తారా?

మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు నిరీక్షిస్తున్నారు. అయితే, తమిళ స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఎప్పటికప్పుడు ఆలస్యమవుతూనే ఉంది. దీంతో రెండేళ్ల క్రితమే షూటింగ్ మొదలైనా ఇప్పటికీ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఖరారు కాలేదు. అయితే, ఈ సినిమాపై తాజాగా భారీ అప్‍డేట్ వెల్లడైంది.

రామ్‍చరణ్ షూటింగ్ ఫినిష్

గేమ్ ఛేంజర్ సినిమా కోసం హీరో రామ్‍చరణ్ షూటింగ్ పార్ట్ పూర్తయిందని తెలుస్తోంది. నేటి (జూలై 6)తో ఈ చిత్రంలో తన చిత్రీకరణను చరణ్ ఫినిష్ చేసుకున్నారని సమాచారం. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ పూర్తి షూటింగ్‍ను డైరెక్టర్ శంకర్ పూర్తి చేయనున్నారు.

రిలీజ్ డేట్‍పై టెన్షన్

గేమ్ ఛేంజర్ సినిమా ఈ ఏడాదే వస్తుందని మూవీ టీమ్ చెబుతూ వస్తోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని నిర్మాత దిల్‍రాజు ఇటీవలే చెప్పారు. నిర్మాతగా 50వ చిత్రం కావడంతో ఈ చిత్రాన్ని దిల్‍రాజు మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గేమ్ ఛేంజర్ మూవీ భారీ బడ్జెట్‍తో రూపొందుతోంది. ఆర్ఆర్ఆర్ చిత్రంతో రామ్‍చరణ్‍కు గ్లోబల్ రేంజ్‍లో క్రేజ్ వచ్చింది. దీంతో ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీని మరింత గ్రాండ్ స్కేల్‍లో తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ శంకర్.

రేపు క్లారిటీ ఇస్తారా?

శంకర్ దర్శత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన నటించిన భారతీయుడు 2 సినిమాకు సంబంధించి హైదరాబాద్‍లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. రేపు (జూలై 7) సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‍లోని ఎన్ కన్వెన్షన్స్‌లో జరగనుంది. దీంతో ఈ ఈవెంట్లో డైరెక్టర్ శంకర్‌కు గేమ్ ఛేంజర్‌కు సంబంధించిన ప్రశ్నలు చాలా ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ ఈవెంట్‍లో గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ గురించి శంకర్ ఏమైనా క్లారిటీ ఇస్తారా అనే ఆసక్తి నెలకొని ఉంది.

గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్‍పై రూమర్లు వస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ లేకపోతే డిసెంబర్‌కు వస్తుందని ఊహాగానాలు ఉన్నాయి. అయితే, మూవీ టీమ్ ఇప్పటి స్పష్టంగా చెప్పలేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులను బట్టి రిలీజ్ డేట్ గురించి వెల్లడించే ఛాన్స్ ఉంది.

గేమ్ ఛేంజర్ మూవీ నుంచి ఇప్పటి వరకు ఒక్క పాటే వచ్చింది. జరగండి.. జరగండి అంటూ సాంగ్ మార్చిలో వచ్చింది. ఆ తర్వాత పెద్దగా ఏ అప్‍డేట్ రాలేదు. మరో సాంగ్‍కు సంబంధించి ఊసు కూడా లేదు. దీంతో రామ్‍చరణ్ ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. ఈ తరుణంలో రిలీజ్ డేట్‍ను అనౌన్స్ చేసి మూవీ టీమ్ మళ్లీ ఎప్పుడు జోష్ తీసుకొస్తుందో చూడాలి.

గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్‍చరణ్ సరసన కియారా అడ్వానీ హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఎస్‍జే సూర్య, అంజలి, శ్రీకాంత్, జయరాం, సునీల్, సుముద్రఖని, ప్రకాశ్ రాజ్, నాజర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

మరోవైపు, గేమ్ ఛేంజర్ సినిమాలో తన షూటింగ్ పూర్తవడంతో డైరెక్టర్ బుచ్చిబాబుతో చిత్రంపై (RC16) రామ్‍చరణ్ దృష్టి సారించనున్నారు.

WhatsApp channel