Bharateeyudu 2 Trailer: ‘ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం’: భారతీయుడు 2 ట్రైలర్ రిలీజ్.. సేనాపతిగా మళ్లీ కమల్ విశ్వరూపం-kamal haasan bharateeyudu 2 trailer released indian 2 director shankar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bharateeyudu 2 Trailer: ‘ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం’: భారతీయుడు 2 ట్రైలర్ రిలీజ్.. సేనాపతిగా మళ్లీ కమల్ విశ్వరూపం

Bharateeyudu 2 Trailer: ‘ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం’: భారతీయుడు 2 ట్రైలర్ రిలీజ్.. సేనాపతిగా మళ్లీ కమల్ విశ్వరూపం

Chatakonda Krishna Prakash HT Telugu
Published Jun 25, 2024 07:23 PM IST

Bharateeyudu 2 Trailer: భారతీయుడు 2 ట్రైలర్ వచ్చేసింది. కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సీక్వెల్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.

Bharateeyudu 2 Trailer: ‘ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం’: భారతీయుడు 2 ట్రైలర్ రిలీజ్.. సేనాపతిగా మళ్లీ కమల్ విశ్వరూపం
Bharateeyudu 2 Trailer: ‘ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం’: భారతీయుడు 2 ట్రైలర్ రిలీజ్.. సేనాపతిగా మళ్లీ కమల్ విశ్వరూపం

తమిళ సీనియర్ స్టార్ హీరో, ఉలగనాయగన్ కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించిన ఇండియన్ 2 (తెలుగులో భారతీయుడు 2)కు ఫుల్ హైప్ ఉంది. బ్లాక్‍బస్టర్ భారతీయుడు (1996) చిత్రానికి 28 ఏళ్ల తర్వాత సీక్వెల్‍గా ఈ మూవీ వస్తోంది. అవినీతిపరులపై, అన్యాయంపై యుద్ధం చేసే సేనాపతిగా కమల్ మరోసారి భారతీయుడు 2లో కనిపిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై చాలా భారీ అంచనాలు ఉన్నాయి. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ మూవీని తెరకెక్కించారు. భారతీయుడు 2 చిత్రం జూలై 12వ తేదీన రిలీజ్ కానుంది. ఈ తరుణంలో నేడు (జూన్ 25) ఈ మూవీ ట్రైలర్ వచ్చేసింది.

ట్రైలర్ ఇలా..

భారతీయుడు 2 ట్రైలర్ అదిరిపోయింది. దేశంలోని సమస్యల ఆధారంగానే ఈ చిత్రం వస్తోంది. దుర్మార్గుల అంతుచూసే స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా కమల్ హాసన్ అదరగొట్టారు. వివిధ గెటప్‍ల్లో కనిపించారు. “ఊరా రా ఇది.. చదువుకు తగ్గ జాబ్ లేదు.. జాబ్‍కు తగ్గ జీతం లేదు.. కట్టిన పన్నుకు తగ్గట్టు సదుపాయాలు దొరకడం లేదు.. దొంగలించే వాడు దొంగలిస్తూనే ఉంటాడు.. తప్పు చేసే వాడు తప్పు చేస్తూనే ఉంటాడు” అనే వాయిస్ ఓవర్‌తో దేశంలోని సమస్యలను చూపిస్తూ భారతీయుడు 2 సినిమా ట్రైలర్ మొదలైంది. నోటికొచ్చినట్టు మాట్లాడతాం కానీ పరిస్థితి మార్చేందుకు కొంచెం కూడా ప్రయత్నించడం లేదని సిద్ధార్థ్ డైలాగ్ ఉంది. మార్పులను తీసుకొచ్చేందుకు ఉద్యమాలు చేస్తున్నట్టుగా ఉంది. అన్యాయాలు చేసే అందరినీ వేటాడే హంటింగ్ డాగ్ రావాలని సిద్ధార్థ్ కోరుకుంటారు.

నేతాజీ మార్గంలో నేను

అప్పుడు సేనాపతి (కమల్ హాసన్) ఎంట్రీ ఉంది. అవినీతి పరులను, అన్యాయాలను చేసే వారిని సేనాపతి వేటాడే యాక్షన్ సీన్లు ఉన్నాయి. ఎస్‍జే సూర్య ఒంటినిండా బంగారంతో కనిపించారు. “ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు.. నేతాజీ మార్గంలో నేను” అని ఉద్యమకారులతో కమల్ అంటారు. దుర్మార్గుల పనిపడతారు. 2 నిమిషాల 37 సెకన్ల పాటు ఉన్న భారతీయుడు 2 ట్రైలర్ ఆసాంతం ఇంట్రెస్టింగ్‍గా ఉంది. ఈ చిత్రంపై అంచనాలను పెంచేసింది. తమిళం, తెలుగుతో పాటు హిందీలోనూ ట్రైలర్ వచ్చింది.

కమల్ నట విశ్వరూపం

భారతీయుడు 2 సినిమా చాలా విభిన్న గెటప్‍ల్లో కమల్ హాసన్ కనిపించనున్నారు. లోకనాయుడు కమల్ విశ్వరూపాన్ని మరోసారి ఈ మూవీలో చూడడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలర్లోనే చాలా గెటప్స్ ఉన్నాయి. యాక్షన్‍తోనూ కమల్ హాసన్ దుమ్మురేపారు. ఈ వయసులోనూ షర్ట్ లెస్ యాక్షన్ సీన్ చేశారు.

భారతీయుడు 2 చిత్రంలో కమల్ హాసన్, సిద్ధార్థ్‌తో పాటు రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‍జే సూర్య, బాబీ సింహా, వివేక్, ప్రియా భవానీ శంకర్, బ్రహ్మానందం, సముద్రఖని కీలకపాత్రలు పోషించారు. కాజల్ అగర్వాల్ కూడా నటించినా ఆమె పాత్ర భారతీయుడు 3లో ఎక్కువగా ఉండనుంది.

భారతీయుడు 2 చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్లో పర్వాలేదనేలా ఉంది. దర్శకుడు శంకర్ మరోసారి తన మార్క్ టేకింగ్‍తో అదరగొట్టారు. ఈ మూవీ లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్స్ పతాకాలపై సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ నిర్మించారు. జూలై 12న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది.

Whats_app_banner