RC 16 Update: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజ సినిమా భారీ హిట్ దిశగా సాగుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ రివేంజ్ యాక్షన్ మూవీకి భారీగా వసూళ్లు దక్కుతున్నాయి. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా తెలుగు డైరెక్టర్ బుచ్చిబాబు సానతో విజయ్ సేతపతి ఇంటర్వ్యూ నిర్వహించింది మూవీ టీమ్. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాలో సేతుపతి ముఖ్యమైన పాత్ర చేశారు. తనకు బుచ్చిబాబు తమ్ముడి లాంటి వాడని కూడా ఇటీవలే ఆయన చెప్పారు. కాగా, మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్‍తో బుచ్చిబాబు (RC16) తెరకెక్కించనున్న సినిమా ప్రస్తావన ఈ ఇంటర్వ్యూలో వచ్చింది. దీనిపై ఇద్దరూ మాట్లాడారు.
రామ్‍చరణ్‍తో మూవీ ఎప్పుడు మొదలవుతుందని బుచ్చిబాబును విజయ్ సేతుపతి ప్రశ్నించారు. దీంతో ఈ మూవీ షూటింగ్ ఆగస్టులో మొదలవుతుందని బుచ్చిబాబు సమాధానం ఇచ్చారు. దీంతో మరో రెండు నెలల్లోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలుకానుందని క్లారిటీ వచ్చేసింది.
రామ్‍చరణ్‍తో బుచ్చిబాబు చేసే సినిమా హిట్ పక్కా అని విజయ్ సేతుపతి అన్నారు. ఈ కథను అద్భుతంగా రాశావని బుచ్చిని ప్రశంసించారు. “రామ్‍చరణ్ సినిమా కోసం ఆల్ ది బెస్ట్. నాకు ఆ స్టోరీ తెలుసు. అది అద్భుతమైన స్టోరీ. నేను ఇప్పుడే చెబుతున్నా అది సూపర్ డూపర్ సినిమా. మీరు కథ రాసిన విధానం అద్భుతం” అని బుచ్చిబాబుతో విజయ్ సేతుపతి అన్నారు.
ఆర్సీ16 సినిమాపై విజయ్ సేతుపతి హైప్ మరింత పెంచేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. రామ్‍చరణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని స్పోర్ట్స్ డ్రామాగా బుచ్చిబాబు సాన తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.
రామ్‍చరణ్ ప్రస్తుతం గేమ్‍ఛేంజర్ సినిమా షూటింగ్‍లో బిజీగా ఉన్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ ఈ పొలిటికల్ యాక్షన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. అయితే, ఎట్టకేలకు జూలైలో షూటింగ్ పూర్తవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను దిల్‍రాజు నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ‘జరగండి.. జరగండి’ ఓ సాంగ్ వచ్చింది. అయితే రిలీజ్ డేట్ ఫిక్స్ కాలేదు. గేమ్‍ఛేంజర్ మూవీ షూటింగ్ పూర్తయిన వెంటనే బుచ్చిబాబుతో ఆర్సీ16 ప్రాజెక్టును రామ్‍చరణ్ షూరూ చేయనున్నారు.
ఆర్సీ16 చిత్రంలో రామ్‍చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ పూజా కార్యక్రమం కూడా జరిగింది. ఆగస్టులో షూటింగ్ మొదలవుతుందని తాజాగా అప్‍డేట్ ఇచ్చేశారు డైరెక్టర్ బుచ్చిబాబు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేనీ, రవిశంకర్ ఈ మూవీని నిర్మించనున్నారు.
విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజ సినిమా జూన్ 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. తమిళంతో పాటు తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్, కథ, స్క్రీన్‍ప్లే అదిరిపోయాయని పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో తొలి రోజు మోస్తరు వసూళ్లు వచ్చినా.. ఆ తర్వాత పుంజుకున్నాయి. ఈ చిత్రానికి భారీ వసూళ్లు వస్తున్నాయి. సేతుపతికి హీరోగా ఇది 50వ మూవీగానూ ఉంది. మహారాజ చిత్రానికి నిథినల్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు.
టాపిక్