Balakrishna - Mahesh Babu: బాలకృష్ణ, మహేశ్ బాబు మల్టీస్టారరా? థమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వీడియో వైరల్-is balakrishna and mahesh babu multi starrer movie on cards ss thaman made interesting comments in aha ott show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Balakrishna - Mahesh Babu: బాలకృష్ణ, మహేశ్ బాబు మల్టీస్టారరా? థమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వీడియో వైరల్

Balakrishna - Mahesh Babu: బాలకృష్ణ, మహేశ్ బాబు మల్టీస్టారరా? థమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వీడియో వైరల్

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 08, 2024 02:32 PM IST

Balakrishna - Mahesh Babu: స్టార్ హీరోలు బాలకృష్ణ, మహేశ్ బాబు మల్టీస్టారర్ అంటూ సంగీత దర్శకుడు థమన్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు ఇండియన్ ఐడల్ షోలో థమన్ ఈ విషయం గురించి మాట్లాడారు. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Balakrishna - Mahesh Babu: బాలకృష్ణ, మహేశ్ బాబు మల్టీస్టారరా? థమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వీడియో వైరల్
Balakrishna - Mahesh Babu: బాలకృష్ణ, మహేశ్ బాబు మల్టీస్టారరా? థమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. వీడియో వైరల్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇద్దరికీ ఫ్యాన్ బేస్ బలంగా ఉంటుంది. మాస్ సినిమాలకు బాలయ్య కేరాఫ్ కాగా.. మహేశ్ ఎక్కువగా క్లాసీ క్యారెక్టర్లు చేస్తుంటారు. ఒకవేళ ఈ ఇద్దరు కలిసి మూవీ చేస్తే అది క్రేజీ మల్టీస్టారర్ అవుతుంది. అసలు ఆ సినిమా ఎలా ఉంటుందనే ఊహనే ఎగ్జైట్ చేస్తుంది. అయితే, ఈ ఇద్దరు స్టార్ హీరోల మల్టీస్టారర్ సినిమా ఉందంటూ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చెప్పడం ఇంట్రెస్టింగ్‍గా మారింది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ షోలో థమన్ తాజాగా ఈ కామెంట్స్ చేశారు.

కథ కూడా విన్నా..

తెలుగు ఇండియన్ ఐడల్ సెమీఫైనల్స్‌లో యాంకర్ శ్రీరామచంద్ర.. జడ్జిగా ఉన్న థమన్‍ను ఓ ప్రశ్న అడిగారు. బాలకృష్ణ, మహేశ్ బాబు సినిమాల్లో ఒకరి సినిమాకు మ్యూజిక్ చేయాల్సి వస్తే.. ఎవరి చిత్రానికి పని చేస్తారనే రామచంద్ర అడిగారు. దీనికి థమన్ స్పందించారు. వాళ్లిద్దరూ మల్టీస్టారర్ చేస్తారని ఆయన చెప్పారు.

మహేశ్ బాబు, బాలకృష్ణ మల్టీస్టారర్ కథ కూడా తాను విన్నానని థమన్ చెప్పారు. “వాళ్లిద్దరి మల్టీస్టారర్ మూవీకి చేస్తా. ఒక కథ కూడా విన్నా నేను” అని థమన్ చెప్పారు. అవునా అంటూ శ్రీరామచంద్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మల్టీస్టారర్ వస్తుందని థమన్ రివీల్ చేశారని అన్నారు.

నిజమా.. సరదానా?

మహేశ్ బాబు, బాలకృష్ణ మల్టీస్టారర్ గురించి థమన్ చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కాంబినేషన్లో చిత్రం వస్తే బాక్సాఫీస్ బద్దలవుతుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే, మల్టీస్టారర్ సినిమా అంటూ థమన్ సీరియస్‍గా చెప్పారా.. సరదాగా అన్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మహేశ్ బాబు తదుపరి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో గ్లోబల్ రేంజ్‍లో సినిమా చేయనున్నారు. దీంతో కనీసం ఇంకో మూడేళ్ల మహేశ్ మరే మూవీ చేసే అవకాశం లేదు. మరి బాలయ్యతో కలిసి ఇప్పట్లో మూవీ చేసే ఛాన్స్ లేనట్టే. ఒకవేళ నిజంగానే ఆ కథ ఉండి.. ఆ ఇద్దరూ ఓకే చెప్పినా ఈ మూవీ పట్టాలెక్కేందుకు నాలుగు సంవత్సరాలైనా పడుతుంది. నిజంగానే ఈ మల్టీస్టారర్ ఆలోచనలు ఉన్నాయా.. థమన్ సరదాగా అన్నారా అనేది చూడాలి.

రాజమౌళితో మూవీకి మహేశ్ బాబు తన లుక్‍ను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే జుట్టు, గడ్డం భారీగా పెంచేశారు. గ్లోబల్ రేంజ్‍లో భారీ బడ్జెట్‍తో అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందనుంది. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని సినీ ప్రేక్షకులందరూ వేచిచూస్తున్నారు.

బాలకృష్ణ ప్రస్తుతం బాబీ కొల్లితో ఓ యాక్షన్ ప్యాక్డ్ మూవీ (NBK 109) చేస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ లేకపోతే వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఈ మూవీకి థమనే సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్లు బాబీ డియోల్, ఉర్వశి రౌతేలా కీలకపాత్రలు పోషిస్తున్నారు.