Mahesh Babu: అనంత్ అంబానీ పెళ్లికి మహేశ్ బాబు.. మరింత లాంగ్ హెయిర్‌తో సూపర్ లుక్: వీడియో
Mahesh Babu - Anant Ambani Wedding: అనంత్ అంబానీ - రాధికా మర్చెంట్ వివాహానికి మహేశ్ బాబు బయలుదేరి వెళ్లారు. విమానాశ్రయంలో ఆయన కనిపించారు. మరింత ఎక్కువ లాంగ్ హెయిర్‌లో ఆయన లుక్ అదిరిపోయింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు తదుపరి దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేయనున్నారు. ఈ మూవీ (SSMB29) షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక, సెట్‍లను పూర్తి చేసే పనిలో రాజమౌళి ఉన్నప్పుట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం తన లుక్‍ను మార్చుకునే పనిలో మహేశ్ ఉన్నారు. కాగా, అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహానికి హాజరయ్యేందుకు నేడు ముంబైకు వెళ్లారు మహేశ్ బాబు.
బిలీనియర్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ - రాధికా మర్చెంట్ వివాహం నేడు (జూలై 12) ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్ష్ సెంటర్‌లో అత్యంత వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు వేలాది మంది సెలెబ్రిటీలు హాజరవుతున్నారు.
లాంగ్ హెయిర్‌లో మహేశ్
అనంత్ అంబానీ పెళ్లి కోసం హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ముంబైకి వెళ్లారు మహేశ్ బాబు. ఎయిర్‌పోర్టులో కెమెరాలకు చిక్కారు. లైట్ పింక్ కలర్ టీ షర్ట్, లైట్ బ్లూ జీన్స్ ధరించి సింపుల్‍గా స్టైలిష్‍గా కనిపించారు. బ్రౌన్ కలర్ క్యాప్, గ్లాసెస్ ధరించారు. ఈ సింపుల్ ఔట్‍ఫుట్‍లో లాంగ్ హెయిర్‌తో మహేశ్ బాబు లుక్ అల్ట్రా స్టైలిష్‍గా ఉంది.
మహేశ్ బాబు తన హెయిర్‌ను మరింత పెంచుతున్నారు. గత నెల కంటే ఇప్పుడు మరింత ఎక్కువ హెయిర్‌తో కనిపించారు. దీంతో రాజమౌళి సినిమా కోసం ఆయన హెయిర్ పెంచుతున్నారని తెలుస్తోంది. గతంలో ఏ చిత్రంలో కనిపించని విధంగా ఈ మూవీలో మహేశ్ డిఫరెంట్‍గా కనిపించనున్నారు. అమెజాన్ అడవుల బ్యాక్‍డ్రాప్‍లో గ్లోబల్ అడ్వెంచర్ యాక్షన్ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కనుంది. కాగా, మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ కూడా ఈ అనంత్ అంబానీ పెళ్లికి హాజరుకానున్నారు.
పుట్టిన రోజున అప్‍డేట్?
మహేశ్ బాబు వచ్చే నెల ఆగస్టు 9న పుట్టిన రోజు జరుపుకోనున్నారు. రాజమౌళితో సినిమా గురించి ఆరోజున అప్‍డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆరోజున మూవీ షూటింగ్ మొదలవుతుందని రూమర్లు వచ్చినా.. మరింత ఆలస్యమవుతుందని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. సెప్టెంబర్ లేకపోతే అక్టోబర్‌లో మహేశ్ - రాజమౌళి మూవీ షూటింగ్ షురూ అవుతుందని అంచనాలు ఉన్నాయి. అయితే, ఆగస్టు 9న ఏదైనా అప్‍డేట్ వస్తుందనే ఆశతో ఉన్నారు సూపర్ స్టార్ అభిమానులు.
మహేశ్ బాబు - రాజమౌళి చిత్రంలో మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై చర్చలు పూర్తికాగా.. నటించేందుకు పృథ్వి ఓకే చెప్పారని తెలుస్తోంది. అతడి పాత్ర రెగ్యులర్ విలన్‍లా కాకుండా.. విభిన్నంగా ఉండనుందని తెలుస్తోంది.
రాజమౌళితో చిత్రం కోసం బాడీని మరింత పెంచుతున్నారు మహేశ్. ఇందుకోసం ప్రత్యేకంగా ఫిజికల్ ట్రైనింగ్స్ కూడా తీసుకుంటున్నారు. గతంలో ఇందుకోసమే కొన్ని రోజులు జర్మనీకి కూడా సూపర్ స్టార్ వెళ్లారు.
యశ్ కూడా..
కేజీఎఫ్ స్టార్, కన్నడ హీరో యశ్ కుడా అనంత్ అంబానీ - రాధికా మర్చెంట్ వివాహానికి హాజరయ్యేందుకు ముంబైకు వచ్చారు. ముంబై విమానాశ్రయంలో ఆయన కనిపించారు. ప్రస్తుతం యశ్ టాక్సిక్ అనే చిత్రం చేస్తున్నారు. ఈమూవీకి గీతా మోహన్‍దాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
అనంత్ అంబానీ - రాధిక వివాహం నేడు జరగనుంది. రేపు (జూలై 13) శుభ్ ఆశీర్వాద్ వేడుక ఉండనుంది. జూలై 14న మంగళ్ ఉత్సవ్ రిసెప్షన్‍తో ఈ పెళ్లి వేడుకలు ముగియనున్నాయి.