Game Changer Updates: గేమ్ ఛేంజర్ అప్‍డేట్స్ ఎప్పటి నుంచి వస్తాయో చెప్పిన థమన్.. సినిమాలో ఎన్ని పాటలంటే..-ram charan game changer updates to out from august end and movie has seven song music director thaman reveals ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Game Changer Updates: గేమ్ ఛేంజర్ అప్‍డేట్స్ ఎప్పటి నుంచి వస్తాయో చెప్పిన థమన్.. సినిమాలో ఎన్ని పాటలంటే..

Game Changer Updates: గేమ్ ఛేంజర్ అప్‍డేట్స్ ఎప్పటి నుంచి వస్తాయో చెప్పిన థమన్.. సినిమాలో ఎన్ని పాటలంటే..

Game Changer Updates: గేమ్ ఛేంజర్ సినిమా గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కొన్ని విషయాలు చెప్పారు. ఈ మూవీ నుంచి ఎప్పటి నుంచి అప్‍డేట్స్ వస్తాయో వెల్లడించారు. ఎన్ని పాటలు ఉండనున్నాయో కన్ఫర్మ్ చేశారు.

Game Changer Updates: గేమ్ ఛేంజర్ అప్‍డేట్స్ ఎప్పటి నుంచి వస్తాయో చెప్పిన థమన్.. సినిమాలో ఎన్ని పాటలంటే..

గేమ్ ఛేంజర్ సినిమా అప్‍డేట్ల కోసం మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం నుంచి ‘జరగండి.. జరగండి’ సాంగ్ మినహా మరే మేజర్ అప్‍డేట్ రాలేదు. రెండో పాట కోసం ఫ్యాన్స్ నిరీక్షిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. అయితే, క్రిస్మస్ సందర్భంగా విడుదల చేస్తామని నిర్మాత దిల్‍రాజు ఇటీవల చెప్పి కాస్త క్లారిటీ ఇచ్చారు. ఈ తరుణంలో గేమ్ ఛేంజర్ గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కొన్ని విషయాలు చెప్పారు. ఈ చిత్రం నుంచి వరుసగా అప్‍డేట్లు ఎప్పటి నుంచి వస్తాయో వెల్లడించారు.

ఆగస్టు ఆఖరి నుంచి..

గేమ్ ఛేంజర్ చిత్రం నుంచి ఆగస్టు నెలాఖరి నుంచి అప్‍డేట్లు వరుసగా వస్తాయని థమన్ చెప్పేశారు. రెండో పాట కూడా అప్పుడే వస్తుందని హింట్ ఇచ్చారు. హైదరాబాద్‍లో నేడు (జూలై 23) జరిగిన ఓ ఈవెంట్‍లో థమన్ ఈ విషయాలు చెప్పారు. “డిసెంబర్‌లో రిలీజ్ అని మొన్న దిల్‍రాజు మంచి బ్లాస్ట్ ఇచ్చారు. ఆగస్టు చివరి నుంచి అప్‍డేట్స్ ఇవ్వడం మొదలుపెడతాం” అని థమన్ చెప్పారు. రెండో పాట డేట్‍ను డైరెక్టర్ శంకర్ ఫిక్స్ చేయాల్సి ఉందని అన్నారు.

ఏడు పాటలు ఉంటాయ్

గేమ్ ఛేంజర్ చిత్రంలో ఏడు పాటలు ఉంటాయని థమన్ క్లారిటీ ఇచ్చేశారు. జరగండి పాట ముందుగానే లీక్ అయిన విషయంపై జోక్ చేశారు. రెండో పాట అయినా లీక్ కాక ముందే రిలీజ్ చేస్తామని అనుకుంటున్నామని సరదాగా అన్నారు. “ఏడు పాటలు ఉన్నాయి. నెక్స్ట్ ఏ పాట రిలీజ్ చేస్తామో ఇంకా డిసైడ్ చేయలేదు. జరగండి పాట లీకైంది. అందుకే నెక్స్ట్ సాంగ్ అయినా లీక్ అవక ముందే ఇచ్చేద్దామని అనుకుంటున్నాం” అని థమన్ చెప్పారు.

గేమ్ ఛేంజర్ చిత్రం నుంచి ‘జరగండి’ ఫస్ట్ సాంగ్ గతేడాది దీపావళికే రావాల్సింది. అయితే పాట లీక్ అవడం.. దానికి నెగెటివ్ రెస్పాన్స్ రావటంతో గాయకుడిని, కాస్త ట్యూన్‍ను థమన్ మార్చినట్టు తెలిసింది. మొత్తానికి ఈ ఏడాది మార్చి 27న రామ్‍చరణ్ పుట్టిన రోజున ‘జరగండి’ పాట వచ్చింది. ఆ తర్వాతి నుంచి మేజర్ అప్‍డేట్ ఏదీ రాలేదు.

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా గేమ్ ఛేంజర్‌ను తెరకెక్కిస్తున్నారు తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్. మధ్యలో భారతీయుడు 2 వైపు ఆయన వెళ్లడంతో ఈ చిత్రం ఆలస్యమైంది. మొత్తంగా గేమ్ ఛేంజర్ మూవీ ఈ ఏడాదే రిలీజ్ అవుతుందనే నమ్మకాన్ని దిల్ రాజు ఇటీవల ఇచ్చారు. క్రిస్మస్‍కు విడుదల అవుతుందని చెప్పడంతో.. డిసెంబర్ 20న ఈ చిత్రం వస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి.

గేమ్ ఛేంజర్ చిత్రం కోసం రామ్‍చరణ్ తన షూటింగ్ పూర్తి చేస్తున్నారు. మిగిలిన చిత్రీకరణను కూడా త్వరలోనే డైరెక్టర్ శంకర్ ఫినిష్ చేయనున్నారు. ఎడిటింగ్ కూడా అయ్యాక రిలీజ్ డేట్‍ను ప్రకటిస్తామని ఇటీవలే శంకర్ తెలిపారు. ఆలోగానే దిల్‍రాజు ఆ అప్‍డేట్ ఇచ్చారు. గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అడ్వానీ హీరోయిన్‍గా చేస్తుండగా.. అంజలి, ఎస్‍జే సూర్య, శ్రీకాంత్ కీరోల్స్ చేశారు.