Game Changer Release: గేమ్ ఛేంజర్ సినిమా ఈ ఏడాది రిలీజ్ అవుతుందా? డైరెక్టర్ శంకర్ ఏం చెప్పారంటే..-we will announce ram charan game changer movie release date after after shoot and edit says director shankar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Game Changer Release: గేమ్ ఛేంజర్ సినిమా ఈ ఏడాది రిలీజ్ అవుతుందా? డైరెక్టర్ శంకర్ ఏం చెప్పారంటే..

Game Changer Release: గేమ్ ఛేంజర్ సినిమా ఈ ఏడాది రిలీజ్ అవుతుందా? డైరెక్టర్ శంకర్ ఏం చెప్పారంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 08, 2024 05:13 PM IST

Game Changer Release: గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ గురించి దర్శకుడు శంకర్‌ స్పందించారు. భారతీయుడు 2 ప్రెస్‍మీట్‍లో ఎదురైన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. అయితే, స్పష్టమైన ఆన్సర్ ఇవ్వలేదు.

Game Changer Release: గేమ్ ఛేంజర్ సినిమా ఈ ఏడాది రిలీజ్ అవుతుందా? డైరెక్టర్ శంకర్ ఏం చెప్పారంటే..
Game Changer Release: గేమ్ ఛేంజర్ సినిమా ఈ ఏడాది రిలీజ్ అవుతుందా? డైరెక్టర్ శంకర్ ఏం చెప్పారంటే..

మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో గేమ్ ఛేంజర్ ముందు వరుసలో ఉంది. మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే, డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ మాత్రం ఫిక్స్ కాలేదు. ఇటీవలే ఈ మూవీ కోసం తన షూటింగ్‍ను కూడా రామ్‍చరణ్ పూర్తి చేసుకున్నారు. భారతీయుడు 2 ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చారు డైరెక్టర్ శంకర్. ఆదివారం భారతీయుడు 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగగా.. నేడు (జూలై 8) ప్రెస్‍మీట్ నిర్వహించింది మూవీ టీమ్. ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ ఈ ఏడాది రిలీజ్ అవుతుందా అనే ప్రశ్నకు శంకర్ స్పందించారు.

ఆ తర్వాతే చెబుతాం

గేమ్ ఛేంజర్ సినిమా ఈ సంవత్సరం రిలీజ్ అవుతుందా అని డైరెక్టర్ శంకర్‌కు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందించారు. అయితే, ఈ ఏడాది వస్తుందా లేదా అన్నది క్లారిటీగా చెప్పలేదు. షూటింగ్ పూర్తయి, ఎడిటింగ్ అయిన తర్వాత రిలీజ్ డేట్ గురించి చెబుతామని శంకర్ చెప్పారు.

ఇంకా 15 రోజుల షూటింగ్ మిగిలి ఉందని శంకర్ అప్‍డేట్ ఇచ్చారు. రిలీజ్ డేట్‍పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. “గేమ్ ఛేంజర్ మూవీలో రామ్‍చరణ్ పోర్షన్ అయిపోయింది. ఇంకా 10 - 15 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఫైనల్ ఎడిటింగ్ అయిపోయాక రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం” అని శంకర్ చెప్పారు.

అందరూ కలిస్తేనే సినిమా

అయితే, ఈ ఏడాది రిలీజ్ ఉంటుందా అనేది నేరుగా చెప్పారని శంకర్‌కు ప్రశ్న వచ్చింది. హీరో రామ్‍చరణ్, నిర్మాత దిల్‍రాజు తమనే అడగాలని చెబుతున్నారని శంకర్‌ను ఓ రిపోర్టర్ క్వశ్చన్ చేశారు. సినిమా అంటే అందరూ కలిస్తేనని, తాను మాత్రమే కాదని శంకర్ అన్నారు. “సినిమా అంటే నేను మాత్రమే కాదు. యాక్టర్లు, ప్రొడ్యూజర్, టెక్నిషియన్లు అందరూ కలిసి చేసిది మూవీ. అవన్నీ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా 15 రోజుల షూటింగ్ జరిగిన తర్వాత.. ఎడిటింగ్ తర్వాత విడుదల తేదీ ప్రకటిస్తాం” అని డైరెక్టర్ శంకర్ తెలిపారు.

అయితే, ఈ ఏడాదే గేమ్ ఛేంజర్ వస్తుందని కచ్చితంగా డైరెక్టర్ శంకర్ చెప్పలేకపోయారు. దీంతో మరింత ఆలస్యమవుతుందా అనే టెన్షన్ రామ్‍చరణ్ అభిమానుల్లో నెలకొని ఉంది. అయితే, ఈ ఏడాదే విడుదల చేస్తామని నిర్మాత దిల్‍రాజు ఇటీవల గట్టిగానే చెప్పారు. మరి ఎప్పుడు అప్‍డేట్ వస్తుందో చూడాలి.

గేమ్ ఛేంజర్ చిత్రాన్ని పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీగా డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్నారు. రెండేళ్ల క్రితమే షూటింగ్ మొదలైనా ఇప్పటికే ఫినిష్ కాలేదు. ఇండియన్ 2 సినిమా కూడా ఆయన చేయడంతో ఆలస్యమైంది. గేమ్ ఛేంజర్ సినిమాలో చరణ్‍కు జోడీగా కియారా అడ్వానీ నటిస్తున్నారు. అంజలి, ఎస్‍జే సూర్య, శ్రీకాంత్, జయరాం కీలకపాత్రలు చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ భారీ బడ్జెట్‍తో ప్రొడ్యూజ్ చేస్తున్న ఈ మూవీకి థమన్ మ్యూజిక్ ఇస్తున్నారు.

కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు 2 సినిమా జూలై 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.

WhatsApp channel