Game Changer Second Song: ఉసూరుమనిపించిన గేమ్ ఛేంజర్ టీమ్! రిలీజ్ డేట్‍పై నో అప్‍డేట్.. మాస్ సాంగ్ వచ్చేస్తోందంటూ..-ram charan game changer movie second song to release in september announced officially on ganesh chaturthi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Game Changer Second Song: ఉసూరుమనిపించిన గేమ్ ఛేంజర్ టీమ్! రిలీజ్ డేట్‍పై నో అప్‍డేట్.. మాస్ సాంగ్ వచ్చేస్తోందంటూ..

Game Changer Second Song: ఉసూరుమనిపించిన గేమ్ ఛేంజర్ టీమ్! రిలీజ్ డేట్‍పై నో అప్‍డేట్.. మాస్ సాంగ్ వచ్చేస్తోందంటూ..

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 07, 2024 04:16 PM IST

Game Changer Release Date: గేమ్ ఛేంజర్ సినిమా నుంచి రెండోపాట వచ్చేస్తోంది. వినాయక చవితి సందర్భంగా ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు వెల్లడించింది. అయితే, చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తుందని ఆశించిన అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Game Changer Second Song: ఉసూరుమనిపించిన గేమ్ ఛేంజర్ టీమ్! రిలీజ్ డేట్‍పై నో అప్‍డేట్.. మాస్ సాంగ్ వచ్చేస్తోందంటూ..
Game Changer Second Song: ఉసూరుమనిపించిన గేమ్ ఛేంజర్ టీమ్! రిలీజ్ డేట్‍పై నో అప్‍డేట్.. మాస్ సాంగ్ వచ్చేస్తోందంటూ..

మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ మూడేళ్ల కిందట మొదలైనా.. ఆలస్యమవుతూ వచ్చింది. అయితే, వినాయక చవితి సందర్భంగా నేడు (సెప్టెంబర్ 7) గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ డేట్‍‍పై మూవీ టీమ్ అప్‍డేట్ ఇస్తుందని ఇటీవల అంచనాలు వచ్చాయి. అయితే, రెండో పాట గురించి మాత్రమే నేడు హింట్ ఇచ్చారు మేకర్స్.

మాస్ సాంగ్.. నయా పోస్టర్

గేమ్ ఛేంజర్ సినిమా నుంచి రెండో పాట రెడీ అయింది. పక్కా మాస్ సాంగ్‍గా ఉండనుంది. ఈ పాట సెప్టెంబర్‌లోనే వస్తుందని మూవీ టీమ్ కన్ఫర్మ్ చేసింది. వినాయక చవితి సందర్భంగా నేడు ఈ పాటపై అప్‍డేట్ ఇచ్చింది. అయితే, సాంగ్ డేట్‍ను ఖరారు చేయలేదు. సెప్టెంబర్‌లో తీసుకొస్తామని ఓ పోస్టర్ రివీల్ చేసింది.

మాస్ ఫెస్టివల్‍కు రెడీ కావాలంటూ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నేడు ట్వీట్ చేసింది. “హ్యాపీ వినాయక చవితి. సిద్ధంగా ఉండండి. స్వాగ్ మోడ్ ఆన్ అయింది. సెలెబ్రేషన్స్ వచ్చేస్తున్నాయి. ఓ పక్కా మాస్ పండుగ సిద్ధమవుతోంది. గేమ్ ఛేంజర్ రెండో పాట అనౌన్స్‌మెంట్ సెప్టెంబర్‌లోనే వస్తోంది” అని పోస్ట్ చేసింది.

డ్యాన్స్ నంబర్‌గా..

గేమ్ ఛేంజర్ నుంచి వచ్చిన ఈ నయా పోస్టర్‌లో క్లాస్, మాస్ కలగలిపిన లుక్‍తో రామ్‍చరణ్ అదిరిపోయారు. క్లాస్ డ్రెస్‍లో తలకు ఎర్రటి టవల్ కట్టుకొని కనిపించారు. దీంతో గబ్బర్ సింగ్‍లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లుక్‍తో ఈ పోస్టర్‌ను కొందరు ఫ్యాన్స్ పోలుస్తున్నారు. ఈ సాంగ్ మాస్ బీట్‍తో పక్కా డ్యాన్స్ నంబర్‌లా ఉండే అవకాశం ఉంది. శంకర్ మార్క్ గ్రాండ్‍నెస్‍తో సాంగ్ ఉంటుందని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఈ పోస్టర్ బ్యాక్‍గ్రౌండ్‍లో వేషధారణలతో వందల మంది కనిపిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ సాంగ్ ‘జరగండి’కి కూడా మాస్ బీట్ ఇచ్చారు. త్వరలో రానున్న రెండో పాట కూడా మాస్ సాంగ్‍గానే ఉండనుంది. దీంతో ఈ సాంగ్ ఎలా ఉంటుందోననే ఆసక్తి నెలకొంది.

ఫ్యాన్స్ నిరాశ

గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ డేట్‍ను నేడు మూవీ టీమ్ వెల్లడిస్తుందని రామ్ చరణ్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. విడుదల తేదీ వచ్చేస్తుందనే ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం కూడా వచ్చింది. అయితే, ఈ రెండో పాట కోసం తీసుకొచ్చిన పోస్టర్‌లో మూవీ విడుదల తేదీ లేదు. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం రిలీజ్ అవుతుందని నిర్మాత దిల్‍రాజు ఇటీవల గట్టిగా చెబుతున్నారు. అయినా, ఇప్పటికి విడుదల తేదీ కన్ఫర్మ్ చేయకపోవటంతో ఉత్కంఠ కొనసాగుతోంది.

సినిమా రిలీజ్ డేట్ వెల్లడించకపోవటంతో నెటిజన్లు నుంచి గేమ్ ఛేంజర్ యూనిట్‍పై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇంకెప్పుడు ఖరారు చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. కనీసం రెండో పాట డేట్ అయినా ఇవ్వకుండా.. కేవలం సెప్టెంబర్ అని చెప్పడంపై కూడా కొందరు ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. మొత్తంగా గేమ్ ఛేంజర్ విడుదల తేదీపై సస్పెన్స్ ఇంకా కొనసాగింది. తెలుగుతో పాటు తమిళం, హిందీలో ఈ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా గేమ్ ఛేంజర్ మూవీని శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో చరణ్ సరసన కియారా అడ్వానీ హీరోయిన్‍గా నటించారు. ఎస్‍జే సూర్య, అంజలి, శ్రీకాంత్, జయరాం కీరోల్స్ చేశారు.