మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కారు.. 16 స్పీకర్లు, 7 ఎయిర్ బ్యాగ్స్, ఒక్క ఛార్జ్‌తో 500 కి.మీ రేంజ్
Mahindra BE 6e and XEV 9e Electric Car : మహీంద్రా నుంచి కొత్త ఎలక్ట్రిక్ కార్లు విడుదల అయ్యాయి. మహీంద్రా ఎక్స్ఈవీ 9ఇ, బీఈ 6ఇ కార్లను లాంచ్ చేశారు. ఈ ఈవీల్లో ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి.
ఆటోమెుబైల్ ప్రపంచంలో ఎంతగానో ఎదురుచూస్తున్న మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్లు వచ్చేశాయి. సరికొత్త ఎక్స్ఈవీ 9ఇ, బీఈ 6ఈ కార్లు లాంచ్ అయ్యాయి. చెన్నైలో జరిగిన అన్‌లిమిట్ ఇండియా గ్లోబల్ సమ్మిట్లో మహీంద్రా వీటిని ప్రవేశపెట్టింది. ఫ్యూచరిస్టిక్ డిజైన్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, పనితీరుతో ఎక్స్ఈవీ 9ఇ, బీఈ 6ఇ చాలామందిని ఆకర్శిస్తాయి. 2025 ఫిబ్రవరి చివరి నాటికి లేదా 2025 మార్చి నాటికి డెలివరీలు ప్రారంభమవుతాయని మహీంద్రా తెలిపింది. ఈ రెండు కార్ల ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరపై ఓ లుక్కేద్దాం.
ఈ రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లు కూపే లాంటి రూఫ్‌ను కలిగి ఉంది. కనెక్టెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ (డీఆర్ఎల్), ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, మెరిసే లోగో, పియానో బ్లాక్ క్లాడింగ్, సీ-పిల్లర్‌పై రియర్ డోర్ హ్యాండిల్స్, ఏరో ఇన్సర్ట్స్‌తో కూడిన 20 అంగుళాల అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెనా, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్లు ఉన్నాయి. కారు ఇంటీరియర్ విషయానికొస్తే ఇది పెద్ద, విలాసవంతమైన క్యాబిన్, ట్రిపుల్ స్క్రీన్ సెటప్, పెద్ద లోగోతో 2-స్పోక్ స్టీరింగ్ వీల్, రూఫ్ గ్లాస్‌తో కలిగి ఉంటుంది.
ఆటో పార్కింగ్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్-అప్ డిస్‌ప్లే, వైర్లెస్ ఛార్జింగ్, 16-స్పీకర్ల ప్రీమియం ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, వెహికల్-టు-వెహికల్ (వి2ఎల్) టెక్నాలజీ, అనేక డ్రైవ్ మోడ్లతో సహా మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి అనేక అధునాతన ఫీచర్లను అందించింది.
సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే 2025 మహీంద్రా ఎక్స్ఈవీ 9ఇలో 7 ఎయిర్‌బ్యాగులు, ప్రయాణికులందరికీ 3-పాయింట్ సీట్ బెల్ట్, 360-డిగ్రీ కెమెరా, లెవల్ 2 ఏడీఏఎస్ సిస్టమ్ ఉన్నాయి.
2025 మహీంద్రా ఎక్స్ఈవీ 9ఇ, బీఈ 6ఇ పవర్ట్రెయిన్ ఐఎన్జిఎల్ఓ ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. 2025 మహీంద్రా ఎక్స్ఈవీ 9ఇ రేంజ్ 656 కిలోమీటర్ల వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇందులో వెనుక యాక్సిల్‌కు ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. మహీంద్రా ఫ్లాగ్షిప్ ఈవీ 2 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో 59 కిలోవాట్ల, 79 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు లభిస్తాయి.
ఈ రెండు కార్లు 20 నిమిషాల్లో 20 నుంచి 80 శాతానికి వేగంగా ఛార్జింగ్ అవుతాయని కంపెనీ తెలిపింది. 224 bhp, 278 bhp మధ్య గరిష్ట శక్తిని అందిస్తాయి. పెద్ద బ్యాటరీతో 500 కి.మీ వరకు రేంజ్ అందిస్తాయని అంచనా.
మరోవైపు BE 6e మంచి డిజైన్‌తో వస్తుంది. క్యారెక్టర్ లైన్‌లు, హుడ్ స్కూప్‌తో కూడిన పాయింటెడ్ హుడ్, C-ఆకారపు ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, స్ట్రీమ్‌లైన్డ్ బంపర్‌ను కలిగి ఉంది. దాని ఏరోడైనమిక్ 20-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఆకట్టుకుంటాయి.
మహీంద్రా XEV 9e దాని ప్యాక్ 1 వేరియంట్ ధర రూ.21.90 లక్షలు (ఎక్స్-షోరూమ్), BE 6e ప్యాక్ 1 రూ.18.90 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. రెండు ఎస్‌యూవీలు జనవరి 2025లో మార్కెట్లోకి రానున్నాయి. డెలివరీలు ఫిబ్రవరి, మార్చి మధ్య ప్రారంభమవుతాయి.