Travelling: స్వర్గాన్ని గుర్తుకుతెచ్చే ప్రదేశం జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్, జీవితంలో ఒక్కసారైన చూడాల్సిందే
Travelling జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ చాలా అందమైన ప్రదేశం. ఈ ప్రదేశాన్ని ఒక్కసారైన చూసి రావాల్సిందే. స్వర్గాన్ని తలపించేలా ఉంటుంది ఈ మంచు ప్రదేశం. ఇక్కడికి వెళితే వెనక్కి రావాలనిపించదు. విదేశాల్లో ఉన్న అనుభూతి కలుగుతుంది.
వేడి వాతావరణంలో చల్లటి ప్రాంతానికి వెళ్లానిపిస్తుంది. అలాగే చల్లటి వాతావరణంలో మంచు కురిసే ప్రాంతాలకు వెళితే ఆ కిక్కే వేరు. అమెరికా, కెనడా, రష్యాల్లో ఎలా మంచు ముద్దలుగా కురుస్తుందో అలాంటి అందమైన ప్రదేవం పహల్గామ్. ఇక్కడ కనిపించే హిమపాతాలు స్వర్గాన్ని గుర్తుకుతెచ్చేలా ఉంటాయి. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం జమ్మూ కాశ్మీర్ లో ఉన్న పహల్గామ్. వీలైనప్పుడు ఈ ప్రాంతానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకోండి. జీవితంలో మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది. ఒకపక్క మంచు పడుతూ ఉంటే మరో పక్క హిమపాతాలు కురుస్తూ ఉంటాయి. చెట్లపై మంచు మేటలు వేస్తుంది. నిశ్శబ్ద వాతావరణం, గాలి కాలుష్యం లేకుండా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది పహల్గామ్. ఇక్కడకు వెళితే చూడాల్సి ప్రదేశాలు, ఎప్పుడు వెళితే ఉత్తమం వంటి విషయాలు తెలుసుకోండి.
1) పహల్గామ్ లో చూడవలసిన ప్రదేశాలు ఏవి?
పహల్గాం ఎంతో అందమైన ప్రదేశం. ఈ ఊరు సహజ సౌందర్యంతో నిండిపోయి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకులు దీన్ని చూసేందుకు వస్తారు. ఇక్కడ మంచు తప్ప చూడటానికి ఏమీ ఉండదని కొందరు భావిస్తారు. నిజానికి పహల్గామ్ లో చూడవలసిన అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. డెస్పరేట్ వ్యాలీ, అరు వ్యాలీ, చందన్వారీ, లిడర్ పార్క్, కొలాహోయ్ హిమానీనదం వంటి ప్రదేశాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. వీటిని చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు.
2) పహల్గామ్ సందర్శనకు ఉత్తమ సమయం ఏది?
పహల్గామ్ ప్రాంతాన్ని సందర్శించడానికి, దాని అందాలను ఆస్వాదించడానికి ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలాన్ని ఉత్తమ సమయంగా భావిస్తారు. ఎందుకంటే వేసవిలో ఇక్కడి వాతావరణం చాలా బాగుంటుంది. ప్రయాణాలు చేసేందుకు వీలుగా ఉంటుంది. అయితే హిమపాతాలను ఆస్వాదించాలనుకుంటే మాత్రం డిసెంబర్ నుంచి జనవరి నెల మధ్య కాలం ఉత్తమమైనది. ఈ సమయంలో వెళితే స్వర్గాన్నే తలపిస్తుంది పహల్గామ్.
3) పహల్గాంలో చూడదగిన సరస్సు ఏదైనా ఉందా?
ఈ ప్రదేశంలో ఎన్నో అద్భుతమైన సరస్సులు ఉన్నాయి. తులియన్ సరస్సు, శేషనాగ్ సరస్సు , టార్సార్ మార్సర్ సరస్సు వంటివి ఉన్నాయి. ఈ సరస్సులు వాటి నిర్మలమైన సౌందర్యానికి, చుట్టూ అందమైన దృశ్యాలకు ఎంతో ప్రసిద్ధి చెందాయి.
4) పహల్గాంలో రైల్వే స్టేషను ఉందా?
పహల్గాం ప్రాంతంలో రైల్వే స్టేషన్ లేదు. దీనికి సమీప రైల్వే స్టేషను ఉధంపూర్. ఇది పహల్గాం నుండి 217 కి.మీ దూరంలో ఉంది. ఇది కాకుండా, జమ్మూ తావి రైల్వే స్టేషను కూడా ఉంది. ఈ రైల్వే స్టేషనకు అనేక నగరాలతో అనుసంధానించి రైల్వే లైన్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి పహల్గామ్ సులువుగా చేరుకోవచ్చు.
5) గుల్మార్గ్ కంటే పహల్గామ్ అందమైనదా?
పహల్గామ్, గుల్మార్గ్ రెండూ కాశ్మీర్ లో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి. అయితే ఈ రెండింటిలో ఏది బెటర్ అని ఎంచుకోవడం కష్టం. గుల్మార్గ్ సాహస క్రీడలకు ప్రసిద్ధి చెందింది. పహల్గామ్ ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ లా ఉంటుంది. కాబట్టి మీరు ఏ రకమైన యాత్రను కోరుకుంటున్నారనే దాన్ని బట్టి ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకోండి. పచ్చని పచ్చిక బయళ్లు, నిర్మలమైన సరస్సులకు పహల్గామ్ ప్రసిద్ధి చెందింది.