AP LAWCET Counseling 2024 : ఏపీ లాసెట్ ప్రవేశాలు - సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ లో మార్పులు, ఇవిగో కొత్త తేదీలు
AP LAWCET Counseling 2024 Updates : ఏపీ లాసెట్ రెండో విడత కౌన్సెలింగ్ కు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ లో పలు మార్పులు చేశారు. నవంబర్ 26వ తేదీన సీట్ల కేటాయింపు కాకుండా.. 29వ తేదీన చేయనున్నారు. వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్ కు ఇవాళ(నవంబర్ 27) కూడా అవకాశం ఉంది.
ఏపీలో లాసెట్ 2024 కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ కు సంబంధించిన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు పూర్తి అయ్యాయి. అయితే గతంలో ప్రకటించిన షెడ్యూల్ లో అధికారులు పలు మార్పులు చేశారు. నవంబర్ 23వ తేదీతో పూర్తి అయిన వెబ్ ఆప్షన్ల గడువును నవబంర్ 27వ తేదీ వరకు పొడిగించారు. ఇప్పటికే ఆప్షన్లు ఎంచుకున్న అభ్యర్థులు ఇవాళ్టి వరకు ఎడిట్ కూడా చేసుకోవచ్చని తాజా ప్రకటనలో పేర్కొన్నారు.
రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు https://lawcet-sche.aptonline.in వెబ్ సైట్ లోకి వెబ్ ఆప్షన్ల ఎంపికతో పాటు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక సీట్ల కేటాయింపు నవంబర్ 29వ తేదీన చేయనున్నారు. ఈ ఫేజ్ లో సీట్లు పొందే విద్యార్థులు నవంబర్ 30వ తేదీ నుంచి ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు డిసెంబర్ 4వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
ఏపీ లాసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ 2024:
- నవంబర్ 27వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
- నవంబర్ 27వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు.
- నవంబర్ 29వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.
- ఈ ఫేజ్ లో సీట్లు పొందే విద్యార్థులు నవంబర్ 30వ తేదీ నుంచి ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
- రిపోర్టింగ్ గడువు నవంబర్ డిసెంబర్ 4వ తేదీతో పూర్తి అవుతుంది.
- https://lawcet-sche.aptonline.in వెబ్ సైట్ లోకి వెళ్లి అర్హత కలిగిన అభ్యర్థులు కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఏడాది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో లాసెట్- 2024 ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఏపీ లాసెట్ పరీక్షను 19,224 మంది అభ్యర్థులు రాశారు. అందులో 17,117 మంది (89.04 శాతం) అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఎంట్రెన్స్ పరీక్ష ఫలితాలు జూన్ 27న వెల్లడించారు. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ లో భాగంగా సీట్లను కేటాయించిన సంగతి తెలిసిందే.
ఏపీ లాసెట్ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి…
- అభ్యర్థులు మొదటగా https://cets.apsche.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- Download Rank Card అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ నెంబర్ , హాల్ టికెట్ నెంబర్ , పుట్టిన తేదీని ఎంట్రీ చేయాలి.
- గెట్ రిజల్ట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ స్కోర్ తో పాటు ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు.
- అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు అత్యంత కీలకం.