AP LAWCET Counselling 2024 : ఏపీ లాసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూల్ లో మార్పులు - కొత్త తేదీలివే-changes in ap lawcet counseling schedule 2024 key dates check here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Lawcet Counselling 2024 : ఏపీ లాసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూల్ లో మార్పులు - కొత్త తేదీలివే

AP LAWCET Counselling 2024 : ఏపీ లాసెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూల్ లో మార్పులు - కొత్త తేదీలివే

AP LAWCET Counselling 2024: ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ - 2024కు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. షెడ్యూల్ లో పలు మార్పులు చేసినట్లు తెలిపారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ గడువు అక్టోబర్ 23వ తేదీ వరకు పొడిగించారు. నవంబర్ 2వ తేదీన తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.

ఏపీ లాసెట్ ప్రవేశాలు - 2024

ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ లో పలు మార్పులు చేశారు అధికారులు. ఈ మేరకు మరో ప్రకటన విడుదల చేశారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తేదీ గడువును అక్టోబర్ 23వ తేదీ వరకు పొడిగించారు. ఈ తేదీలోపే ధ్రువపత్రాలను అప్ లోడ్ చేయాలని సూచించారు. ఆన్ లైన్ ధ్రువపత్రాల పరిశీలన అక్టోబర్ 24వ తేదీలోపు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

అక్టోబర్ 25వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభమవుతాయి. ఇందుకు అక్టోబర్ 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.అక్టోబర్ 29వ తేదీన వెబ్ ఆప్షన్లు ఎడిట్ చేసుకోవచ్చు. నవంబర్ 2వ తేదీన తొలి విడత సీట్లు కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు నవంబర్ 4వ తేదీ నుంచి ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు నవంబర్ 7వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

ఏపీ లాసెట్ కౌన్సెలింగ్ - ముఖ్య తేదీలు:

  • ఏపీ లాసెట్ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు - 23 అక్టోబర్ 2024.
  • ధ్రువపత్రాల పరిశీలన - 24 అక్టోబర్ 2024.
  • వెబ్ ఆప్షన్లు - 25 అక్టోబర్ నుంచి 28 అక్టోబర్ ,2024.
  • వెబ్ ఆప్షన్లు ఎడిట్ - 29 అక్టోబర్ 2024.
  • సీట్ల కేటాయింపు - 2 నవంబర్ 2024.
  • రిపోర్టింగ్ సమయం - 4 నవంబర్ నుంచి 7 నవంబర్ 2024.
  • అధికారిక వెబ్ సైట్ - https://cets.apsche.ap.gov.in/

ఈ ఏడాది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన లాసెట్- 2024 ప్రవేశ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని న్యాయ కళాశాలాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఎంట్రెన్స్ పరీక్ష ఫలితాలు జూన్ 27న వెల్లడించారు. కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు కావడంలో తీవ్ర జాప్యం జరిగింది. మరోవైపు తెలంగాణలో చూస్తే లాసెట్ ప్రవేశాల ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో స్పెషల్ ఫేజ్ నడుస్తోంది.

ఏపీ లాసెట్‌ పరీక్షను 19,224 మంది అభ్యర్థులు రాశారు. అందులో 17,117 మంది (89.04 శాతం) అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో రెండేళ్ల పీజీ కోర్స్ లో 99.51 శాతం, మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్స్ లో 89.74 శాతం, ఐదేళ్ల ఎల్ఎల్‌బీ కోర్స్ లో 80.06 శాతం ఉతీర్ణత సాధించారు. ఎంట్రెన్స్ లో పాస్ అయిన వారితో పాటు మేనేజ్ మెంట్ కోటాలో చేరాలనుకునే చాలా మంది అభ్యర్థులు... కౌన్సెలింగ్ తేదీల కోసం ఎదురుచూశారు. ఎట్టకేలకు అధికారులు షెడ్యూల్ ప్రకరించారు.

ఏపీ లాసెట్ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి…

  • అభ్యర్థులు మొదటగా https://cets.apsche.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • Download Rank Card అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • Registration Number , Hall Ticket Number, పుట్టిన తేదీని ఎంట్రీ చేయాలి.
  • -గెట్ రిజల్ట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ స్కోర్ తో పాటు ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు.
  • అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు అత్యంత కీలకం.

ఈసారి విడుదలైన ఏపీ లాసెట్ ఫలితాలను చూస్తే… రెండేళ్ల పీజీ కోర్సులో(LLM) పురుషులు 99.51 శాతం, స్త్రీలు 99.51 శాతం ఉత్తీర్ణత సాధించారు. మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సులో పురుషులు 91.28 శాతం, స్త్రీలు 86.26 శాతం, ఐదేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సులో పురుషులు 81.91 శాతం, స్త్రీలు 78.17 శాతం ఉత్తీర్ణత సాధించారు.