Brahmamudi November 27th Episode: కావ్య ఎప్పటికీ దుగ్గిరాల ఇంటి కోడలే - సీతారామయ్య తీర్పు - రాజ్‌కు కొత్త టార్చర్
Brahmamudi:బ్రహ్మముడి నవంబర్ 27 ఎపిసోడ్‌లో కావ్య, అపర్ణ వెళ్లిపోవడంలో సీతారామయ్య, ఇందిరాదేవి బాగోగుల్ని ఎవరూ పట్టించుకోరు. సీతారామయ్యకు పాలు ఇవ్వమని ఇందిరాదేవి అడిగినందుకు...కావ్య, అపర్ణ లేకపోవడంతోనే మేము గుర్తొచ్చామని, మీ ప్రేమలు స్వార్థంగా ఉంటాయని ధాన్యలక్ష్మి రచ్చ చేస్తుంది.
ఆస్తి పంపకాల విషయంలో తనకు సపోర్ట్ చేయడం లేదని భర్తను రూమ్ నుంచి బయటకు గెంటేస్తుంది ధాన్యలక్ష్మి. ప్రకాశం ఎంత బతిమిలాడిన వినదు. నువ్వు గెంటేస్తే ఇంత పెద్ద ఇంట్లో పడుకోవడానికి ప్లేస్ లేదని అనుకుంటున్నావా...నా ఇష్టం వచ్చిన చోట పడుకుంటా అని రాజ్ రూమ్‌కు వెళతాడు ప్రకాశం. తలుపు కొట్టిన శబ్దం కావడంతో తండ్రి సుభాష్ వైపు చూస్తాడు. నువ్వు చూడగానే వెళ్లి తలుపు తీయడానికి నేనేం నీ పెళ్లాన్ని కాదు...నువ్వే వెళ్లి తీసుకో అంటూ కొడుకుపై సుభాష్ ఫైర్ అవుతాడు.
సుభాష్ ఎక్స్‌పీరియన్స్...
డోర్ తీయగానే ప్రకాశం కనిపించడంతో ఏమైంది బాబాయ్ అని రాజ్ అడుగుతాడు. మి పిన్ని బయటకు గెంటేసిందని వాడి ముఖం చూస్తేనే తెలుస్తుందని సుభాష్ అంటాడు. ఏంతైనా ఎక్స్‌పీరియన్స్ ఎక్స్‌పీరియన్సే. ఫేస్ చూడగానే చెప్పేశావని సుభాష్‌తో ప్రకాశం అంటాడు.
బ్యాచ్‌లర్‌కు ఎక్కువ...భర్తకు తక్కువ...
నువ్వెందుకు నా రూమ్‌కు వచ్చావో చెప్పలేదని బాబాయ్‌ను అడుగుతాడు రాజ్. రాత్రి నీ రూమ్‌లోనే పడుకుంటానని ప్రకాశం బదులిస్తాడు. భార్యలు వాళ్లకు ఏం కావాలో చెబుతారు...కానీ భర్తలకు ఆ శక్తిసామర్థ్యాలు ఉన్నాయో లేవు పట్టించుకోరు అంటూ ప్రకాశం అంటాడు. అయినా ఇవన్నీ నీకు తెలుస్తాయి...పేరుకే పెళ్లైంది కానీ...నీ లైఫ్ బ్యాచ్‌లర్‌కు ఎక్కువ...భర్తకు తక్కువ అంటూ రాజ్‌పై సెటైర్లువేస్తాడు ప్రకాశం.
రాజ్‌కు బుద్ది చెప్పడానికే...
రాజ్‌పై అలిగి కావ్య ఇంటికి వెళ్లిన అపర్ణకు ఫోన్ చేస్తుంది ఇందిరాదేవి. నువ్వు నీ కోడలి ఇంట్లో కూర్చొని కావ్య చేసి పెట్టే వంటల్ని హాయిగా తింటున్నావు. నువ్వు, కావ్య ఇంట్లో లేకపోయేసరికి నా బాగోగులు పట్టించుకునేవారు ఎవరూ లేకుండాపోయారని ఇందిరాదేవి బాధపడుతుంది.
మిమ్మల్ని వదిలిపెట్టి రావడం నాకు ఇష్టం లేదని కానీ రాజ్‌కు బుద్ది చెప్పడానికి ఇంత కంటే మరో దారి కనిపించలేదని అపర్ణ అంటుంది. రాజ్ ఏదో ఒక రోజు తప్పు తెలుసుకొని మా ఇద్దరిని ఇంటికి తిరిగి తీసుకెళతాడనే నమ్మకం ఉందని ఇందిరాదేవితో అంటుంది అపర్ణ. ఈ గొడవలను తొందరగా ముగించుకొని ఇంటికిరమ్మని ఇందిరాదేవి అంటుంది. మీరు లేకపోవడంతో ఇళ్లంతా బోసిపోయిందని చెబుతుంది.
అపర్ణ ఫైర్...
మీరు కూడా ఈ మధ్య అబద్ధపు వాగ్ధానాలు బాగానే చేస్తున్నారని, జరగని వాటిని జరుగుతాయని అమ్మమ్మగారిని నమ్మిస్తున్నారని అత్తయ్యపై సెటైర్లు వేస్తుంది కావ్య. నీ కోసం...నీకు న్యాయం చేయడం కోసం నా భర్తను అత్తవారింటికి వదిలేసి ఇక్కడి వరకు వస్తే...నీకు వెటకారంగా ఉందా అని అపర్ణ ఫైర్ అవుతుంది. నేనేమీ భర్తను వద్దనుకోలేదు...మీ అబ్బాయే నన్ను బయటకు తోసేశాడని కావ్య అంటుంది. తాళి కట్టిన భార్యను ఎలా వదిలేస్తావని చొక్కా పట్టుకొని నిలదీయాలి కానీ ఇలా పుట్టింటికి వచ్చేయడం కరెక్ట్ కాదని కావ్యకు అపర్ణ క్లాస్ ఇస్తుంది.
అతి మంచితనం పనికిరాదు..
ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉండాలి కానీ అతి మంచితనం పనికిరాదని అంటుంది. ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని అంటే ప్రశ్నించకుండా ఎలా వచ్చేస్తావు క్లాస్ ఇస్తుంది. రాజ్ మోసం చేసి సీఈవో అయ్యాడని తెలిసినా నీతిమంతురాలిగా...రాజ్‌కు నేను ఆఫీస్‌లో ఉండటం ఇష్టం లేదంటూ ఎలా వచ్చేశావని కోపంగా అంటుంది. మంచితనంతో కూడా మనుషులను మర్డర్ చేయచ్చంటూ నిన్ను ఎగ్జాంపుల్‌గా చూపించవచ్చని కావ్యతో అంటుంది అపర్ణ.
రాజ్ నిద్రకు డిస్ట్రబ్...
సుభాష్, ప్రకాశం ఇద్దరు పోటీపడి గురక పెట్టడంతో రాజ్ నిద్రకు డిస్ట్రబ్ అవుతుంది. ఇద్దరిని తన రూమ్ నుంచి బయటకి వెళ్లిపొమ్మని అంటాడు. మీ పిన్నిని కన్వీన్స్ చేస్తే నేను వెళ్లిపోతానని ప్రకాశం అంటాడు.
మీ అమ్మను కావ్యను తీసుకొస్తానని అంటే నేను కూడా రూమ్ నుంచి వెళ్లిపోతానని సుభాష్ అంటాడు. వాళ్లు చెప్పిన పనులు చేయడం కంటే తాను కింద పడుకోవడమే మంచిదని బెట్‌షీడ్ తీసుకొని నేలపై పడుకుంటాడు రాజ్.
కావ్యతో పాటు అపర్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోయినా ఏం పట్టనట్లు రాజ్ ఉండటం చూసి ఇందిరాదేవి సహించలేకపోతుంది. నువ్వే ఏదో ఒకటి చేసి వారిద్దరిని రాజ్ ఇంటికి తీసుకొచ్చేలా చేయమని భర్తతో అంటుంది ఇందిరాదేవి. సీతారామయ్య ట్యాబ్లెట్ వేసుకోలేదని తెలిసి ఇందిరాదేవి కంగారుపడుతుంది.
తనకు పాలు ఎవరు ఇవ్వలేదని సీతారామయ్య అంటాడు. కిచెన్‌లో పాలు వేడి చేస్తూ ధాన్యలక్ష్మి కనిపిస్తుంది.
ధాన్యలక్ష్మి వెటకారం...
మావయ్యకు ఇంత ఆలస్యంగా పాలు ఇస్తే ఎలా ఆయన ఉదయమేట్యాబ్లెట్ వేసుకుంటారని తెలియదా అని ధాన్యలక్ష్మితో అంటుంది ఇందిరాదేవి. పాలు వేడి చేస్తుంది మావయ్య కోసం కాదని తన కోసం ధాన్యలక్ష్మి బదులిస్తుంది.
నేను వేరుగా వండుకుంటున్నాను కదా...ఎవరు ఏం తాగుతారో....ఏం తింటున్నారో నాకేం తెలుసు అంటూ నిర్లక్ష్యంగా ఇందిరాదేవికి సమాధానమిస్తుంది ధాన్యలక్ష్మి. మావయ్య గురించి పట్టించుకునే బాధ్యత నీకు లేదా అని ధాన్యలక్ష్మిని నిలదీస్తుంది ఇందిరాదేవి.
అవసరం వచ్చినప్పుడే...
ధాన్యలక్ష్మి అవసరం లేనప్పుడు తనను, తన బాధను పట్టించుకోలేదు. మీకు అవసరం వచ్చినప్పుడు కోడలు హక్కులు, బాధ్యతలు గుర్తొచ్చాయా అంటూ రుద్రాణి ఫిట్టింగ్ పెడుతుంది. అపర్ణ, కావ్య లేకపోపోయేసరికి అత్తయ్యకు మనం గుర్తొచ్చాము అంతే అని ధాన్యలక్ష్మి అంటుంది. లేదంటే ఇలా వచ్చి మనతోమాట్లాడేవారు కాదని ధాన్యలక్ష్మి చెబుతుంది.
నేనెప్పుడూ మీతో అవసరం కోసమే ఉన్నానా...ప్రేమను చూపించలేదాఇందిరాదేవి ప్రశ్నించలేదు. మీరు మాతో ప్రేమగా ఉన్నది ఎప్పుదో ఎంత ఆలోచించిన గుర్తురావడం లేదని, మీ ప్రేమలు అంత స్వార్థంగా ఉన్నాయని ధాన్యలక్ష్మి నానా మాటలు ఇందిరాదేవిని అవమానిస్తుంది.
రాజ్ అసహనం...
ధాన్యలక్ష్మి మాటలు విని రాజ్ సహించలేకపోతాడు. పెద్ద, చిన్న అనే తేడా లేకుండా నానమ్మతో ఇలాగేనా మాట్లాడేది రాజ్ అంటాడు. పాలు ఇవ్వమని అడిగితే ఇంత రాద్ధాంతం చేయాలా అని నిలదీస్తాడు. ఆస్తుల్లో వాటాలు అడిగేవారికి తమ బాధ్యతలు గుర్తురావడం లేదా?
తండ్రి బాగోగులు ఆ మాత్రం చూసుకోలేవా అంటూ రుద్రాణిపై ఫైర్ అవుతాడు. ఆస్తుల్లో వాటాలు అడుగుతాం కానీ మేము పనులు మాత్రం చేయాం అంతేనా అత్తయ్య అంటూ రుద్రాణిపైసెటైర్ వేస్తుంది స్వప్న.
ఇన్నాళ్లు మీపై ఆధారపడి తప్పుచేశానని, ఇక నుంచి నా పనులు నేనే చూసుకుంటానని ఇందిరాదేవి అంటుంది.
రుద్రాణి టార్చర్...
పని మనిషిని రుద్రాణి టార్చర్ పెట్టి పంపించేసిందని అసలు నిజం బయటపెడుతుంది స్వప్న. కావ్యను రాజ్ పర్మినెంట్‌గా కాపురానికి తీసుకురాకుండా చేయడానికే ఇవన్నీ చేస్తున్నానంటూ మనసులో అనుకుంటుంది రుద్రాణి.
అప్పు ఆనందం...
కళ్యాణ్ ఆనందంగా ఇంటికొస్తాడు. అప్పును కళ్లు మూసుకోమని అంటాడు. చెక్ ఆమె చేతిలో పెడతాడు.
ఆ చెక్ చూసి అప్పు కూడా ఆనందపడుతుంది. ఇది నీ సక్సెస్‌కు మొదటి అడుగు అంటూ భర్తను మెచ్చుకుంటుంది. మనకు మంచి రోజులు స్టార్టయ్యాయని అంటుంది. నీ సక్సెస్ మాట్లాడే టైమ్ వచ్చిందని, నీ శత్రువును కలిసి ఈ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుందామని కళ్యాణ్‌తో అంటుంది అప్పు.
కావ్య ఎప్పటికీ ఈ ఇంటి కోడలే...
కావ్య క్యారేజీ తీసుకొని ఇంటికొస్తుంది. ఆమెను చూడగానే రాజ్ ఫైర్ అవుతాడు. ఏ హక్కుతో మనింటికి క్యారేజీ తీసుకొని వచ్చిందని అంటాడు. కావ్య మా మనవరాలు...ఆ హక్కుతోనే వచ్చిందని ఇందిరాదేవి బదులిస్తుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మనిషికి...మళ్లీ మన ఇంటికి ఏం సంబంధం ఉందని రమ్మంటున్నారని రాజ్ అంటాడు.
సంబంధం లేదని అనుకుంటున్నది నువ్వు...కావ్య ఎప్పటికీ ఈ ఇంటి కోడలే...మా మనవరాలే అని సీతారామయ్య అంటాడు. తాతయ్య సమాధానంతో రాజ్ షాకవుతాడు.అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.