Lucky Baskhar OTT: ఓటీటీలోకి లక్కీ భాస్కర్.. దుల్కర్ సల్మాన్ హిట్ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?-lucky baskhar ott release date netflix when to watch dulquer salmaan telugu blockbuster film online ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lucky Baskhar Ott: ఓటీటీలోకి లక్కీ భాస్కర్.. దుల్కర్ సల్మాన్ హిట్ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?

Lucky Baskhar OTT: ఓటీటీలోకి లక్కీ భాస్కర్.. దుల్కర్ సల్మాన్ హిట్ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?

Galeti Rajendra HT Telugu
Nov 28, 2024 11:39 AM IST

Lucky Baskhar OTT release date: దుల్కర్ సల్మాన్ హిట్ సినిమా లక్కీ భాస్కర్ మరి కొన్ని గంటల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌కి రాబోతోంది. ఈ మూవీని ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూడొచ్చంటే?

ఓటీటీలోకి లక్కీ భాస్కర్
ఓటీటీలోకి లక్కీ భాస్కర్

మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్‌కి జంటగా మీనాక్షి చౌదరి నటించగా.. దీపావళి రోజున విడుదలై హిట్‌గా నిలిచింది. విడుదలైన రోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న లక్కీ భాస్కర్.. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల వరకూ వసూళ్లని రాబట్టింది. దుల్కర్ సల్మాన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా ఇదే.

కుటుంబం కోసం సాధారణ బ్యాంక్ ఉద్యోగి రిస్క్ చేయడాన్ని కథాంశంగా తీసుకుని.. దర్శకుడు వెంకీ అట్లూరి మిడిల్ క్లాస్ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు. భాస్కర్ కుమార్‌గా దుల్కర్ సల్మాన్ నటించగా.. సర్దుకుపోయే మధ్యతరగతి భార్య సుమతిగా మీనాక్షి చౌదరి నటించింది. బ్యాంకింగ్ వ్యవస్థ, స్టాక్‌ మార్కెట్ అందరికీ అర్థమయ్యేవి కావు. కానీ.. వెంకీ అట్లూరీ ఎమోషన్స్‌ని జోడీస్తూ ప్రేక్షకుల్ని మెప్పించడంలో సక్సెస్ అయ్యారు.

కథ ఏంటంటే?

భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) బ్యాంక్‌లో ఎంత కష్టపడినా.. ప్రశంసలు వస్తాయి తప్ప.. ప్రమోషన్ రాదు. దాంతో తీవ్ర నిరుత్సాహం.. మరోవైపు కుటుంబ భారం మోయలేక నిస్సహాయతతో ఉంటాడు. అప్పులు చేసి.. తిప్పలు పడుతుండే భాస్కర్ కుమార్ కుటుంబం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో రిస్క్ చేస్తాడు. ఆ రిస్క్ అతడి బాధలు తీర్చిందా? లేదా మరిన్ని తిప్పలు తెచ్చిపెట్టిందా? అనేది సినిమా.

బడ్జెట్ కంటే డబుల్ వసూళ్లు

లక్కీ భాస్కర్ సినిమా బడ్జెట్ రూ.56 కోట్లుకాగా.. ఇప్పటి వరకూ ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.109.82 కోట్లని వసూలు చేసింది. సీతారామం సినిమా కంటే ఇది చాలా ఎక్కువ. మూవీ రిలీజ్‌కి ముందు ఓ ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. కనీసం లక్కీ భాస్కర్ మూవీతోనైనా తన రూ.100 కోట్ల వసూళ్ల కల తీరుతుందేమోనని ఆశపడ్డారు.

ఓటీటీలోకి లక్కీ భాస్కర్

లక్కీ భాస్కర్ మూవీ ఓటీటీ హక్కుల్ని నెట్‌‌ఫ్లిక్స్ మంచి ఫ్యాన్సీ ధరకి దక్కించుకుంది. మూవీ ఇప్పటికే థియేటర్ల నుంచి కనుమరుగు కావడంతో.. స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. బుధవారం (నవంబరు 27) అర్ధరాత్రి నుంచే లక్కీ భాస్కర్ మూవీ స్ట్రీమింగ్‌కిరానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులో ఉండనుంది.

Whats_app_banner