Amla Ginger Chutney: ఉసిరికాయలతో పచ్చడి ఇలా చేస్తే వావ్ అనాల్సిందే.. ఈజీగా చేయండిలా..-amla ginger chutney recipe making process ingredients usirikaya allam pachadi ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Amla Ginger Chutney: ఉసిరికాయలతో పచ్చడి ఇలా చేస్తే వావ్ అనాల్సిందే.. ఈజీగా చేయండిలా..

Amla Ginger Chutney: ఉసిరికాయలతో పచ్చడి ఇలా చేస్తే వావ్ అనాల్సిందే.. ఈజీగా చేయండిలా..

Amla Ginger Chutney: ఉసిరికాయలు, అల్లం కలిపి చేసే ఈ పచ్చడి రుచి వావ్ అనేలా ఉంటుంది. పులుపు, కారం కలబోతతో అదిరిపోతుంది. ఈ పచ్చడి ఎలా చేయాలంటే..

Amla Ginger Chutney: ఉసిరికాయలతో పచ్చడి ఇలా చేస్తే వావ్ అనాల్సిందే.. ఈజీగా చేయండిలా..

ఉసిరికాయలో చాలా పోషకాలు ఉంటాయి. విటమిన్ సీ, బీ6, ఏ, కాల్షియం, ఐరన్ సహా మరిన్ని విటమిన్లు, మినరల్స్ ఉసిరిలో ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచడం నుంచి చాలా ఆరోగ్య ప్రయోజనాలను ఈ ఉసిరి శరీరానికి అందిస్తుంది. అందుకే ఉసిరికాయలను ఈ శీతాకాలం తప్పకుండా తీసుకోవాలి. ఉసిరికాయ, అల్లంతో ఓ రుచికరమైన పచ్చడి చేసుకోవచ్చు. అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. ఈ ‘ఉసిరికాయ అల్లం పచ్చడి’ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

ఉసిరికాయ అల్లం పచ్చడికి కావాల్సిన పదార్థాలు

  • 200 గ్రాముల ఉసిరికాయలు (కట్ చేసి విత్తనాలు తీసేయాలి)
  • ఓ ఇంచు అల్లం (ముక్కలుగా కట్ చేయాలి)
  • రెండు టేబుల్ స్పూన్‍ల నూనె
  • ఓ టీస్పూన్ మెంతులు
  • 8 ఎండు మిర్చి
  • 5 పచ్చిమిర్చి
  • ఓ టీస్పూన్ ఆవాలు
  • ఓ టీస్పూన్‍ మినప్పప్పు
  • చికెడు పసుపు
  • గుప్పెడు కొత్తిమీర
  • రెబ్బ కరివేపాకు
  • తగినంత ఉప్పు

ఉసిరికాయ అల్లం పచ్చడి తయారీ విధానం

  • స్టవ్‍పై కళాయి పెట్టి నూనె పోయాలి. నూనె వేడెక్కాక అందులో ముందుగా మెంతులు, ఆవాలు వేయాలి. మెంతులు కచ్చితంగా రంగు మారే వరకు వేపుకోవాలి. రంగు మారకపోతే చేదుగా ఉంటాయి.
  • మెంతులు బాగా వేగాక.. అందులో మినప్పప్పు వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం ముక్కలు వేసి ఓ 20 సెకన్లు వేపాలి.
  • ఆ వెంటనే ఎండుమిర్చి వేసి కాస్త వేగనివ్వాలి. పచ్చిమిర్చి వేసి వేపాలి.
  • ఆ తర్వాత ఉసిరికాయ ముక్కలు, పసుపు ,కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలపాలి.
  • ఉసిరికాయ ముక్కలను బాగా మగ్గనివ్వాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
  • ఉసిరికాయ ముక్కలు మగ్గిన తర్వాత అన్నింటినీ మిక్సీ జార్‌లో వేసుకోవాలి.
  • జార్‌లో గుప్పెడు కొత్తమీర, కాసిన్ని నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే ఉసిరికాయ అల్లం పచ్చడి రెడీ అవుతుంది.

 

వేడి అన్నంలో ఈ ఉసిరికాయ అల్లం పచ్చడి కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. దోశలు, చపాతీల్లోకి కూడా సూటవుతుంది. పుల్లగా, కారంగా నాలుక వావ్ అనేలా టేస్ట్ ఇస్తుంది.

ఉసిరికాయల్లో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని ఇవి పెంచుతాయి. ఉసిరికాయ తింటే వ్యాధులు, ఇన్‍ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది. శరీరంలో కణాలు డ్యామేజ్ కాకుండా ఉసిరి చేయగలదు. యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి కూడా ఉసిరి మేలు చేస్తుంది. అల్లంలో కూడా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్‍ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఈ రెండు కలిపి చేసే ఈ పచ్చడి ఆరోగ్యానికి కూడా మంచి చేస్తుంది.