Ginger Storage: అల్లం ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉండాలంటే ఈ పద్దతులను పాటించండి
Ginger Storage: అల్లం టీ ఎంతోమందికి ఫేవరేట్. కూరల్లో కూడా అల్లాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. దీనిలో ఉండే పోషకాలు మన శరీరానికి చాలా అవసరం. అల్లం కొన్నిసార్లు ఫ్రిజ్లో ఉంచినప్పుడు కుళ్లిపోవడం లేదా పొడిగా మారడం జరగుతుంది. అల్లాన్ని ఎలా స్టోరేజ్ చేయాలో తెలుసుకోండి.
అల్లం టీ రుచి అందరికీ నచ్చుతుంది. చలికాలం మొదలయ్యే కొద్దీ ప్రతి ఇంట్లో అల్లం వాడకం పెరుగుతుంది. అల్లం టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గొంతు దురద, జలుబు వంటి వాటితో బాధపడేవారు అల్లం టీ తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
శీతాకాలంలో ఎంతో మంది అల్లాన్ని తెచ్చి ఇంట్లో నిల్వ చేస్తారు. కాని అవి త్వరగానే చెడిపోవడం ప్రారంభిస్తాయి. అలా అని ఫ్రిజ్ లో ఉంచినా కూడా ఇది తరచూ పాడైపోతూ ఉంటుంది. బయట ఉంచితే ఎండిపోతుంది, ఫ్రిజ్ లో పెడితే బూజు త్వరగా పట్టేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అల్లాన్ని ఎలా నిల్వ చేయాలో తెలుసుకోండి.
అల్లాన్ని ఎక్కువకాలం పాటూ తాజాగా ఉంచాలంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. వాటిని చాలా సింపుల్‌గా నిల్వ చేయవచ్చు. అల్లాన్ని కొనేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. కొనేటప్పుడు తాజాగా ఉండే అల్లాన్నే కొనుక్కోవాలి. అప్పటికే ఎండిపోయిన అల్లం, తడి తడిగా ఉండే అల్లం కొనకూడదు. ఇవి ఎక్కువ కాలం పాటూ నిల్వ ఉండవు. కాబట్టే తాజాగా ఉండే అల్లాన్ని కొనుక్కోవాలి.
అల్లాన్ని ఫ్రిజ్ కంటైనర్లో
తాజా అల్లంను ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. ఫ్రిజ్ లో ఉంచితే అల్లం ఎక్కువ సేపు చెడిపోదు. అల్లాన్ని ఫ్రిజ్ లో గాలి చొరబడని కంటైనర్ లో నిల్వ చేయడానికి ప్రయత్నించండి. కంటైనర్ లేకపోతే, మీరు దానిని జిప్ లాక్ బ్యాగ్లో కూడా ఉంచవచ్చు. ఇలా చేయడం వల్ల అల్లం చాలా తాజాగా ఉంటుంది.
అల్లం తొక్క తీసి
అల్లాన్ని ఎక్కువ కాలం పాటూ నిల్వ ఉంచాలంటే సింపుల్ చిట్కా ఒకటి ఉంది. వీటిని పైన పొట్టు తీసి తరిగి నిల్వ ఉంచుకోవాలి. ఇలా చేసిన తర్వాత బేకింగ్ షీట్ పై ఉంచి ఫ్రిజ్ లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల అల్లంను ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవచ్చు.
అల్లాన్ని బయట నిల్వ చేయాలనుకుంటే దాన్ని కాగితంలో చుట్టి ఉంటుంది. అల్లం కాస్త తడిగా ఉన్నా కూడా ఫ్రిజ్ లో పెట్టకూడదు. తడిని తుడిచేసి అప్పుడు నిల్వ చేయాలి. తడిగా ఉంటే కొద్దిసేపు గాలిలో ఆరబెట్టాలి. తరువాత కాగితంలో చుట్టాలి.
అల్లంలో మన శరీరానికి అత్యవసరమైన పోషకాలు ఉంటాయి. అల్లాన్ని నిల్వ చేయలేమోమో అనుకుని కొనడం, వాడడం మానేయద్దు. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అలాగే వికారం, వాంతులు వంటి లక్షణాలతో బాధపడుతుంటే అల్లాన్ని వాసన చూడడం వంటివి చేస్తే ఆ సమస్య తగ్గుతుంది. అల్లం వాడడం వల్ల బరువు తగ్గేందుకు, కీళ్ల నొప్పులు తగ్గించేందుకు ఉపయోగపడతాయి. తరచూ పొట్టనొప్పితో బాధపడుతుంటే అల్లాన్ని ఆహారంలో భాగం చేసుకోండి. అల్లాన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది.
టాపిక్