Natu Kodi Pachadi: నాటుకోడి పచ్చడి రెసిపీ, ఇలా చేస్తే నాలుగు నెలల నిల్వ ఉంటుంది-natu kodi pachadi recipe in telugu know how to make this country chicken pickle ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Natu Kodi Pachadi: నాటుకోడి పచ్చడి రెసిపీ, ఇలా చేస్తే నాలుగు నెలల నిల్వ ఉంటుంది

Natu Kodi Pachadi: నాటుకోడి పచ్చడి రెసిపీ, ఇలా చేస్తే నాలుగు నెలల నిల్వ ఉంటుంది

Haritha Chappa HT Telugu
Nov 17, 2024 11:30 AM IST

Natu Kodi Pachadi: నాటుకోడి కూర ఎంత రుచిగా ఉంటుందో నాటుకోడి పచ్చడి కూడా అంతే రుచిగా ఉంటుంది. కంట్రీ చికెన్ పికెల్ రెసిపీ చాలా సులువు.

నాటుకోడి పచ్చడి రెసిపీ
నాటుకోడి పచ్చడి రెసిపీ

నాటుకోడి కూర పేరు చెబితేనే ఎంతో మందికి తినేయాలి అనిపిస్తుంది. నాటుకోడి ఎప్పుడు పడితే అప్పుడు వండుకోలేము. అందుకే ఒకసారి దీన్ని పచ్చడి చేసి పెట్టుకుంటే ప్రతిరోజూ ఈ పచ్చడితో రెండు ముద్దలు తినొచ్చు. ఇక్కడ మేము కంట్రీ చికెన్ పికిల్ రెసిపీ ఇచ్చాము. ఇది వేడి వేడి అన్నంలోనే కాదు, దోశలతో తిన్నా, చపాతీతో తిన్నా రుచిగా ఉంటుంది. నాటుకోడి కూరలాగే నాటుకోడి పచ్చడి కూడా ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. ఈ కంట్రీ చికెన్ పికిల్ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

నాటుకోడి పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు

చికెన్ - ఒక కిలో

కారం - అర కప్పు

ఉప్పు - రుచికి సరిపడా

అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు

నూనె - ఒక కప్పు

ఆవాలు - ఒక స్పూన్

జీలకర్ర - ఒక స్పూన్

ధనియాల పొడి - నాలుగు స్పూన్లు

జీలకర్ర - ఒక స్పూను

మెంతి పొడి - ఒక స్పూను

గరం మసాలా పొడి - రెండు స్పూన్లు

పసుపు - ఒక స్పూన్

నిమ్మరసం - పావు కప్పు

నాటుకోడి పికిల్ రెసిపీ

1. నాటుకోడిని మొక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. పెద్ద ముక్కలుగా కాకుండా కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

3. ఆ గిన్నెలో రెండు స్పూన్ల కారంపొడి, రెండు స్పూన్ల ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలిపి అరగంట పాటు పక్కన పెట్టేయాలి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. దీనిలో మ్యారినేట్ చేసిన చికెన్ ను వేయాలి.

5. కొద్దిసేపట్లోనే ఇది నీటిని విడుదల చేస్తుంది.

6. ఆ నీరంతా ఇంకిపోయే వరకు దీన్ని వేయిస్తూనే ఉండాలి.

7. చిన్న మంట మీద వేయిస్తే మంచిదే, లేకుంటే మాడిపోయే అవకాశం ఉంది.

8. ఇవి బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి.

9. ఇప్పుడు మిగిలిన నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి.

10. చిన్న మంట మీదే నూనె ఉండనివ్వాలి.

11. ఆ తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఆవాల పొడి, పసుపు వేసి బాగా కలుపుకోవాలి.

12. ఉడికిన చికెన్ ముక్కలను కూడా అందులో వేసి బాగా కలపాలి స్టవ్ ఆఫ్ చేసేయాలి.

13. ఈ మొత్తం మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.

14. తర్వాత నిమ్మరసాన్ని అందులో వేసి కలుపుకోవాలి.

15. దీన్ని రెండు మూడు నెలల పాటు తాజాగా నిల్వ పెట్టుకోవచ్చు. ఎప్పుడు తినాలన్నా తినవచ్.చు

సాధారణ బ్రాయిలర్ కోడితో పోలిస్తే నాటుకోడి ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరానికి బలాన్ని ఇస్తుంది. దీన్ని చేయడం ఈ నాటుకోడి పికిల్ చేయడం చాలా సులువు. ఒక్కసారి మీరు చేశారంటే దీనికి అభిమాని అయిపోతారు. స్పైసీగా కావాలనుకున్నవారు కారాన్ని పెంచుకుంటే సరిపోతుంది. లేదా కారం తగ్గించుకుంటే పిల్లలు కూడా దీన్ని తినవచ్చు.

Whats_app_banner