House North Direction: మీ ఇంటి ఉత్తరం వైపు ఇలా ఉండేలా చూసుకోండి, ఆర్థికంగా కలిసొస్తుంది
House North Direction: వాస్తు ప్రకారమే ఇల్లు ఉండాలి, లేకుంటే ఆర్థిక సమస్యలు, కుటుంబంలో వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇంటి ఉత్తరం వైపు ఎలా ఉండాలో నిపుణులు చెబుతున్నారు.
ఇంటికి వాస్తు చాలా ముఖ్యం. వాస్తు పరంగా ఉండే ఇంట్లో సుఖసంతోషాలు, సకల సంపదలు కలుగుతాయని చెప్పుకుంటారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే లక్ష్మీదేవి వస్తుందని అంటారు. అయితే ఒక ఇంటికి ఈశాన్యం మూల ఎంతో ముఖ్యమైనది. ఉత్తరం వైపు ఉండే భాగాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉత్తర దిక్కును ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత ఆర్ధికాభివృద్ధి జరుగుతుందని చెబుతారు. వాస్తు శాస్త్ర ప్రకారం కుబేరుడు ఉత్తర దిశకు అధిపతి. కుబేరుని చేతిలో బంగారం, నగలు, సంపద నిండి ఉంటాయి. ఆయన చేతులు ఏనాడూ ఖాళీగా ఉండరు. అందుకే ఉత్తర దిక్కున ఉన్న ఇంటి భాగాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే కుబేరుడి అనుగ్రహం కలుగుతుందని చెబుతారు.
ఇల్లు ఇలా ఉండాలి
ఇంటి ఉత్తరం వైపు ఎలా ఉండాలో వాస్తు నిపుణులు వివరిస్తున్నారు. ఒక ఇంటికి ఉత్తరాన ఉన్న ఖాళీ స్థలం దక్షిణాన ఉండే ఖాళీ స్థలం కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. వాస్తు శాస్త్ర ప్రకారం తూర్పు, ఉత్తరం వైపు తక్కువ భూమిని ఉంచుకొని, దక్షిణ పడమర వైపున ఎక్కువ ఖాళీ స్థలాన్ని ఉంచుకునే వారికి సుఖం, శ్రేయస్సు లభిస్తుందని చెబుతారు. అలాగే తూర్పు, ఉత్తరం వైపు ఎత్తు ఉండకూడదు. దక్షిణా పడమర వైపు భూమి ఎత్తుగా ఉండాలి. తూర్పు ఉత్తరాన ఉండే భూమి కాస్త లోతుగా ఉండాలి. ఇలా ఉంటే ఉత్తరం వైపు చాలా సానుకూల శక్తి ప్రవహించే అవకాశం ఉంది. ఉత్తరం వైపు ఉండే కిటికీలను, తలుపులను కచ్చితంగా తెరిచి ఉంచాలి. అటువైపు నుంచే సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇంట్లోని వారికి ఇది మంచి చేస్తుంది.
ఈ పనులు చేయకండి
ఇంట్లోనే చెత్తాచెదారాన్ని పేర్చి కాల్చడం వంటివి ఇంటి ఉత్తర దిశలో చేయకూడదు. ఇంటి ఉత్తర దిశలో రాళ్లను కూడా పోగు చేయకూడదు. దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ నాశనం అయిపోతుంది. వీలైనంతవరకు ఇల్లు ఉత్తర ముఖంగా ఉంటే ఎంతో మంచిది. ఉత్తర ముఖంగా ఉండే ఇళ్లల్లో నివసించే వారికి కుబేర అనుగ్రహం దొరుకుతుందని, ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుందని చెబుతారు. ఉత్తరముఖంగా ఉండే ఇళ్లలో నివసించే స్థానికులు మంచివారిగా, తెలివైన వారిగా సహనం ఉన్న వారిగా, దూర దృష్టి ఉన్న వారిగా మారుతారు. వ్యాపారంలోని అడ్డంకులు ఉద్యోగ అవరోధాలు కూడా వారికి ఏర్పడవు.
ఇంటి ఈశాన్యం మూల సరిగా లేకపోయినా ఉత్తర దిక్కు వైపు సరైన పద్ధతులు పాటించకపోయినా ఆర్థిక నష్టం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు వంటివి వస్తాయి. కాబట్టి ఒక ఇంటి నిర్మాణంలో ఈశాన్య మూల, ఉత్తరం దిక్కు అనేవి చాలా ముఖ్యమైనవి. ఇంటి ఉత్తర దిక్కును వీలైనంత పరిశుభ్రంగా ఉంచండి. చెత్తా చెదారం వంటివి పడేయకండి. ఉత్తరం దిక్కునుంచి గాలి వీచేలా చూడండి. ఇవన్నీ మీలో సానుకూల శక్తిని పెంచుతాయి.
(గమనిక: ఇక్కడిచ్చిన పూర్తిగా కచ్చితమైనదని, సత్యమని మేము చెప్పడం లేదు. మరింత లోతైన సమాచారం కోసం ఆ రంగంలోని వాస్తు నిపుణులను సంప్రదించండి.)
టాపిక్