ఇన్‌స్టా రీల్స్ చూస్తూ టైమ్ వేస్ట్ చేయకండి.. ఇలా చేస్తూ నెలకు లక్షలు సంపాదించండి-dont waste time on watching instagram reels make insta reels and earn money know 4 type of influencers here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఇన్‌స్టా రీల్స్ చూస్తూ టైమ్ వేస్ట్ చేయకండి.. ఇలా చేస్తూ నెలకు లక్షలు సంపాదించండి

ఇన్‌స్టా రీల్స్ చూస్తూ టైమ్ వేస్ట్ చేయకండి.. ఇలా చేస్తూ నెలకు లక్షలు సంపాదించండి

Anand Sai HT Telugu
Nov 26, 2024 04:30 PM IST

Instagram Reels : ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చూడటం మెుదలుపెడితే గంటలు గంటలు టైమ్ వేస్ట్ అవుతుంది. కానీ మీరు తలచుకుంటే అదే ఇన్‌స్టాగ్రామ్ నుంచి లక్షలు సంపాదించొచ్చు. అది ఎలానో తెలుసుకుందాం..

ఇన్‌స్టాగ్రామ్
ఇన్‌స్టాగ్రామ్

డబ్బులు సంపాదించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. కానీ ఎలా తెలివిగా సంపాదించాలో తెలిసి ఉండాలి. సోషల్ మీడియా పెరిగాక చిన్న వయసులోనూ లక్షల డబ్బు సంపాదిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. బాగా డబ్బులు వచ్చేందుకు ఇన్‌స్టా ఒకటి. అయితే మనం దీనిని కేవలం రీల్స్ చూసేందుకు మాత్రమే ఉపయోగిస్తుంటాం. కానీ సరిగా ప్లాన్ చేస్తే చాలా డబ్బులు సంపాదించొచ్చు.

ఇంతకుముందు ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు మాత్రమే షేర్ చేసేందుకు ఉండేది. తర్వాత వీడియో కంటెంట్ వచ్చింది. రీల్స్ చూడటం మనం చేస్తుంటాం.. కానీ ఆ రీల్స్ ద్వారా చాలా మంది ఇన్‌ఫ్లూయెన్సర్‌లు డబ్బులు సంపాదిస్తారు. ఇన్‌స్టా చాలా మందికి ఆదాయ వనరుగా మారింది.

డబ్బు సంపాదించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. డబ్బు సంపాదించడానికి సులభమైన మార్గాలను అనుసరించాలని చూస్తారు. చాలా మంది సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి డబ్బు సంపాదించడం మెుదలుపెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు లక్ష కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉంటే ఎంత డబ్బు సంపాదించవచ్చో తెలుసుకోండి.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ఆధారంగా మీకు డబ్బులు వస్తాయి. వివిధ రకాల కంపెనీల బ్రాండ్లను మీరు ప్రమోట్ చేస్తే మంచి రాబడి ఉంటుంది. వారి కంపెనీకి చెందిన ప్రకటనలు, రీల్స్ ద్వారా డబ్బులు తీసుకోవచ్చు. రీల్స్ సహాయంతో వ్యాపారం, ఉత్పత్తిని ప్రచారం చేయవచ్చు. వారి లింక్‌లను మీ బయోలో అందించడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. పోస్ట్ చేసిన వీడియో కామెంట్‌లో ఏదైనా ఉత్పత్తి లింక్‌ను ఇవ్వాలి. ఎవరైనా దాని ద్వారా ఉత్పత్తులను కొనుగోలు చేస్తే మీకు కమీషన్ కూడా లభిస్తుంది.

బ్రాండ్‌లతో భాగస్వామ్యం అయి డబ్బు సంపాదిస్తారు. రీల్స్ ద్వారా ఆ బ్రాండ్ ఉత్పత్తులను ప్రచారం చేయడం ద్వారా మీరు ఆదాయాన్ని పొందవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఆధారంగా నాలుగు విభాగాలుగా విభజిస్తారు. అందులో 20 వేల నుండి 50 వేల మంది ఫాలోవర్లు ఉన్న వారిని మైక్రో ఇన్‌ఫ్లుయెన్సర్‌లుగా పరిగణిస్తారు. 60 వేల నుండి 1.6 లక్షల మంది ఫాలోయర్లను మాక్రో ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అని, 3 నుండి 5 లక్షల మంది ఫాలోవర్లు మెగా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, 7 నుండి 15 లక్షల మంది ఫాలోవర్లు పాపులర్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అని చెబుతారు.

నానో ఇన్‌ఫ్లుయెన్సర్లు 20 నుండి 30 వేల రూపాయల వరకు సంపాదిస్తారు. అయితే మైక్రో ఇన్‌ఫ్లుయెన్సర్లు 30 నుండి 60 వేల రూపాయల వరకు సంపాదిస్తారు. మాక్రో ఇన్‌ఫ్లుయెన్సర్‌లు రూ.60,000 నుండి రూ.68,000 వరకు సంపాదిస్తారు. మెగా, సెలబ్రిటీలు చాలా డబ్బును పొందుతారు. ఈ ఆదాయ సంఖ్య మారుతూ ఉంటుంది. మీరు ఇచ్చే కంటెంట్ ఆధారంగా మీరు ఎక్కువ మంది ఫాలోవర్స్ పొందవచ్చు. ఇకపై రీల్స్ చూసి టైమ్ వేస్ట్ చేసే బదులుగా ఇన్‌ఫ్లూయెన్సర్ అయ్యేందుకు ప్లాన్ చేయండి.

Whats_app_banner